ఇవటూరి కామేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇవటూరి కామేశ్వరరావు

జననం: 12.08.1923
జననం:
వృత్తి: Directorate of Agriculture (Hyderabad)

ఇవటూరి కామేశ్వరరావు (12.08.1923 - 13.10.2003) పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం తాలూకా మినుమంచలిపాడు అగ్రహారంలో నైష్టిక లింగదారి నియోగి కుటుంబంలో వీరి జననం. తండ్రి శివపూజాదురంధరులు, వీరేశలింగ భూషణరావు, తల్లి సుందరమ్మ. మదరాసులో వారి మేనమామ దగ్గర మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్నారు. వీరు వ్యవసాయ శాఖాలో ఉద్యోగం చేసి పదవీవరణ చేసారు.

జీవిత విశేషాలు[మార్చు]

మినిమించాల పాడు అగ్రహారంలో 12.8.1923న జన్మించారు. వీరేశలింగ భూషణరావుకి 8 మంది సంతానం. ముగ్గురు మగపిల్లలు, అయిదుగురు ఆడపిల్లలు. పిల్లలందరిని బాగా చదివించారు. ఇవటూరి కామేశ్వరరావు మల్లంపల్లి సోమశేఖరశర్మ వద్ద ఉంటూ మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఎస్ఎస్ఎలిసి చదువుకున్నారు. ఇవటూరి కామేశ్వరరావుకి నలుగురు సంతానం. మొదటి సంతానం ఇందిరా వెంకట రమణ (రిటైర్డ్ సూపరింటెండెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్), రెండవ సంతానంగా అమర్నాథ్ మూడవ సంతానం కామేశ్వరి, నాలుగవ సంతానంగా నివాస యషోభూషణ మల్లికార్జున సాయి జన్మించారు.

సాహిత్య ప్రస్థానం[మార్చు]

కామేశ్వరరావుకి సాహిత్యం పట్ల సాహితీ రచనల అధ్యయనం పట్ల ఆసక్తి కలిగింది. కామేశ్వరరావు రచనలలో నుంచి కొన్ని కవితలనూ, నాటికలనూ, కథలనూ, వ్యాసాలనూ కొన్నిటిని సేకరించి ఇలా ఓ సంపుటిగా తీసుకొచ్చారు.

మూలాలు[మార్చు]

1. ఇవటూరి కామేశ్వరరావు రచనలు : https://archive.org/details/2_20230409_20230409

2. ఇవటూరి కామేశ్వరరావు - మతి, తల్లిదండ్రులు: https://archive.org/details/ivaturi2

3. ఇవటూరి కామేశ్వరరావు జీవిత చరిత్ర: https://archive.org/details/20230518_20230518_1911