అంతిమతీర్పు
అంతిమతీర్పు 1988లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి జోషీ దర్శకత్వం వహించాడు.[1] అదే దర్శకుడి స్వంత మలయాళ చిత్రం "న్యూఢిల్లీ"కి రీమేక్ చిత్రం. ఈ చిత్రం ఇర్వింగ్ వాల్లాస్ రాసిన నవల "ఆల్ మైటీ " ఆధారంగా నిర్మించబడింది. ఇది మొత్తం న్యూఢిల్లీలో చిత్రీకరించబడిన ఒకే ఒక తెలుగు చిత్రం. ఈ చిత్రంలో కృష్ణం రాజుకు తెలుగు సినిమాలో ఉత్తమ నటునిగా ఫిలిం ఫేర్ పురస్కారం లభించింది.[2][3]
అంతిమ తీర్పు రెబల్ స్టార్ కృష్ణంరాజు సినీ కెరీర్ లోనే ప్రత్యేకమైన చిత్రం. మలయాళ వెర్సటైల్ డైరెక్టర్ జోషి తెలుగులో తొలిసారిగా తెరకెక్కించిన ఈ సినిమా 1988 లో విడుదలై అప్పటి ప్రేక్షకుల్ని అబ్బుర పరిచింది. నిజానికి మలయాళంలో జోషి దర్శకత్వంలోనే తెరకెక్కిన ‘న్యూ ఢిల్లీ’ సినిమాకి రీమేక్ వెర్షన్ . మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా కృష్ణంరాజు కెరీర్ లోనూ మరిచిపోలేని చిత్రమైంది. ఒరిజినల్ వెర్షన్ లో నటించిన కథానాయిక సుమలత, ఊర్వశి, త్యాగరాజన్, సురేష్ గోపీ లాంటి నటీనటులే తెలుగులోనూ నటించి మెప్పించారు.
ఈ మూవీలో కృష్ణంరాజు తర్వాత అంతటి స్థాయిలో పేరు తెచ్చుకున్న నటుడు నటరాజ విష్ణుగా నటించిన త్యాగరాజన్ (జీన్స్ హీరో ప్రశాంత్ తండ్రి ).
కథ
[మార్చు]స్వార్ధ రాజకీయాలకు బలై, నా అన్న వాళ్ళను పోగొట్టుకొని, అవిటివాడిగా మారిన నిజాయితీ పరుడైన ఒక జర్నలిస్ట్ అయిన జి.కె (కృష్ణంరాజు) సొంతంగా ఒక పేపర్ స్థాపించి తనను ఆ స్థితికి తీసుకొచ్చిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడమే ‘అంతిమ తీర్పు’ చిత్ర కథ.
తారాగణం
[మార్చు]- కృష్ణం రాజు - జి, జె
- త్యాగరాజన్
- సుమలత - వసంత
- ప్రభాకరరెడ్డి
- రంగనాథ్
- సురేష్ గోపి
- ఊర్వశి
- మోహన్ జోస్
- గుమ్మడి వెంకటేశ్వరరావు
మూలాలు
[మార్చు]- ↑ "Anthima Theerpu (1988)". Indiancine.ma. Retrieved 2020-08-01.
- ↑ "Krishnam Raju Awards: List of awards and nominations received by Krishnam Raju | Times of India Entertainment". timesofindia.indiatimes.com. Retrieved 2020-08-01.
- ↑ "ఆయన తెలుగు తెర రెబెల్ స్టార్". సితార. Archived from the original on 2021-01-20. Retrieved 2020-08-01.