ఎల్ఫ్రిద్ జెలినెక్
ఎల్ఫ్రిద్ జెలినెక్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | మ్యూర్జుస్లాగ్, స్టైరియా, ఆస్ట్రియా | 1946 అక్టోబరు 20
వృత్తి | నాటక రచయిత్రి, నవలాకారిణి |
జాతీయత | ఆస్ట్రియన్ |
రచనా రంగం | స్త్రీవాం, సాంఘిక విమర్శ |
గుర్తింపునిచ్చిన రచనలు | ద పియానో టీచర్, డీ కిండెర్ డెర్ టోటెమ్, గ్రీడ్, లస్ట్ |
పురస్కారాలు | నోబెల్ సాహిత్య బహుమతి 2004 |
చురుకుగా పనిచేసిన సంవత్సరాలు | 1963–ప్రస్తుతం |
సంతకం |
ఎఫ్రిద్ జెలినిక్ (జర్మన్: ɛlˈfʀiːdə ˈjɛlinɛk; 1946 అక్టోబరు 20 జననం) ఆస్ట్రియన్ నాటకకర్త, నవలా రచయిత్రి. 2004లో ఆమెకు నోబెల్ సాహిత్య బహుమతి లభించింది.
జీవిత చరిత్ర
[మార్చు]ఎల్ఫ్రీద్ జెలినెక్ 1946 అక్టోబరు 20లో మ్యూర్జుస్లాగ్, స్టైరియా, ఆస్ట్రియాలో జన్మించారు. పర్సనల్ డైరెక్టర్ అయిన ఓల్గా ఇలోనా, ఫ్రెడ్రిక్ జెలీనెక్ లకు జన్మించారు.[1] ఆమె తల్లి రోమనియన్-జెర్మానిక్ కాథలిక్ కాగా తండ్రి చెక్ జాతీయుడైన యూదు (తండ్రి వంశనామం జెలినెక్ అంటే చెక్ భాషలో చిన్న జింక అని అర్థం). ఆమె వియన్నాలో పెరిగింది.[1][2][3]
ఆమె తండ్రి కెమిస్ట్ గా పనిచేసేవారు. వ్యూహాత్మకంగా కీలకమైన పారిశ్రామిక ఉత్పత్తిలో పనిచేస్తూ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో యూదులపై జరిగిన హింస నుంచి తప్పించుకోగలిగారు. ఐతే వారి బంధువులు పలువురు హోలోకాస్ట్ బాధితులు అయ్యారు. ఆమె తల్లితో ఆమెకు సంబంధాలు అంతంతమాత్రమే. ఎల్ఫ్రిద్ తల్లి వియన్నాకు చెందిన గతంలో సంపన్నులైనవారి కుటుంబానికి చెందినవారు. చిన్నతనంలో ఎల్ఫ్రీద్ వియన్నాలోని రోమన్ కేథలిక్ కాన్వెంట్ పాఠశాలకు వెళ్ళేవారు. తల్లి ఆమెను సంగీతంలో బాలమేధావిగా చేయాలని ఆశించింది. ఆమెకు పియానో, ఆర్గాన్, గిటార్, వయొలిన్, వయోలా, రికార్డర్లు చిన్నతనం నుంచే నేర్పించారు. ఆ తర్వత ఆమె వియన్నా కన్సెర్వేటరీలో చదువుకునేందుకు వెళ్ళారు. అక్కడ ఆర్గానిస్ట్ డిప్లొమా పొందారు. ఈ కాలంలో ఆమె మానసికంగా వికలాంగుడైన తండ్రితో జీవిస్తూ ఆమె తల్లి అంచనాలను అందుకునేందుకు ప్రయత్నించేవారు.[4] ఆర్ట్ హిస్టరీ, నాటకరంగాలను వియన్నా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. సంవత్సరం పాటుగా మానసిక ఆందోళన జబ్బుగా పెరగడంతో ఇంట్లోనే ఉండిపోయారు, దాంతో చదువు ఆపేయాల్సివచ్చింది. వ్యాధి నుంచి ఉపశమనంగానూ, చికిత్సగానూ ఈ కాలంలో ఆమె సీరియస్ సాహిత్య రచనలు చేసేవారు. సంవత్సరం తర్వాత బయటకి రావడం ప్రారంభించారు.[4] యుక్తవయస్సులోనే ఆమె కవిత్వం రాయడం ప్రారంభించారు. 1967లో మొదటి సాహిత్య రచన లీసాస్ స్కెట్టెన్ రచించి, 1969లో తొలి సాహిత్య బహుమతి పొందారు. 1960ల్లో రాజకీయంగా సచేతనం కావడం, విపరీతంగా చదవడం, ఎక్కువ సమయాన్ని టెలివిజన్ చూడడంలో గడపడం చేశారు.[4]
వివాహం
[మార్చు]ఆమె 1974 జూన్ 12న గోట్ఫ్రెడ్ హంగ్స్ బర్గ్ ను వివాహం చేసుకున్నారు, ఆ దంపతులకు సంతానం కలగలేదు.[5][6]
సాహిత్యం, రాజకీయాలు
[మార్చు]ఆమెకు నోబెల్ బహుమతి వచ్చేంతవరకూ జర్మన్ భాషా ప్రపంచానికి వెలుపల ఆమె సాహిత్య రచనలు చాలావరకూ ఎవరికీ తెలియకుండేవి. ఆస్ట్రియా నుంచి ఈ రచయిత్రి తనను తానే విడిగా భావించుకున్నా (ఆస్ట్రియా యొక్క నాజీ చరిత్ర కారణంగా) జెలినెక్ రచనలు ఆస్ట్రియన్ సాహిత్య సంప్రదాయంలో లోతుగా వేళ్ళూనుకుని ఉన్నాయి, ఆమెపై ఆస్ట్రియన్ రచయితలు ఇంగెబోర్గ్ బచ్మాన్, మార్లెన్ హషోఫర్, రాబర్ట్ మ్యూసిల్ వంటివారి సాహిత్యం ఆమె రచనలపై ప్రభావం చూపింది.[7]
జెనిలెక్ సాహిత్యాన్ని అంచనాకట్టడానికి ఆమె రాజకీయ వైఖరి, మరీ ముఖ్యంగా ఆమె స్త్రీవాద దృక్పథం, కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధం వంటివి చాలా ప్రధానమైనవి. జెలినెక్ పైన, ఆమె రచనలపైన వచ్చిన విమర్శల్లో అవి కూడా ప్రధానమైన కారణాల్లోనివి. ఎడిటర్ ఫ్రెడెరిక్ ఈగ్లర్ ప్రకారం జెలీనిక్ తన సాహిత్యంలో ఒకదానికొకటి సంబంధం కలిగిన మూడిటిని లక్షాలుగా చేసుకున్నారు: పెట్టుబడిదారీ - వినిమయ సమాజం, అది అన్ని మానవ సంబంధాలు, మానవులను వినియోగ వస్తువులుగా మార్చడం, బహిరంగ జీవితంలోనూ, వ్యక్తిగత జీవనంలోనూ కనిపించే ఆస్ట్రియా ఫాసిస్టు గతం యొక్క అవశేషాలు, పద్ధతి ప్రకారం పెట్టుబడిదారీ పురుషాధిక్య సమాజం స్త్రీలపై సాగిస్తున్న దోపిడీ, అణచివేత .[8]
రాజకీయ సంబంధాలు
[మార్చు]జెలినెక్ ఆస్ట్రియా కమ్యూనిస్ట్ పార్టీలో 1974 నుంచి 1991 వరకూ సభ్యురాలు. 1990ల్లో జార్గ్ హైదర్ యొక్క ఫ్రీడం పార్టీతో ఆమె పెద్దస్థాయిలో వివాదం పెట్టుకోవడం వల్ల ఇంటింటా ఇంటింటా ఆమె పేరు మారుమోగింది. 1999లో జరిగిన నేషనల్ కౌన్సిల్ ఎన్నికలు, ఆపైన ఫ్రీడం పార్టీ, ఆస్ట్రియన్ పీపుల్స్ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కొత్త ప్రభుత్వంపై పెద్ద పెట్టున విరుచుకుపడ్డ విమర్శకుల్లో ఆమె ఒకరయ్యారు.
ఒక వేశ్యను హత్యచేశాడన్న అభియోగంపై జైలుపాలైన జాక్ అంటార్వేగర్ విడుదల కోసం జలినెక్ ప్రయత్నాలు చేశారు. ఇది నేరస్తుల్లో మార్పు తీసుకురావడం, పునరావాసం వంటివాటిలో విజయవంతమైన ప్రయత్నమని పలువురు మేధావులు, రాజకీయ నాయకులు ముందు భావించారు. కానీ అండర్వేగర్ విడుదలైన రెండేళ్ళలో మరో 9మంది స్త్రీలను హత్యచేశాడని ఋజువైంది, అతన్ని మరోసారి అరెస్టు చేశాకా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఉదంతం ఆమెకు అపఖ్యాతి తీసుకువచ్చింది.[9]
సాహిత్య రంగం
[మార్చు]జెనెలిక్ సాహిత్య కృషి బహుముఖీనమూ, అత్యంత వివాదాస్పదం అయినది. సాహిత్య విమర్శకులు ప్రశంసలు, నిందలూ కూడా చేశారు[10] ఫ్రిట్జ్ల్ కేస్ వచ్చినప్పుడు, ఆస్ట్రియన్ పర్వర్ట్ ఆలోచనలను హిస్టీరిక్ గా చిత్రించారనే నింద ఆమెపై మోపారు.[11] అలానే ఆమె రాజకీయ జీవితం గురించి కూడా వివాదాలు చుట్టుముట్టాయి. ఆమె సాహిత్యాన్ని గురించి వివాదాలు చుట్టుముట్టినా ఆమెను జార్జ్ బుచ్నర్ బహుమతి (1998), ముల్హీం నాటకకర్తల బహుమతి (2002, 2004), ఫ్రాంజ్ కాఫ్కా బహుమతి (2004),, నోబెల్ సాహిత్య బహుమతి (2004) వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు వరించాయి.[10]
స్త్రీ లైంగికత, లైంగిక వేధింపులు వంటివి సాధారణంగా ఆమె రచనల్లోని ప్రధానాంశాలు. విర్ సిండ్ లోక్వోగెల్, బేబీ (బేబీ! మేం బందిపోటులం), డీ లీభబెనెన్ (ప్రేమికులుగా స్త్రీలు), డీ క్లావీర్స్పీలెరిన్ (పియానో టీచర్) మానవ సంబంధాల్లో క్రౌర్యం, శక్తి చూపే ప్రభావాన్ని, విచిత్రంగా ఫార్మల్ శైలిలో ప్రతిబింబిస్తాయి. జెలినెక్ ప్రకారం, శక్తి, దూకుడు చాలాసార్లు సంబంధాలను నడిపించే శక్తులు. ఆమె వివాదాస్పద నవల లస్ట్ లైంగికత, దాడులు, వేధింపులు వంటివాటికి దృశ్యీకరణలు ఉంటాయి. ఆ నవల పలువురు విమర్శకుల నుంచి వ్యతిరేకమైన సమీక్షలు పొందింది, వారిలో కొందరు దీన్ని పోర్నోగ్రఫీతో సమానం చేశారు. అయితే మిగిలినవారు, అటువంటి వివరణల శక్తిని తప్పుగా వారు అర్థంచేసుకున్నారని సమర్థించారు.[10]
ఆమె నవల పియానో టీచర్, 2001లో ఆస్ట్రియన్ దర్శకుడు మైకేల్ హానెకే చేతిలో అదే పేరుతో సినిమాగా రూపుదిద్దుకుంది. సినిమాలో ఇసబెల్లె హపెర్ట్ ప్రధాన పాత్రలో నటించారు. ఆమె సాహిత్య కృషి ఇంగ్లీష్ మాట్లాడే దేశాల్లో పెద్దగా ప్రాచుర్యం పొందింది లేదు. అయితే, 2012 జూలై, ఆగస్టుల్లో ఆమె నాటకం ఐన్ స్పోర్ట్ స్టక్ యొక్క ఆంగ్లానువాదం నాటకంగా ప్రదర్శితమైంది, జస్ట్ ఎ మస్ట్ అనే నాటక కంపెనీ ఆంగ్ల భాషా ప్రపంచంలో ఆమె రచన కొంతవరకూ ప్రాచుర్యం పొందేట్టు చేసింది.[12][13][14] ఆ తర్వాతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి 2013న, న్యూయార్క్ లోని విమెన్స్ ప్రాజెక్ట్ ఆమె ప్రిన్సెస్ నాటకాల్లో ఒకటైన జాకీని ఉత్తర అమెరికా వ్యాప్తంగాప్రదర్శించింది.[15]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Elfriede Jelinek biography". notablebiographies.com. 23 March 2005.
- ↑ "Elfriede Jelinek: Introduction". eNotes. 15 June 2002.[permanent dead link]
- ↑ Elfriede Jelinek profile, The Poetry Foundation website; retrieved 7 September 2013.
- ↑ 4.0 4.1 4.2 Boiter, Vera (1998). Elfriede Jelinek. Women Writers in German-Speaking Countries. Westport, CT: Greenwood Press. pp. 199–207.
- ↑ "Portrait of the 2004 Nobel Laureate in Literature", nobelprize.org; retrieved 13 July 2010.
- ↑ Gottfried Hüngsberg profile IMDb.com; accessed 13 July 2010
- ↑ Honegger, Gitta (2006). "How to Get the Nobel Prize Without Really Trying". Theater. 36 (2). Yale School of Drama: Duke UP: 5–19. doi:10.1215/01610775-36-2-4.
- ↑ Eigler, Friederike (1997), "Jelinek, Elfriede", in Eigler, Friederike (ed.), The Feminist Encyclopedia of German Literature, Westport, CT: Greenwood Press, pp. 263–4
- ↑ Johann Unterweger biography, Johann Unterweger. (2014).
- ↑ 10.0 10.1 10.2 "Elfriede Jelinek". Contemporary Literary Criticism. Vol. 169. Gale. March 2003. pp. 67–155.
- ↑ "Wife of incest dad under suspicion Archived 2008-05-08 at the Wayback Machine".
- ↑ http://www.thestage.co.uk/features/2012/07/elfriede-jelinek-game-on/
- ↑ http://postcardsgods.blogspot.co.uk/2012/07/sports-play-nuffield-theatre-lancaster.html
- ↑ http://www.thetimes.co.uk/tto/arts/stage/theatre/article3474101.ece
- ↑ http://wptheater.org/show/jackie/