అమృతం (ధారావాహిక)
అమృతం | |
---|---|
జానర్ | హాస్య ధారావాహిక |
సృష్టికర్త | గంగరాజు గుణ్ణం |
తారాగణం | |
Theme music composer | కళ్యాణీ మాలిక్ |
Opening theme | "ఒరే ఆంజనేయలు" బై కళ్యాణీ మాలిక్ |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 03 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 313 |
ప్రొడక్షన్ | |
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ | ఊర్మిళ గుణ్ణం |
ప్రొడక్షన్ స్థానం | హైదరాబాద్ (చిత్రీకరణ ప్రాంతం) |
నిడివి | 20–22 నిమిషాలు (ప్రతీ ఎపిసొడ్) |
ప్రొడక్షన్ కంపెనీ | జస్ట్ యెల్లో మీడియా |
డిస్ట్రిబ్యూటర్ | జస్ట్ యెల్లో మీడియా |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | జెమినీ టీవీ |
చిత్రం ఫార్మాట్ | 480i |
మొదటి షో | 18 నవంబర్ 2001 - 18 నవంబర్ 2007, ఆదివారం 8:30pm IST |
బాహ్య లంకెలు | |
Website |
అమృతం ప్రసిద్ధిచెందిన ఒక హాస్యభరితమైన తెలుగు ధారావాహిక.
పాత్రలు
[మార్చు]- అమృతం - శివాజీ రాజా/నరేష్/హర్షవర్ధన్ - అమృతరావు ధారావాహికలో ప్రధాన పాత్ర. ఇతడు అమృత విలాస్ అనే హోటల్ నడుపుతాడు.
- అంజి - గుండు హనుమంత రావు - ఆముదాల ఆంజనేయులు, అమృతరావు స్నేహితుడు. అమృత విలాస్ హోటల్ లో వంటవాడు, భాగస్వామి.
- సంజు - సంజీవని - ఝాన్సీ /సుప్రజ /అనితా చౌదరి - అమృతరావు భార్య.
- శాంత - రాగిణి, శాంత - అంజి భార్య.
- అప్పాజీ - శివనారాయణ, అమృతరావు ఇంటి యజమాని. ప్రతిరోజు అమృత విలాస్ లో పెసరట్లు, భోజనాలు ఫ్రీగా తింటూ ప్రతీ చిన్న పొరపాట్లకు పెనాల్టీలు వేస్తుంటాడు.
- సర్వం - వాసు ఇంటూరి - సర్వేశ్వరన్, అమృత విలాస్ హోటల్ లో సర్వర్
- పరంధామయ్య - దేవదాస్ కనకాల - పరంధామయ్య - అమృతరావు మామగారు.
- పద్దు - అమృతరావు మరదలు
సృష్టికర్త
[మార్చు]ఈ సీరియల్ కి గంగరాజు గుణ్ణం కాన్సెప్ట్, రచన, నిర్మాణం చేసారు. ఈ సీరియల్ ని ఆయన సొంత మీడియా హౌస్ జస్ట్ ఎల్లో పేరు మీద నిర్మించారు. అచ్చ తెలుగు బాషా హాస్యానికి ప్రస్తుత సామజిక, రాజకీయ అంశాలకు అనుగుణంగా ఈ సీరియల్ ను రూపొందించారు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ కి తావు లేకుండా హాస్యాన్ని పండించగలిగారు కాబట్టే పిల్లల నుండి పెద్దల వరకు అందరికి నచ్చింది. అమృతం చూసే ప్రేక్షకులలో అన్ని వర్గాల వారు ఉండటంతో ప్రసార టీ.ఆర్.పి రేటింగ్స్ లో నం.1 గా నిలిచింది.[1]
దర్శకత్వం
[మార్చు]ఈ సీరియల్ తో 11 మంది డైరెక్టర్లుగా పరిచయం అయ్యారు. ఈ సీరియల్ తో డైరెక్టర్ గా పరిచయం అయిన చంద్రశేఖర్ యేలేటి ఆ తరువాత ఐతే, సాహసం, అనుకోకుండా ఒక రోజు, ఒక్కడున్నాడు, మనమంతా వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సీరియల్ లో అంబుజనాభాంగా చేసిన ఎస్.ఎస్.కంచి మొదటి 30 ఎపిసోడ్స్ కు దర్శకత్వం వహించాడు. ఈ సీరియల్ లో అమృతంగా చేసిన హర్షవర్ధన్, సర్వంగా చేసిన వాసు ఇంటూరి కూడా కొన్ని ఎపిసోడ్స్ కు దర్శకత్వం వహించారు.[2]
పేరు-ప్రఖ్యాతలు
[మార్చు]ఈ సీరియల్ లో ఆంజనేయులుగా చేసిన గుండు హనుమంతరావు ప్రఖ్యాత సినీ, రంగస్థల నటుడు. ఈ సీరియల్ తో కెమెరామెన్ గా కెరీర్ ప్రారంభించిన కె.కె.సెంథిల్ కుమార్ ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ గా బాహుబలితో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ సీరియల్ లో అప్పాజిగా చెసిన నారిపెద్ది శివన్నారాయణ ఈ రోజు తెలుగు సినీ పరిశ్రమలో నటుడుగా మంచి పెరు సంపాదించుకున్నాaరు. సర్వంగా చేసిన వాసు ఇంటూరి తరువాత మరికొన్ని సీరియల్లో చేసారు. కొన్ని చిత్రాల్లోనూ నటించారు. ఈ సీరియల్ లో చిన్న పాత్రలు వేసి కెరీర్ మొదలుపెట్టిన సాగర్, ఈ రోజు మొగలిరేకులు ఆర్.కే.నాయుడుగా అందరికి సుపరిచితం. ప్రముఖ కమెడియన్ శ్రీనివాస రెడ్డి ఇందులో కొన్ని ఎపిసోడ్స్ లో నటించారు.
ప్రసారం
[మార్చు]ఈ సీరియల్ ప్రసారాన్ని2001 నవంబరు 18 లో జెమినీ టీ.వీలో ప్రారంభించారు. ప్రతి ఆదివారం రాత్రి 8:30 ని.కు ఆరేళ్ళ పాటు ప్రసారమైంది. కానీ కొత్త కథల లేమి కారణంగా 2007 నవంబరు 18 న చివరి ఎపిసోడ్ ప్రసారంతో ఈ సీరియల్ ని ముగించారు. జెమినీ టీ.వీలో స్వచ్ఛందంగా ప్రోగ్రాం స్లాట్ వదులుకున్న మొదటి కార్యక్రమం అమృతం. భారీ జనాదరణ ఉన్న సమయంలో ఈ నిర్ణయం ప్రేక్షకులని నిరాశపరచింది. తరువాత దీనికి సీక్వెల్ గా "అమృతం ఆద్వితీయం" ధారావాహికని కొనసాగింపుగా మొదలుపెడదామనుకున్నారు కానీ కుదరలేదు. ఈ సీరియల్ కి చాలా వరకు కథలని గంగరాజు గుణ్ణం, వాసు ఇంటూరి అందించారు.[2]
జీ తెలుగు ఛానల్ లో ఈ ధారావాహిక పునః ప్రసారాన్ని ప్రతిరోజూ రాత్రి 9:00 గం.లకు కొన్నాళ్ల పాటు వేశారు.[3] ఆ తరువాత మా టీవీలో వారాంతాల్లో రాత్రి 7:00 గం.లకు కొన్నాళ్ళు ప్రసారం చేసారు. తిరిగి జెమినీ టీవీలో సోమవారం - శుక్రవారం రాత్రి 10:30 కు ప్రసారం చేసారు.[4] ధారావాహిక పూర్తయ్యాక మా గోల్డ్ ఛానల్ లో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు కొన్నాళ్ళు ప్రసారం చేసారు. తరువాత ఈటీవీ ప్లస్ ఛానల్ లో సోమవారం - శుక్రవారం రాత్రి 9:30 గం.లకు ఈ ధారావాహికను ప్రసారం చేసారు. ఇలా ఛానల్ టీ.ఆర్.పీ రేటింగ్స్ కోసం దీన్ని పునః ప్రసారం చేస్తూ వచ్చారు. ఈ సీరియల్ లో ఉన్న అన్ని ఎపిసోడ్స్ ని యూట్యూబ్లో ఉచితంగా అందుబాటులో ఉంచారు.[5]
ప్రస్తుతం ఈటీవీ ప్లస్ ఛానల్ లో సోమవారం - శనివారం వరకు సాయంత్రం 6:00 గం.లకు ఈ ధారావాహికను ప్రసారం చేస్తున్నారు.[6]
పాట
[మార్చు]“ | అయ్యోలు హమ్మోలు ఇంతేనా బ్రతుకు హుహుహు
ఆహాలు ఓహోలు ఉంటాయి వెతుకు హహహ మన చేతుల్లోనే లేదా రిమోట్ కంట్రోలు ఇట్టే మార్చేద్దాము ఏడుపుగొట్టు ప్రోగ్రామ్లు ఒరే ఆంజనేలు తెగ ఆయాస పడిపోకు చాలు మనం ఈదుతున్నాం ఒక చంచాడు భవసాగరాలు కరెంట్, రెంటు ఎక్సట్రా మన కష్టాలూ కర్రీలో కారం ఎక్కువ ఐతే కన్నీళ్లు |
” |
అమృతం ధారావాహికల జాబితా
[మార్చు]Episode | Title | వీడియో లింక్ |
---|---|---|
313 | టాటా బై బై వీడుకోలు | "Tata Bye Bye Veedukolu" |
312 | అన్-హ్యాపీ డేస్ 2వ భాగం | "UN - Happy Days" Part 2 |
311 | అన్-హ్యాపీ డేస్ | "UN - Happy Days " |
310 | ప్రచారం మిథ్య | "Pracharam Mithya" |
309 | దాగుడు మూతలు | "Dagudu Moothalu" |
308 | బామ్మ కలాపం 2వ భాగం | "Bamma Kalapam" Part 2 |
307 | బామ్మ కలాపం | "Bamma Kalapam" |
306 | దొంగ యమ 3వ భాగం | "Donga Yama" Part 3 |
305 | దొంగ యమ 2వ భాగం | "Donga Yama" Part 2 |
304 | దొంగ యమ | "Donga Yama" |
303 | 24 గంటల న్యూస్ | "24 Gantala News" |
302 | బరువైన బలహీనత | "Baruvina Balahinatha" |
301 | పెసర పవర్ | "Pesara Power" |
300 | పన్ను భారం | "Pannu Bharam" |
299 | ఈనాటి ఈబంధం ఏనాటిదో | "Eenaati EeBandham Enatido" |
298 | అపహరణ | "Appaharana" |
297 | కిచెన్ టు కమతం టు నరకం | "Kitchen To Kamatham To Narakam" |
296 | దొంగల్లో దొంగ | "Dongallo Donga" |
295 | బ్రతుకే ఒక సీరియల్ 3వ భాగం | "Brathuke Oka Serial" Part 3 |
294 | బ్రతుకే ఒక సీరియల్ 2వ భాగం | "Brathuke Oka Serial" Part 2 |
293 | బ్రతుకే ఒక సీరియల్ | "Brathuke Oka Serial" |
292 | షూటింగ్ చేస్తాం | "Shooting Cheystam" |
291 | ఆపరేషన్ విల్లాస్ | "Operation Villas" |
290 | అందరూ సర్వర్లే | "Andaru Sarvarle " |
289 | సర్వం సుందరం | "Sarvam Sundaram" |
288 | భూత విలాస్ 3వ భాగం | "Bootha Vilas" Part 3 |
287 | భూత విలాస్ 2వ భాగం | "Bootha Vilas" Part 2 |
286 | భూత విలాస్ | "Bootha Vilas" |
285 | ఇంటర్నేషనల్ సర్వం | "International Sarvam" |
284 | పెసర్లు వార్డు | "Pesarlu-Wardu" |
283 | అశోక వనం | "Ashoka Vanam" |
282 | బెల్ట్ భాగవతం | "Belt Bhagavatham" |
281 | చక్రవడ్డీ | "Chakravaddi" |
280 | ఏప్రిల్ ఫూల్ | "April Fool" |
279 | ఎన్నికల పరీక్ష 3వ భాగం | "Ennikala Pariksha" Part 3 |
278 | ఎన్నికల పరీక్ష 2వ భాగం | "Ennikala Pariksha" Part 2 |
277 | ఎన్నికల పరీక్ష | "Ennikala Pariksha" |
276 | సంతకం చేస్తే పల్లు వ్రాలు | "Santhakam Cheyste pallu Vralu" |
275 | సులభ సులోచనాలు | "Sulabha Sulochanalu" |
274 | దివ్వి దివ్వి టివి టామ్ | "Divvi Divvi TV Tom" |
273 | ఉచిత విహారం 2వ భాగం | "Uchita Viharam" Part 2 |
272 | ఉచిత విహారం | "Uchita Viharam" |
271 | భీమ దీక్ష | "Beema Deeksha" |
270 | వజ్రోత్సవం | "Vajrostavam" |
269 | సరుకుల సందడి సద్దుమణిగింది | "Sarukula Sandadi Saddumanigindi" |
268 | పిచ్చికి ఆఖరి అంతస్తు | "Pichiki Akhari Anthasthu" |
267 | సంవత్సరం మారింది | "Savathsaram Marindhi" |
265 | క్లీన్ బోల్డ్ | "Clean Bold" |
264 | చెవిటి దొంగ | "Cheviti Donga" |
263 | సారీ ఎక్స్ఛేంజ్ | "Saree Exchange" |
262 | నోము పండింది | "Nomu Pandendi" |
261 | గాన కోకిల | "Gana Kokila" |
260 | 5 = 50 = 0 | "5 = 50 = 0" |
259 | హిందీ వైటర్ | "Hindi Waiter" |
258 | లాడెన్ మాసం 2వ భాగం | "Laden Masam" Part 2 |
257 | లాడెన్ మాసం | "Laden Masam" |
256 | రిమోట్ సంపాదన | "Remote Sampadana" |
255 | గాలి ప్రయాణం 2వ భాగం | "Gaali Prayanam" Part 2 |
254 | గాలి ప్రయాణం | "Gaali Prayanam" |
253 | ఒక పిజ్జా కథ 3వ భాగం | "Oka Pizza Katha" Part 3 |
252 | ఒక పిజ్జా కథ 2వ భాగం | "Oka Pizza Katha" Part 2 |
251 | ఒక పిజ్జా కథ | "Oka Pizza Katha" |
250 | చవితి చలి మంటలు | "Chavithi Chali Mantalu" |
249 | రేడియో బజ్జీ వెర్సస్ బ్రేకింగ్ న్యూస్ - రెండవ భగం | "Radio Bajji Vs Breking News" |
248 | రేడియో బజ్జీ వెర్సస్ బ్రేకింగ్ న్యూస్ | "Radio Bajji Vs Breking News" |
247 | దోమకాటు కోడికి చేటు | "Domakatu - Kodiki Chetu" |
246 | బట్లర్ బ్రహ్మచారి 2వ భాగం | "Butler Brammachaari" Part 2 |
245 | బట్లర్ బ్రహ్మచారి | "Butler Brammachaari" |
244 | ఓనర్ వెర్సస్ మేజర్ | "Owner vs Major" |
243 | ఇచ్చట మూత్రం పోయరాదు | "Icchata Mootram poyaradu" |
242 | లక్కీ స్టోన్ | "Lucky Stone" |
241 | నాన్న - 3వ భాగం | "Nanna" Part 3 |
240 | నాన్న - 2వ భాగం | "Nanna" Part 2 |
239 | నాన్న | "Nanna" |
238 | రా బంధువులూ - 3వ భాగం | "Raa Banduvulu" Part 3 |
237 | రా బంధువులూ - 2వ భాగం | "Raa Banduvulu" Part 2 |
236 | రా బంధువులూ | "Raa Banduvulu" |
235 | బంగారం దుకాణం 3వ భాగం | "Bangaram Dukanam" Part 3 |
234 | బంగారం దుకాణం 2వ భాగం | "Bangaram Dukanam" Part 2 |
233 | బంగారం దుకాణం | "Bangaram Dukanam" |
232 | ఐస్ ఇడ్లీ సీస్ దోశ | "Ice Idly Sease Dosha" |
231 | తెలుగు నొప్పి | "Telugu Noppi" |
230 | తెలుగు లెస్స | "Telugu Lessa" |
229 | తెలుగు రాని నవమి | "Telugu Raani Navami" |
228 | తేట తేట తెలుగులా | "Teta Teta Telugu la" |
227 | శునక ప్రేమ సెప్టిక్ చేసింది | "Shunaka Prema Septic Chesindi" |
226 | షో టైమ్ అయ్యిపోయింది | "Show Time Ayyipoindi" |
225 | దాచే కొద్దీ దొంగల పాలు | "Daache koddee Dongala Palu" |
224 | వి.ఐ.పి. కోడి | "VIP Kodi" |
223 | నిద్రాహార దీక్ష | "Nidraahara Diksha" |
222 | కదలన్ ది ప్రేమికుడు 2వ భాగం | "KadalanThe Premikudu" Part 2 |
221 | కదలన్ ది ప్రేమికుడు | "KadalanThe Premikudu" |
220 | జీవితం x జాతకం = జైలు జీవితం | "Jeetham x Jathakam = Jailu Jeevitham" |
219 | జెండా కింద కపిరాజు | "Jenda Kinda Kapirajul" |
218 | రాంగ్ కాల్ | "Wrong Call" |
217 | పతి-పడతి | "Pathi-Padathi" |
216 | హ్యాపీ మూకీ ఇయర్ 2వ భాగం | "Happy Mooki Year" Part 2 |
215 | హ్యాపీ మూకీ ఇయర్ | "Happy Mooki Year" |
214 | క్రిస్మస్ కానుక | "Christmas Kanuka" |
213 | గజిని 3వ భాగం | "Ghajini" Part 3 |
212 | గజిని 2వ భాగం | "Ghajini" Part 2 |
211 | గజిని | "Ghajini" |
210 | ఓనర్ పవర్ పారా హుషార్ | "Owner Power Paara Hushar" |
209 | ఇల్లు ఇల్లు ఎక్కడున్నావ్ | "Illu Illu Ekkadunnav" |
208 | పెళ్ళి పిలుపు మలుపు | "Pelli Pilupu Malupu" |
207 | సహకార ఓటు దీపావళికి అవుటు | "Sahakara votu Dipawali ki Avutu" |
206 | పందెం కోడి బంధం వీడి పోయింది | "Pandem Kodi Bandam Veedi Poyindhi" |
205 | ఓనర్+టెనెంట్ = టాయిలెట్ | "Owner Tenent=Tolet" |
204 | ఫోన్ కొట్టు - సోది పెట్టు 2వ భాగం | "Phone Kottu - Sodi Pettu " Part 2 |
203 | ఫోన్ కొట్టు - సోది పెట్టు | "Phone Kottu - Sodi Pettu" |
202 | మునిసిపల్ మామ పోలీస్ కి అల్లుడయ్యాడు | "Muncipal Mama Police ki Alludayyadu" |
201 | అనుకోకుండా ఓ 1 వ తేదీ | " Anukokunda Oh 1 Va Thedi" |
200 | గుండ్రాయి | "Gunndrayi" |
199 | సమ్మెట పోటు | "Sammeta Potu" |
198 | వ్రతం రాతమార్చునా ? | "Vratham ...Rathamarchuna ?" |
197 | రోగం ప్లస్ రోగం | "Rogam Plus Rogam" |
196 | సుపరిచితుడు - 2వ భాగం | " Suparichitudu" Part 2 |
195 | సుపరిచితుడు | " Suparichitudu" |
194 | ఆషాఢంలో షేడ్ మారింది | "Ashadam lo Shade Marindi" |
193 | ఛాయా చిత్రం 2వ భాగం | "Chaya Chithram" Part 2 |
192 | ఛాయా చిత్రం | "Chaya Chithram" |
191 | ఎ టీ జెడ్ 2వ భాగం | "A Tea Z" Part 2 |
190 | ఎ టీ జెడ్ | "A Tea Z" |
189 | ఫైన్ ఆర్ట్ | "Fine Art" |
188 | అనుకోకుండా ఒక ఫంక్షన్ | "Anukokunda Oka Function" |
187 | ఆడమని నన్నడగవలెనా | "Aadamani Nannadagavalena" |
186 | అజ్ఞాత వాసం 2వ భాగం | "Agnatha Vasam" Part 2 |
185 | అజ్ఞాత వాసం | "Agnatha Vasam" |
184 | చిరు జీవితం ప్రేమ గీతం | "Chiru Jeetham Prema Geetham" |
183 | పిల్లలు ఎత్తుకెళ్ళేవారు చల్లని వారు 3వ భాగం | "Pillalu Etthukellevaru Challani vaaru" Part 3 |
182 | పిల్లలు ఎత్తుకెళ్ళేవారు చల్లని వారు 2వ భాగం | "Pillalu Etthukellevaru Challani vaaru" Part 2 |
181 | పిల్లలు ఎత్తుకెళ్ళేవారు చల్లని వారు | "Pillalu Etthukellevaru Challani vaaru" Part 1 |
180 | స్నేహమేరా నా ప్రాణం | "Snehame ra Na Pranam" |
179 | అల్లుడికి వాలుజెడ | "Alludiki Valujada" |
178 | పెళ్ళాల పండగ | "Pellala Pandaga" |
177 | ఓ స్త్రీ రేపు రా | "O Sthree Repu Raa" |
176 | ప్రేమ పావురం 3వ భాగం | " Prema Pavuram" Part 3 |
175 | ప్రేమ పావురం 2వ భాగం | " Prema Pavuram" Part 2 |
174 | ప్రేమ పావురం | " Prema Pavuram" |
173 | 2 వరాలు - 4 రాళ్ళు | " 2 Varalu - 4 Raallu" |
172 | ఒంటె, కోతి - ఓ ఇంటి ఓనర్ 2వ భాగం | "Onte, Kothi - O Inti Owner" Part 2 |
171 | ఒంటె, కోతి - ఓ ఇంటి ఓనర్ | "Onte, Kothi - O Inti Owner" |
170 | మౌన సంగ్రామం 2వ భాగం | "Mouna Sangramam" Part 2 |
169 | మౌన సంగ్రామం | "Mouna Sangramam" |
168 | గొర్రే గోడ్డలైతే | "Gore Goddalithey" |
167 | అనుచిత పవర్ | "Anuchitha Power" |
166 | ఎవరిది వారికే | "Evaridi Varike" |
165 | కృష్ణార్జున విజయం | "Krishnarjuna Vijayam" |
164 | నిశ్శబ్ద శుభాకాంక్షలు | "Nishabda Shubhakankshalu" |
163 | కేక్ - మాస్ | "CAKE - MASS" |
162 | ఎ ప్రదేశ్ | "A Pradesh" |
161 | సోకొకడిది షాకొకడిది 2వ భాగం | "Showkokadidi -Shakokadidi" Part 2 |
160 | సోకొకడిది షాకొకడిది | "Showkokadidi -Shakokadidi" |
159 | పురస్కారం | "Puraskaram" |
158 | హెల్మెట్ కి బొప్పి కట్టింది | "Helmet ki Boppi Kattindi" |
157 | బాలల దినోత్సవం | "Balala Dinotsavam" |
156 | ఎరక్క పోయి వచ్చాను | "Erakka Poyi Vachanu" |
155 | ఆట్ల తద్ది | "Aatla Thaddi" |
154 | అపజయ దశమి | "Apajayadasami" |
153 | క్షౌర సాగర మదనం | "Kshoura Sagara Madanam" |
152 | సైయ్యా...? | "Syeya....?" |
151 | దొంగలున్నారు జాగ్రత్త | "Dongalunaru Jagratha" |
150 | మామా భల్లూకమా | " Mama Bhalookama" |
149 | మనీ ప్రెషర్ మినీ గనేష్ | " Money Pressure Mini Ganesh" |
148 | ప్రచారం హత్య | "Pracharam Hathya" |
147 | పుష్కర్ ఘాటు | "Pushkar Ghatu" |
146 | మహా వీర రక్త బంధం | "Maha Veera Raktha Bandham" |
145 | వీర రక్త బంధం | "Veera Raktha Bandham" |
144 | రక్త బంధం | "Raktha Bandham" |
143 | బొమ్మ బాగుంది | "Bomma Bagundi" |
142 | ముందడుగు వెనకడుగు | "Mundadugu Venakadugu" |
141 | వెజ్జీ ట్రబుల్స్ 2వ భాగం | "Veggie Troubles" Part 2 |
140 | వెజ్జీ ట్రబుల్స్ | "Veggie Troubles" |
139 | మైకం కమ్మింది | "Maikam Kammindi" |
138 | బరువైన పందెం | "Baruvaina Pandem" |
137 | పుష్పం - పత్రం | "Pushpam-Pathram" |
136 | దొంగ.కేమ్ | "Donga.CAM" |
135 | పాన్ పరాకాష్ఠ 2వ భాగం | "Pan Parakasta" Part 2 |
134 | పాన్ పరాకాష్ఠ | "Pan Parakasta" |
133 | పాఠశాల వయా చెరశాల | "Patashala via Cherasala" |
132 | యాచక రాచకం | "Yaachaka Raachakam" |
131 | పెళ్ళికళ వచ్చింది | "Pellikala Vachindi" |
130 | జలాగ్ని | "Jalagni" |
129 | సర్వర్స్ సుందరం 2వ భాగం | " Servers Sundaram" Part 2 |
128 | సెర్వర్స్ సుందరం | " Servers Sundaram" |
127 | క్షణ క్షణం | "Kshana Kshanam" |
126 | శెలవులే పరీక్ష | "Shelavule Pareeksha" |
125 | శ్రీ రామ పంచమి | "Sri Rama Panchami" |
124 | సమర్ సంగ్ కప్ | "Samar Sung Cup" |
123 | టోటల్ 2వ భాగం | "Total" Part 2 |
122 | టోటల్ | "Total" |
121 | వసంత కాకిలా | "Vasantha Kakilaa" |
120 | కోడి దాటి సంవత్సరం | "Kodi Dati Samvatsaram" |
119 | శివిదయం | "Shividayam" |
118 | ప్రేమికుల దినం | "Premikula Dinam" |
117 | ఇది కథ కాదు 2వ భాగం | "Idi Katha Kadu" Part 2 |
116 | ఇది కథ కాదు | "Idi Katha Kadu" |
115 | రణతంత్ర దినోత్సవం | "Ranathanthra Dinothsavam" |
114 | బ్రేక్ | "Break" |
113 | పండగకు మామ వచ్చాడు | "Pandagaku Mama Vachadu" |
112 | బేడ్ న్యూస్ | "Bad News" |
111 | అప్పడుగువాడు రోగి 2వ భాగం | "Appaduguvadu Rogi" Part 2 |
110 | అప్పడుగువాడు రోగి | "Appaduguvadu Rogi" |
109 | మళ్ళీ పెళ్ళి రోజు | "Malli Pelli Roju" |
108 | కేట్ పులి | ""CAT"Puli" |
107 | అతిథి వద్దో భవ 2వ భాగం | "Athidi vaddo Bhava" Part 2 |
106 | అతిథి వద్దో భవ | "Athidi vaddo Bhava" |
105 | పెద్ద బాలల దినోత్సవం | "Pedda Balala Dinotsavam" |
104 | టూ మెన్ వన్ బ్రెయిన్ 2వ భాగం | "TWO MEN ONE BRAIN" Part 2 |
103 | టూ మెన్ వన్ బ్రెయిన్ | "TWO MEN ONE BRAIN" |
102 | దీపావళి ఆల్బమ్ | "Deepavali Album" |
101 | ఏబంధులు | "Ebandhulu" |
100 | "100" | "100" |
99 | తోలు బొమ్మల కొలువు | "Tolu Bommala Koluvu" |
98 | చెవుల పులి | "Chevula Puli" |
97 | నోట్ మాట | "Note Mata" |
96 | చోర్ డిలివరీ | "Chore Delivery" |
95 | అంతులేని సంతకం | "Anthuleni santhakam" |
94 | మనీ ప్రెషర్ మినీ గణేష్ | " Money Pressure Mini Ganesh" |
93 | బరువు ప్రతిష్ఠ | " Baruvu Prathishta" |
92 | అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది | " Arda Raatri Swatantryam Vachindi" |
91 | బిడ్డొచ్చిన వేళ గొడ్డేస్తే | " Biddochina Vela Goddesthe" |
90 | లాలి జొ లాలీ నో | "Lali Jo Lali No" |
89 | నీ నూనె మోము నా కనులారా | "Nee Nune Momu Na Kanulara " |
88 | 12వ పెట్టె | "12 va pette" |
87 | మీసం పురుష లక్షణం | "Meesam Purusha Lakshanam" |
86 | చికెన్ 65 03 | " Chicken 65 03" |
85 | సర్వేజనా లిఖినో భవంతు | "Sarvejana Likhino Bhavanthu" |
84 | అమృత గంగ | "Amrutha Ganga" |
83 | రాజ"నేల" | "Rajanela" |
82 | చైనా తిరిగి దణ్ణం పెట్టు | "China Tirege Dennam Pettu" |
81 | బోటును ముంచిన ఏంకర్ | "Botunu Munchina Anchor" |
80 | ఐతే అవ్వకపోతే 2వ భాగం | "Ithe Avvakapothe" Part 2 |
79 | ఐతే అవ్వకపోతే | "Ithe Avvakapothe" |
78 | పప్పు చేసిన అప్పు కార్డ్ | "Pappu Chesina Appu Card" |
77 | రసం పిండిన లారీ | "Rasam Pindena Lorry" |
76 | సెల్ టు సెల్ | "Cell To Cell" |
75 | అకాల చక్రం | "Akala Chakram" |
74 | చేతికి పంటి నొప్పి | "Chetiki Panti Nopi" |
73 | ఎమ్ సెట్ | "Em Cet" |
72 | పచ్చడైన ఉగాది | "Pachadiena Ugadi" |
71 | అమ్మో మార్చి 23 | "Amo March 23" |
70 | క్రికెట్ అయినమహా | "Cricket Ienamaha" |
69 | వరల్డ్ కప్ | "World Cup" |
68 | పంచతారం - రెండొవ భాగం | "Panchatarem" Part 2 |
67 | పంచతారం - మొదటి భాగం | "Panchatarem" Part 1 |
66 | బేలంటైన్ | "Balentine " |
65 | ముహూర్త బలం | "Muhurta Balam" |
64 | హోటల్ కంటే గుడి పదిలం | "Hotel Kante Gudi Padilam" |
63 | వారెవా యేమి ఫేస్ | "Vareva Emi Face" |
62 | పిస్వాసం | "Piss Vasam" |
61 | జలభూమి ఏడుపోవిడత | "Jalabhoomi Edupovidatha" |
60 | అయోమయ సభ | "Ayomaya Sabha" |
59 | బళ్ళే టైటానిక్లైతే | "Balle Titanic Lithe" |
58 | వీర బాస్ | "Veera Boss" |
57 | టి.వి.లో దుకాణం | "TV lo Dukanam" |
56 | అదృష్టం నోట్లో శని | "Adrustam Notlo Shani" |
55 | కలిసి వుంటే కలదు సుఖం / దుఃఖం - రెండవ భాగం | "Kalisi Unte Kaladu Sukam / Dukkam" Part 2 |
54 | కలిసి వుంటే కలదు సుఖం / దుఃఖం - మొదటి భాగం | "Kalisi Unte Kaladu Sukam / Dukkam" Part 1 |
53 | అమృత అభయం | "Amrutha Abhayam" |
52 | అమ్మా ! అనకొండమ్మా | "Amma ! Anakondamma" |
51 | ధూపావళి | "Dupavali" |
50 | పవర్ కప్ 3వ భాగం | "Power Cup" Part 3 |
49 | పవర్ కప్ 2వ భాగం | "Power Cup" Part 2 |
48 | పవర్ కప్ | "Power Cup" |
47 | దిన దిన అశ్రువులు నూరెళ్ల అసువులు - రెండవ భాగం | "Dhina Dhina Asruvulu Noorella Asuvulu" Part 2 |
46 | దిన దిన అశ్రువులు నూరెళ్ల అసువులు - మొదటి భాగం | "Dhina Dhina Asruvulu Noorella Asuvulu" Part 1 |
45 | హోటలే కదా స్వర్గసీమ | "Hotale Kada Swargasima" |
44 | చవితి చందమామ | "Chavithi Chandamama" |
43 | అమ్మాయికి సన్నజాజి మామకు సంపంగి | "Ammayiki Sannajaji Mamaku Sampanghi" |
42 | ఏక్షన్ 500 కట్ 50,000 | "Action 500 Cut 50,000" |
41 | సర్వర్ సింధూరం | "Sarver Sindhuram" |
40 | కోయ్ రాజా కోయ్ | "Koy Raja Koy" |
39 | అమ్మో మమ్మీ | "Ammo Mummy" |
38 | పలుకే బంగారమాయెలే | "Paluke Bangara Maye Le" |
37 | సోకొకడిది షాకొకడిది | "Shokokadidi - Shockokadidi" |
36 | ఆవేశం అమృతం ఆముదం | "Avesham Amrutam Amudam" |
35 | కడుపు నొప్పి | "Kadupe Noppi" |
34 | అమృత కలాశ్ | "Amrutha Kalaash" |
33 | ఒక దెబ్బకు రెండు గొర్రెలు | "Oka Debbaku Rendu Gorrelu" |
32 | ఆం సెట్ | "Aam Set" |
31 | మతిపోయినచోట దొరుకుతుంది | "Mathi Poyina Chota Doorukuthundhi" |
30 | సమర కట్ | "Samara Cut" |
29 | గూఢచారి111111116 | "Gudachari111111116" |
28 | నేటి కుక్కలే రేపటి పౌరులు | "Neti Kukkaley Repati Pourulu" |
27 | ఆటో ఎటో | "Auto Eto" |
26 | పేక మేడలు | "Peka Medalu" |
25 | నిదానమే ప్రమాదము | "Nidaname Pramadamu" |
24 | పరోపకారి పాపమన్న | "Paropakari Papamanna" |
23 | వృద్ధ రామాయణం | "Vrudda Ramayanam" |
22 | అసత్యాగ్రహం | "Astahyagraham" |
21 | లీకాభిషేకం | "Leakabishekam" |
20 | ఏప్రిల్ 1 విడుదల ఆగిపోయింది | "April 1 Vidudala Aagipoyindi" |
19 | రంగు భంగం | "Rangu Bangam" |
18 | ప్రకృతి వైద్య లీల | "Prakruthi Vaidya Lila" |
17 | కుడి ఎడమైతే | "Kudi Edamaithey" |
16 | ఉగ్ర వీణ | "Ugraveena" |
15 | కళ్యాణ వీణ | "Kalyana Veena" |
14 | టీవీటీవీటివ్వడం | "TV TV Tivvadam" |
13 | కాకాస్త్రం | "Kakastram" |
12 | ముదురు మనసులు | "Muduru Manasulu" |
11 | ఇంటికి లైటర్ ఇంటాయనే | "Intiki Lighter Intayane" |
10 | వాస్తు శిస్తు | "Vaastu Sisthu" |
9 | ముగ్గు గుమ్మ | "Muggu Gumma" |
8 | కారు గుద్దిన కాపురం | "Caaru Guddina Kaapuram" |
7 | ప్రకృతి - వికృతి | "Prakruti Vikruti" |
6 | వైద్యో నారాయణో హరి | "Vaidyo Narayano Hari" |
5 | నరుడా వానరుడా | "Naruda Vanaruda" |
4 | ఇందా గోవిందా | "Inda Govinda" |
3 | భౌ సాగరం | "Bow Sagaram" |
2 | హలో మై డియర్ రాంగ్ నంబర్ | "Hello My Dear Wrong Number" |
1 | గో గృహప్రవేశం | "Go Gruhapravesam" |
బయటి లంకెలు
[మార్చు]- ↑ "అమృతం - జస్ట్ యెల్లొ". Archived from the original on 2011-11-09. Retrieved 2011-11-27.
- ↑ 2.0 2.1 గంగరాజు గుణ్ణం ఇంటర్వ్యు - idlebrain.com
- ↑ Amrutham now on Zee Telugu
- ↑ Welcome To Gemini TV
- ↑ అమృతం సీరియల్ - యూట్యూబ్
- ↑ ETV PlusShowSchedule