అడవి దొంగ
(అడవిదొంగ నుండి దారిమార్పు చెందింది)
అడవి దొంగ | |
---|---|
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
రచన | పరుచూరి సోదరులు (కథ, సంభాషణలు) |
నిర్మాత | చలసాని గోపి |
తారాగణం | చిరంజీవి,రాధ,శారద |
ఛాయాగ్రహణం | కె. ఎస్. ప్రకాష్ |
కూర్పు | డి. వెంకటరత్నం |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1985 నవంబరు 19 |
భాష | తెలుగు |
అడవి దొంగ 1985 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో చిరంజీవి, రాధ ప్రధాన పాత్రధారులు. గోపీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై చలసాని గోపీ నిర్మించిన ఈ సినిమాకి సంగీతం కొమ్మినేని చక్రవర్తి సమకూర్చారు.
కథ[మార్చు]
వసుంధర (శారద), విశ్వం (సూరపనేని శ్రీధర్) ఆదర్శ దంపతులు. అడవికి దగ్గర్లో ఉన్న ఒక ఊర్లో ఉంటూ అక్కడి ప్రజల్ని చదువు చెప్పి చైతన్యవంతుల్ని చేస్తుంటారు. వసుంధర అన్న (జగ్గయ్య) ఒక పోలీసు ఆఫీసరు. ఆయనకు వసుంధర విశ్వాన్ని పెళ్ళి చేసుకుని అలా సేవ చేయడం ఇష్టం ఉండదు.
తారాగణం[మార్చు]
- కాళిదాసు గా చిరంజీవి
- సరోజ గా రాధ
- వసుంధర గా శారద
- విశ్వం గా సూరపనేని శ్రీధర్
- తోడేళ్ళ అప్పల నాయుడు గా రావు గోపాలరావు
- కొండల నాయుడు గా నూతన్ ప్రసాద్
- వసుంధర అన్నయ్య గా జగ్గయ్య
- ఫారెస్టు అధికారి గా రంగనాథ్
- పులిగాడు గా చలపతి రావు
- అవధాని గా అల్లు రామలింగయ్య
- సూరీడు గా పి. ఎల్. నారాయణ
- మాడా వెంకటేశ్వర రావు
- చిడతల అప్పారావు
పాటలు[మార్చు]
- వానా వానా వందనం
- చల్లగాలి
- ఇది ఒక నందనవనమూ
- ఓం నమ: శివాయ
- వీర విక్రమ