అనురాధా నిప్పాణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనురాధా నిప్పాణి
జననంఅనురాధ
జూలై 1, 1960
నివాస ప్రాంతంఢిల్లీ
వృత్తితెలుగు నాటకరంగ నటి, రచయిత్రి, దర్శకురాలు
మతంహిందు
తండ్రికామేశ్వరరావు
తల్లికె. జానకి

అనూరాధ నిప్పాణి తెలుగు నాటకరంగ నటి, రచయిత్రి, దర్శకురాలు.

జననం[మార్చు]

అనురాధ 1960, జూలై 1న కామేశ్వరరావు, కె. జానకి దంపతులకు జన్మించింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నది.

నటన , దర్శకత్వం[మార్చు]

అతిథి దేవుళ్ళోస్తున్నారు, కళ్ళు, దహతి మమ మాననం మొదలగు 15 తెలుగు నాటికలు/నాటికల్లో, 6 హిందీ నాటకాల్లో, పలు నాటికల్లో నటించింది. 3 తెలుగు నాటికలకు, శ్రవ్య నాటికలకు కూడా దర్శకత్వం వహించింది.

సత్కారాలు,అవార్డులు[మార్చు]

  • 2009లో ఢిల్లీ - కన్నడ లేడీస్ క్లబ్ వారు ఈవిడను బహుముఖ ప్రజ్ఞాశాలిని - ప్రముఖ రంగస్థల నటీమణిగా గుర్తించి సత్కరించారు.
  • 2007లో కళాజగతి - మాసపత్రిక వారు ‘ఉత్తమ కళాకచ్ఛపి’ బిరుదు ఇచ్చి గౌరవించారు.

ఇతర విశేషాలు[మార్చు]

రచయిత్రిగా ఇంగ్లీషు, హిందీ, తెలుగు భాషల్లో కథారచన చేయడమేగాక, అనువాద రచనలు కూడా చేస్తుంటుంది.

మూలాలు[మార్చు]

  • అనురాధా నిప్పాణి, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 21.