అనగనగా-2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అనగనగా-2 నెహ్రూ బాల పుస్తకాలయం రెండవ భాగము. ఇది ఎం.హౌక్సీ, పి.ఎం.జోషిలచే 1973లో రచింపబడింది. ఈ పుస్తకానికి పులక్ బిస్వాస్ చిత్రాలు అందించాడు. నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు 1976 (శక 1897) సం.లో తొలిసారి ప్రచురించిన ఈ పుస్తకానికి అనువాదం చల్లా రాధాకృష్ణ శర్మ. ఈ పుస్తకము ద్వితీయ ముద్రణ 1991 సం. (శక 1913) వెలువడింది.

ప్రారంభం[మార్చు]

భౌద్ద సంఘారామం కారల అనే శీర్షికతో, జీమూత్ - కార్లలోని బిక్షువులు అనే ఉపశీర్షికతో అనువాద రచన ప్రారంభ మవుతుంది. ఇందులోని మొదటి పరిచ్చేదము:- రమారమి రెండు వేల సంవత్సరాల నాటి మాట. పడమటి కనుమల్లో ఒక పెద్ద కొండ. దాన్ని మనమిప్పుడు కార్ల అంటున్నాము. ఆ కొండ కింద వలురకా అనే ఒక పల్లెటూరు.

  • ఈ పుస్తకములో మొత్తము 65 పుటలు ఉన్నాయి.

సముద్రగుప్తుని దండయాత్ర[మార్చు]

సముద్రగుప్తుడు - గుర్రపు రౌతు కొడుకు[మార్చు]

దీని గురించిన మెదటి వాక్యం పుస్తకము లోని 36వ పుటలో ఉంది. " సా.శ. 347. పాటలీపుత్రంలో మహా సందడిగా ఉం.ది. సముద్రగుప్త చక్రవర్తి కొత్త దండయాత్రకు సిద్దమవుతున్నాడు. మౌర్యుల తదనంతరం చాలా శతాబ్దులదాకా తరుచు యుద్దాలు సాగుతూ వుండేవి. సా.శ. 320 లో చంద్రగుప్తుడు గంగానదీ ప్రాంతంలో తన అధికారం స్థాపించాడు."

చివరిపుట[మార్చు]

ఈ క్రింద పొందు పరచిన వాక్యములు చివరిపుట లోనివి. "అందరూ నాయందు ఎంతో దయ చూపారు. కాని ఏ సంపద కోసం నేనిక్కడికి వచ్చానో, దాన్ని మాదేశం తీసుకు వెళ్ళాలి."

" మా మహారాజుగారు ఎన్నో కానుకలు సమర్పిస్తారు" అన్నాడు అయం.

"యాత్రికుడు సొంత కానుకలు కోరడు. కాని నేను మా విహారం కోసం, ప్రజల కోసం. గొప్ప సంపదను తీసుకు వెళుతున్నాను. 650 సంస్కృత వ్రాత ప్రతులూ, బుద్దదేవుని ప్రతిమలూ అవశేషములూ తీసుకు వెళుతున్నాను" అన్నాడు భిక్షువు. "వర్తకుల కోసరం మీరేమన్నా ఎదురు చూస్తున్నారా, స్వామీ" అడిగాడు వసుభాతి.

"లేదు. నేను వచ్చినట్టుగా, ఒంటరిగానే వెడతాను. దయాస్వభావులైన మీ రాజులు ఉత్తర దేశపు రాజులకిమ్మని, తెల్లని నూలుగుడ్డ మీద వ్రాసిన, ఎర్రని లక్కలో మహారాజుగారి ముద్రవేసిన ఉత్తరాలు నాకిచ్చారు."

వసుభాతి " మళ్ళీ మీరెప్పుడు వస్తారు, స్వామీ" అని అడిగాడు.

" పధ్నాలుగేళ్ళయింది మా దేశం నుంచి బయలుదేరి. నేను తీసుకువెళుతున్న గ్రంథాలను అనువదించాలి; వాటిని వివరించాలి. ఇందుకు, మిగిలిన నా జీవితకాలాన్ని వినియోగిస్తాను. కాని బుద్దుని మాతృభూమి అయిన యీ దేశంలో నాకు లభించిన గౌరవాన్నీ ప్రజల స్నేహభావాన్నీ నే నెప్పుడూ జ్ఞాపకము ఉంచుకుంటాను" అన్నాడు భిక్షువు.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  • ఎమ్ చౌక్సీ, పి.ఎమ్.జోషి. అనగనగా (రెండవ భాగం). Retrieved 2020-07-10.
"https://te.wikipedia.org/w/index.php?title=అనగనగా-2&oldid=3496319" నుండి వెలికితీశారు