అలెక్స్ వార్ఫ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అలెక్స్ వార్ఫ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అలెగ్జాండర్ జార్జ్ వార్ఫ్
పుట్టిన తేదీ (1975-06-04) 1975 జూన్ 4 (వయసు 48)
బ్రాడ్‌ఫోర్డ్, ఇంగ్లాండ్
మారుపేరుగ్యాంగ్‌స్టర్
ఎత్తు6 ft 4 in (1.93 m)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
పాత్రబౌలరు, umpire
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 183)2004 సెప్టెంబరు 1 - ఇండియా తో
చివరి వన్‌డే2005 ఫిబ్రవరి 13 - దక్షిణాఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1994–1997యార్క్‌షైర్
1998–1999నాటింగ్‌హామ్‌షైర్
2000–2009గ్లామోర్గాన్
అంపైరుగా
అంపైరింగు చేసిన టెస్టులు4 (2021–2023)
అంపైరింగు చేసిన వన్‌డేలు12 (2018–2023)
అంపైరింగు చేసిన టి20Is36 (2018–2022)
అంపైరింగు చేసిన మటెస్టులు2 (2015–2019)
అంపైరింగు చేసిన మవన్‌డేలు11 (2011–2022)
అంపైరింగు చేసిన మటి20Is13 (2013–2020)
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు ఫక్లా లిఎ T20
మ్యాచ్‌లు 13 121 155 33
చేసిన పరుగులు 19 3,570 1,411 157
బ్యాటింగు సగటు 9.50 23.03 16.21 12.07
100లు/50లు 0/0 6/14 0/1 0/0
అత్యుత్తమ స్కోరు 9 128* 72 19
వేసిన బంతులు 584 16,825 6,497 644
వికెట్లు 18 293 192 39
బౌలింగు సగటు 23.77 37.34 28.91 26.35
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 5 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 1 0 0
అత్యుత్తమ బౌలింగు 4/24 6/59 6/5 4/39
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 63/– 42/– 5/–
మూలం: Cricinfo, 21 June 2023

అలెగ్జాండర్ జార్జ్ వార్ఫ్ (జననం 1975 జూన్ 4) [1] మాజీ ఇంగ్లీష్ వన్‌డే, ఫస్ట్-క్లాస్ క్రికెటరు. అతను కుడిచేతి వాటం బ్యాటరు, కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలరు. అతను వెల్ష్ జట్టు గ్లామోర్గాన్ కౌంటీ క్రికెట్ క్లబ్‌తో తన కెరీర్‌ను ముగించాడు. అతను ఇప్పుడు అంపైరు .

దేశీయ వృత్తి[మార్చు]

వార్ఫ్ తన ఫస్ట్-క్లాస్ క్రికెట్ కెరీర్‌ను 1994లో యార్క్‌షైర్‌తో ప్రారంభించి, 1997 వరకు కౌంటీ తరపున ఏడు మ్యాచ్‌లు ఆడాడు.[1] అతను 2000లో గ్లామోర్గాన్‌కు వెళ్లడానికి ముందు నాటింగ్‌హామ్‌షైర్‌లో చేరాడు.

వార్ఫ్ 2009 కౌంటీ ఛాంపియన్‌షిప్ సమయంలో దీర్ఘకాల గాయం నుండి కోలుకోలేక, క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2010లో వార్ఫ్, సౌత్ వేల్స్ ప్రీమియర్ క్రికెట్ లీగ్‌లో సుల్లీ సెంచూరియన్స్ కోసం ఆడాడు. [2]

అంతర్జాతీయ కెరీర్[మార్చు]

అతను ఎప్పుడూ టెస్టు క్రికెట్ ఆడలేదు, కానీ 2004లో భారత్‌పై నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌లో తన ఇంగ్లండ్ వన్డే అంతర్జాతీయ రంగప్రవేశం చేశాడు. మొత్తంగా అతను 13 వన్డే క్యాప్‌లను గెలుచుకున్నాడు.

అంపైరింగ్ కెరీర్[మార్చు]

2011లో, అతను దివంగత రస్సెల్ ఎవాన్స్, బిల్లీ టేలర్‌లతో పాటు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు రిజర్వ్ అంపైర్ల జాబితాలో చేర్చబడ్డాడు. [2]

రాబ్ బెయిలీతో పాటు, అతను 2018 మే 31 న లార్డ్స్‌లో జరిగిన హరికేన్ రిలీఫ్ T20 ఛాలెంజ్ మ్యాచ్‌కు ఇద్దరు ఆన్‌ఫీల్డ్ అంపైర్‌లలో ఒకడు.[3] తర్వాత నెలలో, అతను 2018 జూన్ 16 న కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మ్యాచ్‌తో తన వన్డే ఇంటర్నేషనల్ అంపైరింగు మొద్లౌపెట్టాడు. [4]

2019 అక్టోబరులో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన 2019 ఐసిసి T20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంట్‌లో మ్యాచ్‌లను నిర్వహించే పన్నెండు మంది అంపైర్‌లలో ఒకరిగా అతను నియమితుడయ్యాడు. [5] 202 ఫిబ్రవరిలో, ఆస్ట్రేలియాలో జరిగే 2020 ఐసిసి మహిళల T20 ప్రపంచ కప్‌లో మ్యాచ్‌లలో అంపైర్‌లలో ఒకరిగా ఐసిసి అతనిని పేర్కొంది. [6] 2021 జూన్‌లో వార్ఫ్, 2021 ఐసిసి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు నాల్గవ అధికారిగా ఎంపికయ్యాడు. [7] 2021 ఆగస్టులో, ఇంగ్లాండ్, భారతదేశం మధ్య జరిగిన మూడవ మ్యాచ్‌లో, వార్ఫ్ తన మొదటి టెస్టు మ్యాచ్‌లో అంపైర్‌గా నిలిచాడు. [8]


2022 ఫిబ్రవరిలో అతను, న్యూజిలాండ్‌లో జరిగే 2022 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆన్-ఫీల్డ్ అంపైర్‌లలో ఒకరిగా ఎంపికయ్యాడు. [9] [10]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Warner, David (2011). The Yorkshire County Cricket Club: 2011 Yearbook (113th ed.). Ilkley, Yorkshire: Great Northern Books. p. 381. ISBN 978-1-905080-85-4.
  2. 2.0 2.1 "Umpires list - 2011". www.ecb.co.uk. Archived from the original on 28 June 2011. Retrieved 3 August 2011.
  3. "ICC World XI tour of England at London, May 31 2018". ESPN Cricinfo. Retrieved 31 May 2018.
  4. "Alex Wharf to umpire his first One-Day International in Cardiff". BBC Sport. Retrieved 16 June 2018.
  5. "Match Officials announced for ICC Men's T20 World Cup Qualifier 2019". International Cricket Council. Retrieved 10 October 2019.
  6. "ICC announces Match Officials for all league matches". International Cricket Council. Retrieved 12 February 2020.
  7. "Match officials for ICC World Test Championship Final announced". International Cricket Council. Retrieved 8 June 2021.
  8. "India vs England third Test: Umpire Alex Wharf had dismissed Sourav Ganguly, VVS Laxman, Rahul Dravid on debut". New Indian Express. Retrieved 26 August 2021.
  9. "Eight women among 15 Match Officials named for ICC World Cup 2022". Women's CricZone. Retrieved 22 February 2022.
  10. "Match officials chosen for ICC Women's Cricket World Cup 2022". International Cricket Council. Retrieved 22 February 2022.