ఏదో ఏదో అన్నది..ఈ మసక వెలుతురు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఏదో ఏదో అన్నది..ఈ మసక వెలుతురు పాట ముత్యాల ముగ్గు (1975) అను తెలుగు సినిమా లోనిది. ఈ పాటకు ఆరుద్ర గారు సాహిత్యాన్ని అందించగా, కె.వి.మహదేవన్ గారు స్వరపరచగా, వి.రామకృష్ణ గారు ఆలపించగా, శ్రీధర్, సంగీతలు అభినయించారు.

పల్లవి:

ఏదో ఏదో అన్నది ...ఈ మసక వెలుతురు...

గూటి పడవలో విన్నది.... కొత్త పెళ్ళికూతురు..

ఏదో ఏదో అన్నది ...ఈ మసక వెలుతురు...

గూటి పడవలో విన్నది.... కొత్త పెళ్ళికూతురు..

చరణం1:

ఒదిగి ఒదిగి కూర్చుంది బిడియ పడే వయ్యారం....

ముడుచుకునే కొలది మరీ మిడిసిపడే సింగారం

సోయగాల విందులకై వేయి కనులు కావాలి

ఉ ఉ ఉ ఊ... ఉ ఉ ఉ ఊ ఊ.. ..ఏదో ఏదో అన్నది ...ఈ మసక వెలుతురు...

గూటి పడవలో విన్నది.... కొత్త పెళ్ళికూతురు.

చరణం2:

నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో...

నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమినొసగేరు...

పులకరించు మమతలతో పూల పాన్పు వేశారు!

ఉ ఉ ఉ ఊ... ఉ ఉ ఉ ఊ ఊ.. ..ఏదో ఏదో అన్నది ...ఈ మసక వెలుతురు...

గూటి పడవలో విన్నది.... కొత్త పెళ్ళికూతురు....