ఆల్ఫ్రెడ్ మార్షల్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

19 వ శతాబ్దపు ఆర్థిక వేత్తలలో ప్రసిద్ధుడైన ఆల్ఫ్రెడ్ మార్షల్ 1842 లో ఇంగ్లాండు లోని లండన్ లో జన్మించాడు. సెయింట్ జాన్స్ కళాశాల, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్య అభ్యసించాడు. ప్రారంభంలో తత్వశాస్త్రం పై మక్కువ ఉన్ననూ తర్వాత రాజకీయ అర్థశాస్త్రం వైపు మళ్ళినాడు. 1975 లో టారిఫ్ నియంత్రణ ప్రభావాలను అద్యయనం చేయడానికి అమెరికా వెళ్ళినాడు. ఆ తర్వాత ఒక సంవత్సరం ఇటలీ లో గడిపినాడు. 1882 లో బ్రిస్టల్ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా చేరినాడు. 1883 లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన బాలియోట్ కళాశాల లో బోధించాడు. ఆ తర్వాత 1888 ఉంచి 1908 వరకు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో రాజకీయ అర్థశాస్త్రం ఉపన్యాసకుడిగా పనిచేశాడు. అతని కాలంలో ఇంగ్లాండు లోని ఆర్థికవేత్తలలో అతనే ప్రసిద్ధుడు. ఉపాంత వినియోగం , సప్లై డిమాండు, ఉత్పత్తి వ్యయాలు అంశాలపై అతను గణనీయమైన పరిశోధనలు చేసినాడు. అర్థశాస్త్రం లో అతని యొక్క ప్రముఖ రచనలు Priciples of Economics, Industry and Trade. ఆర్థశాస్త్రంలో అనేక పరిశోధనలు చేసి 1924 లో మరణించాడు.