అరవింద్ మిల్స్
| Arvind Mills | |
|---|---|
| తరహా | Public (NSE, BSE) |
| స్థాపన | 1931 |
| ప్రధానకేంద్రము | అహ్మదాబాదు |
| కీలక వ్యక్తులు | Sanjay Lalbhai (CEO &MD) Arvind N. Lalbhai |
| పరిశ్రమ | చేనేత |
| ఉత్పత్తులు | Denim, Knits, Khakhis |
| రెవిన్యూ | రూ. 23.45 Billion |
| నికర ఆదాయము | Loss రూ. 480 Million |
| ఉద్యోగులు | 26000 |
| వెబ్ సైటు | www.arvindmills.com |
అరవింద్ మిల్స్ ప్రాథమికంగా ఒక భారతీయ వస్త్ర వ్యాపార సంస్థ. దీనికి టెలికాం మరియు ఇంజినీరింగ్ విభాగాలు కూడా కలవు
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
1930 లో కలిగిన ఆర్థిక మాంద్యం వలన ప్రపంచంలోని చాలా సంస్థలు మూతపడ్డాయి. ముఖ్యంగా UK లోనూ, భారతదేశంలోనూ వస్త్ర పరిశ్రమలు ఈ మాంద్యానికి బాగా ప్రభావితం అయ్యాయి. సరిగ్గా అదే సమయంలో మహాత్మాగాంధీ స్వదేశీ నినాదంతో భారతీయులు ఇంగ్లాండు నుండి దిగుమతి అయిన వస్త్రాలను బహిష్కరించారు.
ఇటువంటి సమయంలో భారతదేశంలోనే తయారయ్యే వస్త్రాల అమ్మకానికి మంచి అవకాశం ఉందని గ్రహించారు లాల్ భాయి కుటుంబం. కస్తూర్ భాయి, నరోత్తం భాయి మరియు చిమన్ భాయిలు ఒక మిల్లును నెలకొల్పారు. యంత్రపరికరాలను ఇంగ్లాండు నుండి తెప్పించుకొని అరవింద్ లిమిటెడ్ ను స్థాపించారు.
1931 లో రూ. 25,25,000 ($ 55,000) పెట్టుబడితో ప్రారంభించ బడినది. 1934 నాటికి 45.76 లక్షల అమ్మకాలతో 2.82 లక్షల లాభాలను గడించినది. విద్యుఛ్ఛక్తి లేమి వలన 80 లలో చేనేత పరిశ్రమ కుంటు పడినా, అరవింద్ మిల్స్ ఆ సమయంలో కూడా అత్యధిక లాభాలను గడించినది. స్వదేశంలోనే కాకుండా విదేశాలపై కూడా దృష్టి సారించిన అరవింద్ మిల్స్ నూలు దుస్తులపై పెరుగుతున్న గిరాకీతో 1987-88 లో డెనిం ను ఉత్పత్తి చేయటం మొదలుపెట్టినది. ఇదే సంవత్సరంలో అంతర్జాతీయ షర్టుల సంస్థ ఆరో ని భారతదేశంలో నెలకొల్పినది. 1991 నాటికి అరవింద్ మిల్స్ సంవత్సరానికి 1600 మిలియన్ మీటర్ల ఉత్పత్తికి చేరుకొంది. ప్రపంచంలో డెనిం ఉత్పత్తి చేసే సంస్థలలో ఇది మూడవ స్థానం. ఎస్ ఏ పీ ని వాడుకొన్న మొట్టమొదటి (1997-98 లోనే) భారతీయ సంస్థ అరవింద్ మిల్స్. 2008 లో మెగామార్ట్ వస్త్ర వికయశాలల హారాన్ని నెలకొల్పినది.
2011 లో ద అరవింద్ స్టోర్ పరిచయం చేయబడినది. ఈ స్టోర్ లోని స్టూడియో అరవింద్ లో అరవింద్ మిల్స్ చే నేయబడ్డ వస్త్రాలను ఇదే సంస్థ చే ఎన్నుకోబడ్డ దర్జీల వద్ద బట్టలను అక్కడే కుట్టించుకొనవచ్చును. అరవింద్ డిజైన్ ల్యాబ్స్ (ఏ డీ ఎల్) రూపొందించిన జీన్స్ ప్యాంట్లను వినియోగదారుడి కొలతల ప్రకారం కుట్టించుకొనవచ్చును. ఏ డీ ఎల్ రూపొందించిన బటన్, రివెట్లు, జిప్ ల శ్రేణుల నుండి వినియోగదారుడు నచ్చినవి ఎంపిక చేసుకొనవచ్చును. ఇంతే కాక, ఇక్కడ ఆరో, ఫ్లయింగ్ మషీన్, యూ.ఎస్.పీ.ఏ బ్రాండుల రెడీమేడ్ వస్త్రాలు కూడా అందుబాటులో ఉంటాయి.
[మార్చు] బ్రాండులు
[మార్చు] స్వంత బ్రాండులు
- ఎక్స్ క్యాలిబర్
- ఫ్లయింగ్ మషీన్
- రఫ్ అండ్ టఫ్
- న్యూ పోర్ట్ యూనివర్సిటీ
[మార్చు] లైసెన్స్డ్ బ్రాండులు
- గాంట్, యు. ఎస్. ఏ, 1949
- యూ.ఎస్.పీ.ఏ
- సాన్సాబెల్ట్
- ఐజోడ్
- పియర్ కార్డిన్ ప్యారిస్
- ఆరో
- ద చెరోకీ గ్రూప్
[మార్చు] జాయింట్ వెంచర్ బ్రాండులు
- టామీ హిల్ఫిగర్
- నాటికా
- లీ
- వ్రాంగ్లర్ జీన్స్
- వ్రాంగ్లర్ హీరో
- రైడర్స్
[మార్చు] అంతర్గత లంకెలు
[మార్చు] బాహ్య లంకెలు
- అరవింద్ మిల్స్.కామ్
- మెగామార్ట్ స్టోర్స్.కామ్
- ఫ్లయింగ్ మషీన్ జీన్స్ వెబ్ సైటు
- గాంట్.కామ్
- యూ ఎస్ పీ ఏ వెబ్ సైటు
- సాన్సా బెల్ట్ వెబ్ సైటు
- ఐజోడ్
- పియర్ కార్డిన్ వెబ్ సైటు
- ఆరోలైఫ్.కామ్
- ద చెరోకీ గ్రూప్.కామ్
- వ్రాంగ్లర్.ఇన్
- నాటికా.కామ్
- టామీ.కామ్
- వ్రాంగ్లర్ హీరో.వ్రాంగ్లర్.కామ్
- రైడర్స్ బై లీ.కామ్