ఎర్రజెండాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎర్రజెండాలు
కృతికర్త: గంగినేని వెంకటేశ్వరరావు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: జీవిత గాధల సంకలనం
విభాగం (కళా ప్రక్రియ): సాహిత్యం
ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
విడుదల: 1991
పేజీలు: 350

ఎర్రజెండాలు అనే ఈ గ్రంథాన్ని గంగినేని వెంకటేశ్వరరావు రచించగా విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురించింది.

విషయం[మార్చు]

భూస్వాములకు వ్యతిరేకంగా జరిపిన గెరిల్లా పోరాటంలో సైనికులను, పోలీసులను ఎదిరించి, అనేక కష్టనష్టాలకు గురి అయ్యి నిండు జీవితాలను ఉద్యమానికి బలిదానం చేసిన తెలంగాణా యోధుల జీవితగాధల సంకలనం ఈ పుస్తకం. 1947 నుండి 1951 వరకు జరిగిన తెలంగాణా విమోచన పోరాటంలో నాలుగు వేలమంది కార్యకర్తలు మరణించారు. దాదాపుగా ఈ పోరాటం జరుగుతున్న రోజుల్లోనే తెలంగాణా పల్లెసీమల్లో పర్యటించి రచయిత ఈ జీవిత గాథల్ని సవివరంగా సేకరించాడు. ఈ పుస్తకంలో అనిరెడ్డి రామిరెడ్డి, ఆలవాల నరసింహారెడ్డి, గొల్ల లింగయ్య, బారెడ్డి సైదులు, చండ్ర రామకోటయ్య, సోయ గంగులు ఇలా ఎందరో వీరులగురించి రచయిత వివరించాడు.

పీఠిక[మార్చు]

ఈ పుస్తకానికి రచయిత మృత్యువుపైన సమరం అనే పేరుతో పీఠికను వ్రాశాడు. "దేశ స్వాతంత్ర్యం కోసం రైఫిల్ పట్టినవాణ్ణి చూస్తే నాకు శివమెక్కుతుంది. ఎవరైనా వీరుణ్ణి నిర్వచించమంటే దేశం కోసం రైఫిల్ పుచ్చుకున్నవాడే వీరుడు వీరుడని వేయి గొంతుకలతో ఎలుగెత్తి చెబుతాను" అనే అవేశపూరిత వాక్యాలతో ఈ పీఠిక ప్రారంభమవుతుంది.

మధురాంతకం రాజారాం

అభిప్రాయం[మార్చు]

ప్రముఖ రచయిత మధురాంతకం రాజారాం ఈ పుస్తకాన్ని భారతి, 1990, మార్చి సంచికలో సమీక్ష వ్రాస్తూ ఈ క్రింది విధంగా అభిప్రాయపడ్డాడు.[1]

  • ఈ రచన ఆద్యంతం ఉరకలెత్తే మహాప్రవాహంలా పరుగులు తీస్తుంది.
  • 1.రాత్రి కుండపోతగా కురిసింది మబ్బు.2.గొర్రెల్ని తినే వాళ్ళని వెళ్లగొట్టి బర్రెల్ని తినేవాళ్లు ఊళ్ళపైన పడ్డారు. 3. వెల్లటేనుగులాగా కల్లం వెడల్పు కూలాడు. ఇలాంటి నుడికారపు సొంపులతో, సమయోచితమైన ప్రకృతి వర్ణనలతో ఈ వీరగాధలకు రచయిత సాహిత్య గౌరవం కలిగించాడు.
  • ఈ మారణకాండ దేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత యూనియన్ బలగాల ద్వారా జరిగిందంటే సిగ్గుపడవలసిన విషయం.
  • రచయితగా గంగినేని వెంకటేశ్వరరావుకు కమ్యూనిస్టు పార్టీపైన, విప్లవోద్యమాలపైన, సాయుధ పోరాటాలపైన అచంచలమైన నమ్మకం మామూలు పాఠకులలు విభ్రాంతిని కలిగిస్తుంది.

మూలాలు[మార్చు]

  1. మధురాంతకం, రాజారాం (1 March 1990). "ఎర్ర జెండాలు". భారతి. 63 (3): 68. Retrieved 25 December 2016.[permanent dead link]