ఈక రెక్కల పురుగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈక రెక్కల పురుగు

ఈక రెక్కల పురుగు శాస్త్రీయ నామం ఎగ్జెలాస్టిక్ ఎటిమోజా . ఇది లెపిడాప్టెర క్రమానికి చెందినది దక్షిణ భారతదేశంలో కంది పంటకు ఈ పురుగు నవంబర్ నుండి మార్చి నెలల వరకు చాలా నష్టాన్ని కలుగజేస్తుంది.

గుర్తింపు చిహ్నాలు[మార్చు]

1.రెక్కల పురుగులు ఎండిన గడ్డి రంగులో సన్నని పొడవైన ఈక వంటి రెక్కలు కలిగి ఉంటాయి

2.మొదటి జత రెక్కల పైన మూడు ఈకలు, రెండవ జత రెక్కల పైన రెండు ఈకలు ఉండును

3.లద్దె పురుగు శరీరం లేత ఆకుపచ్చ రంగులో ఉండి చిన్న చిన్న ముళ్ళు కలిగి శరీరం అంతా సన్నటి వెంట్రుకలతో కప్పబడి ఉండును

4.లద్దె పురుగు ఉదర భాగం పైన వెంట్రుకల గుచ్చు ఉంటుంది.[1] [2]

గాయం లక్షణాలు[మార్చు]

1.ఈ లద్దె పురుగులు కాయలోనికి ప్రవేశించి గింజలను పూర్తిగా తింటాయి

2.శనగపచ్చ పురుగు వలె ఇవి కూడా తల భాగాన్ని కాయ లోపల ఉంచి మిగతా శరీరాన్ని బయట ఉంచి లోపలి గింజలను తింటాయి

3.లద్దె పురుగులు పూ మొగ్గలను, పువ్వులను తిని నష్టం కలిగిస్తాయి

4.లద్దె పురుగులు గోధుమ రంగులో ప్యూపాలుగా మారి కాయల పైనే ఉంటాయి

5.కంది కాయ మీద ఈ లద్దె పురుగులు చేసిన రంద్రాలు శనగపచ్చ పురుగు వలన కలిగిన రంధ్రాల కంటే చిన్నవిగా ఉంటాయి

జీవిత చక్రం[మార్చు]

1.తల్లి పురుగు ఆకుపచ్చని గుడ్లను లేత కాయల పైన ఒక్కొక్కటిగా పెడుతుంది

2.గుడ్డు దశ - 4 రోజులు

3.లార్వాదశ - 14-30 రోజులు

4.ప్యూపా దశ - 4-3 రోజులు [3]

యాజమాన్య పద్ధతులు[మార్చు]

1.పొలం చుట్టూ 4 సాళ్ళు జొన్నను రక్షణ పంటగా విత్తుకోవాలి

2.ఎకరానికి 4 లింగాకర్షన బుట్టలను అమర్చాలి

3.ఎకరానికి 10 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి

4.పురుగుల గుడ్లను గమనించిన వెంటనే వేపనూనెను పిచికారి చేయాలి

నివారణ[మార్చు]

సేంద్రియ నివారణ[మార్చు]

1.అగ్నిఅస్త్రాన్ని పంటపై పిచికారి చేయాలి

2.బ్రహ్మాస్త్రాన్ని పంటపై పిచికారి చేయాలి.[4]

మూలాలు[మార్చు]

  1. Palmer, W.A. & Haseler, W.H. (1992)
  2. Baker, J. (2002)
  3. SOHN, JAE-CHEON; LABANDEIRA, CONRAD; DAVIS, DONALD; MITTER, CHARLES (2012-04-30). "An annotated catalog of fossil and subfossil Lepidoptera (Insecta: Holometabola) of the world". Zootaxa. 3286 (1): 1. doi:10.11646/zootaxa.3286.1.1. ISSN 1175-5334.
  4. వివిధ పంటలకు వచ్చే చీడ పీడల యాజమాన్యం నివారణ. ఏకలవ్య ఫౌండేషన్ సేంద్రియ వ్యవసాయం.