అఫ్జల్ ఉద్దౌలా
వికీపీడియా నుండి
అఫ్జల్ ఉద్దౌలా (11 అక్టోబర్ 1827 - 26 ఫిబ్రవరి 1869) నాసిర్ ఉద్దౌలా కుమారుడు నిజాం పరిపాలకులలో ఐదవ అసఫ్ జా. ఇతడు హైదరాబాదును క్రీ.శ. 1857 నుండి 1869 వరకు పరిపాలించెను.
[మార్చు] సిపాయిల తిరుగుబాటు
ఈతని పరిపాలన కాలంలోనే సిపాయిల తిరుగుబాటు జరిగినది. హైదరాబాదులో బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసిన తురాబజ్ ఖాన్ ను బ్రిటిష్ వారు కాల్చి చంపారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ముస్లిం ప్రజలను రెచ్చగొడుతున్న అల్లాఉద్దీన్ మౌల్వీని బంధించి అండమాన్ దీవులకు పంపారు.
ఈ తిరుగుబాటు సమయంలో నిజాం మరియు సాలార్ జంగ్ లు కంపెనీకి పూర్తి సహకారం అందించి బ్రిటిష్ వారికి తోడ్పడినందుకు ప్రతిఫలంగా షోలాపూర్ ను తిరిగి నిజాంకు స్వాధీనం చేశారు. నిజాం కంపెనీకి చెల్లించవలసిన 50 లక్షల రూపాయలు రద్దుచేశారు. బ్రిటిష్ వారు నిజాంకు "స్టార్ ఆఫ్ ఇండియా" అనే బిరుదును ఇచ్చి సత్కరించారు.