ఆక్సిజన్ లేకుండా జీవించే జీవులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాధారణ సూక్ష్మదర్శినిలో పూర్తిగా నిర్వచించబడని స్పైనోలోరికస్ జీనస్ కు చెందిన జీవి. ఇది ప్రాణవాయువు లేకుండా జీవించే జీవి. రోజ్ బెంగాల్ వర్ణద్రవ్యంతో అద్దకం చేయబడినది. కొలబద్ద పరిమాణం 50 మైక్రాన్లు.

భూమి మీద జీవులకైనా, సముద్రంలో జీవులకైనా బ్రతకడానికి ప్రాణవాయువు అవసరం అని అందరికీ తెలిసిందే. కాని, ప్రాణవాయువు లేకుండా బ్రతక గలిగే కొత్తరకం జీవులను ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వైరస్ లు, ఏక కణ జీవులు మాత్రమే ఆక్సిజన్ లేకుండా జీవించగలవని అందరూ భావించేవారు. అలాంటిది మూడు జాతుల కొత్త జీవుల్ని శాస్త్రవేత్తలు కనుగొని ఆశ్చర్యపోతున్నారు. ఈ జీవులు ప్రాణవాయువు లేకుండా జీవిస్తున్నాయి. కానీ ఇవి బహుకణ జీవులు.

మధ్యధరా సముద్రం అట్టడుగున ఈ జీవులు నిక్షేపంగా జీవిస్తున్నాయి. ఆ ప్రదేశంలో ప్రాణవాయువు లేకపోవుటను శాస్త్రవేత్తలు గమనించారు. ఈ జీవులను మొట్టమొదటిగా కనుగొన్నవారు ఇటలీ కి చెందిన శాస్త్రవేత్తలు. ఈ జీవులు బహుకణ జీవులు, కాని పెద్ద జీవులు కాదు. అవి మిల్లీ మీటరు కంటే చిన్నవిగా ఉన్నాయి. చూడటానికి జెల్లీఫిష్ లా కనిపిస్తాయి.

బహుకణ జీవులు ప్రాణవాయువు లేకుండా జీవించలేవు. ఎందుకంటే వాటి కణాలలో మైటోకాండ్రియా అనే నిర్మాణం ఉంటుంది. అవి జీవి పీల్చుకున్న ఆహారాన్ని , ప్రాణవాయువు ను శక్తి క్రింద మార్చే ప్రక్రియలో ఉపయోగ పడుతుంది. కానీ ఈ క్రొత్త జీవుల కణాలలో "మైటోకాండ్రియా" లకు బదులు "హైడ్రోజెనమ్స్" అనే నిర్మాణాలున్నాయి. ఇవి ప్రాణవాయువు అవసరం లేకుండానే శక్తిని పుట్టిస్తున్నాయి. కనుక ఇవి ప్రాణవాయువు లేకుండానే బ్రతుకగలుగుతున్నాయని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. అంతే కాదు కొత్తగా కనుగొన్న మూడు జీవులలో రెండింటి కడుపులో గ్రుడ్లు కూడా ఉన్నాయి. ఆ గ్రుడ్లను తీసి, ప్రాణవాయువు తగలని ప్రదేశంలో ఉంచితే, వాటి నుంచి పిల్లలు కూడా వచ్చుటను శాస్త్రవేత్తలు గమనించారు.

వీటికి పేరు పెట్టలేదు. ఇవి "లోరిసిఫెరా" కుటుంబానికి చెందిన జీవులుగా గుర్తించారు. సముద్రం అడుగున భూమిలో బొరియలు చేసుకుని అందులో నివాసం ఉంటాయి. ఇవి ఉన్నట్లు ఈ మధ్యనే మనకు తెలిసినా, ఇవి 60 కోట్ల సంవత్సరములకు పూర్వం నుంచే ఉన్నట్లు శాస్త్రవేత్తలు అధ్యయనం ద్వారా తేల్చారు. దీనిని బట్టి సముద్రంలో ఇప్పుడున్న జీవుల కంటే ముందుగానే యివి ఉన్నట్లు తెలుస్తుంది. అపుడు భూమిపైన ప్రాణవాయువు ఉండేది కాదు. ఆ తర్వాత ప్రాణవాయువు భూమిపై ఏర్పడి యితర జీవులు వృద్ధి చెందినాయి.

ఇతర లింకులు[మార్చు]