అనుపమ గోఖలే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనుపమ గోఖలే
దేశంభారతదేశం
పుట్టిన తేది (1969-05-17) 1969 మే 17 (వయసు 54)
ముంబై
టైటిల్ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్

అనుపమ గోఖలే (జననం అనుపమ అభ్యంకర్; 1969 మే 17) భారతీయ చెస్ క్రీడాకారిణి.[1]

కెరీర్[మార్చు]

ఆమె 1989, 1990, 1991, 1993, 1997లలో భారతీయ మహిళల ఛాంపియన్‌షిప్‌ను ఐదుసార్లు, ఆసియా మహిళల ఛాంపియన్‌షిప్‌ను 1985, 1987లలో రెండుసార్లు గెలుచుకుంది. 1985లో ఆమె అడిలైడ్‌లో జరిగిన ఆసియా జూనియర్ బాలికల ఛాంపియన్‌షిప్‌లో మలేషియా క్రీడాకారిణి ఆడ్రీ వాంగ్‌తో కలిసి ఉమ్మడి విజేతగా కూడా నిలిచింది. ఈ విజయం స్వయంచాలకంగా ఇద్దరు క్రీడాకారులకు ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ బిరుదును సంపాదించిపెట్టింది.[2]

1988, 1990, 1992లలో మూడు మహిళల చెస్ ఒలింపియాడ్‌లలో;[3] 2003, 2005లలో రెండు మహిళల ఆసియా టీమ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లలో ఆమె భారత జాతీయ జట్టు తరపున ఆడింది, 2005లో చివరి ఈవెంట్‌లో జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది.[4]

ప్రస్తుతం ఆమె భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో విధులు నిర్వహిస్తోంది.

పురస్కారాలు[మార్చు]

ఆమె 16 ఏళ్ల వయసులో 1986లో పద్మశ్రీ అవార్డును,[5] 1990లో అర్జున అవార్డును అందుకుంది. ఇప్పటివరకు పద్మశ్రీ అవార్డు గ్రహీతల్లో అత్యంత పిన్న వయస్కురాలు ఆమె కావడం విశేషం.

వ్యక్తిగతం[మార్చు]

ఆమె ద్రోణాచార్య అవార్డు గ్రహీత, చెస్ క్రీడాకారుడు రఘునందన్ గోఖలేను వివాహం చేసుకుంది.

మూలాలు[మార్చు]

  1. Gokhale, Anupama FIDE rating history, 1986-2001 at OlimpBase.org
  2. Quah Seng Sun (25 April 2008). "Out of Limbo". The Star. Retrieved 11 January 2016.
  3. Anupama Abhyankar team chess record at Olimpbase.org
  4. Anupama Gokhale team chess record at Olimpbase.org
  5. "Padma Awards Directory (1954–2013)" (PDF). Ministry of Home Affairs, Government of India. Archived from the original (PDF) on 2015-10-15.

బాహ్య లింకులు[మార్చు]