అత్త

వికీపీడియా నుండి
(అత్తయ్య నుండి దారిమార్పు చెందింది)

అత్త, అత్తయ్య లేదా అత్తగారు ఒక విధమైన మానవ సంబంధాలలో పిలుపు. ఒక వ్యక్తి భార్య లేక భర్త యొక్క తల్లిని అత్తగారు అని పిలుస్తారు. అత్తగార్ని తల్లితో సమానంగా భావించి ఇంగ్లీషులో "Mother-in-law" అని అంటారు. తల్లి సోదరుడి భార్యను మరియు నాన్న సోదరిని కూడా అత్త అంటారు. నాన్న సోదరి మేనత్త అవుతుంది, మేనత్త సంతానంతో వివాహమును మేనరికము అంటారు.

  • మేనత్త : తండ్రి అక్క లేదా చెల్లెల్లిని మేనత్త అని పిలుస్తారు. మేనత్త భర్త మావయ్య అవుతాడు. మేన మామ కాడు.

మేనమామ: తల్లి అన్నయ్య లేదా తమ్ముడు మేనమామ అని పిలుస్తారు. మేనమామ భార్య (అత్త) అవుతుంది మేనత్త కాదు. ఇక్కడ మేన పదం మేను (శరీరం) అనే అర్ధం. మేనమామ, మేనత్త లు తమ రక్తం పంచుకుపుట్టిన వారు అని, తమ మేనులో (శరీరంలో) భాగమని భావిస్తారు

విషయ సూచిక

గొడవలకు కారణాలు [మార్చు]

  • కోడలికి చాకిరీ చేయటం అత్తకు, అత్తకు చాకిరీ చేయటం కోడలికి ఇష్టం లేక.
  • ఒంటరిగా ఉండాలనే కోరికతో కావాలనే గొడవపెట్టుకోవటం,వెళ్ళగొట్టటం
  • కట్నం డబ్బుల సమస్య
  • అహంకారం (ఇగో) సమస్య. ఎవరిమాట ఎవరువినాలనే పట్టుదలకు పోవటం

అత్తల హక్కుల సంక్షేమ సంఘం [మార్చు]

498 (ఎ) సెక్షన్ కోడళ్ల చేతిలో వజ్రాయుధంగా మారిన నేపథ్యంలో అత్తలకు బాసటగా నిలబడేందుకు,అత్తలకు కూడా గృహహింస నుంచి రక్షణ కల్పించటం కోసం, అత్తలు సామాజిక వివక్ష, గృహహింసలకు బలవకుండా, అత్తలకు తగిన రక్షణ,సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ మదర్స్-ఇన్-లా ప్రొటక్షన్ అసోసియేషన్ (ఏపీఎంపీఏ) ఆవిర్భావించింది.జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేప్రకారం 1.7 శాతం మహిళలు అత్తల చేతిలో హింసని అనుభవిస్తుంటే, 13.7 శాతం మహిళలు తమ సొంత తల్లుల చేతిలోనే హింసకు గురవుతున్నారు.కోడళ్లతో నరకాన్ని అనుభవిస్తున్న అత్తలు 9704683163, 9573605415 నెంబర్లలో సంప్రదించ వచ్చు(ఈనాడు 18.10.2009).

అత్తపై పాటలు [మార్చు]

  • అత్త ఒడీ పువ్వు వలే మెత్తనమ్మా

అత్తపై సామెతలు [మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
  • అత్తా ఒకింటి కోడలే
  • అత్తలేని కోడలు ఉత్తమురాలు


"http://te.wikipedia.org/w/index.php?title=అత్త&oldid=779783" నుండి వెలికితీశారు