కింగ్ కోబ్రా
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
|
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
| రాచ నాగు | |||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
![]() |
|||||||||||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||||
|
|||||||||||||||||
|
|
|||||||||||||||||
| Ophiophagus hannah Cantor, 1836 |
|||||||||||||||||
Range (in red)
|
|||||||||||||||||
|
|
ప్రపంచములో అత్యంత పెద్ద మరియు పొడవైన విష సర్పములలో నల్లత్రాచు లేదా రాచనాగు లేదా కింగ్ కొబ్రా (Ophiophagus hannah - జాతి/ప్రజాతి నామము) మొదటిది. ఇది నేల పైన జీవించగలిగే సర్పము. సాధారణముగా ఇది 18.5 అడుగుల (5.7 మీటర్) పొడవు పెరుగుతుంది. బరువు సుమారుగా 44 (20 ) ఉంటుంది. దీని విషము మెదడు మీద అత్యంత ప్రభావాన్ని చూపుతుంది. దీని కాటు వలన మరణించే అవకాశం 75% వరకు ఉంది. దీనిని కొబ్రా అన్నప్పటికినీ "నాజ" ప్రజాతి లోనికి చెందని సర్పము. ఆహారముగా ఇతర పాములను, కొండ చిలువలను తింటుంది. అందువలన దీని జాతి పేరు "Ophiophagus" (గ్రీకు భాషలో Ophiophagus అంటే పాములను తినేది అని అర్థము) గా గుర్తించబడింది. చూడడానికే భీతి గొలిపే ఈ పాము స్వభావ సిద్దముగా సిగ్గరి! సాధారణముగా ముఖాముఖి ఎవరి కంటబడానికి ఇష్ట పడదు.
ఇతర కొబ్రా జాతి పాముల వలెనే ఈ పాము కూడా తన పొడవులో మూడవ వంతు పడగ ఎత్తగలదు. ఎదుర్కొన దలచినప్పుడు ఈ పాము పడగ పైకెత్తి పెద్దగా బుస కొడుతుంది. బాగా ఎదిగిన కింగ్ కొబ్రా పడగ పైకెత్తితే ఆరు అడుగుల ఎత్తుండి ఎదురుగా నిలిచిన మనిషి కళ్ళలోనికి ఉగ్రంగా చూస్తుంది.
విషయ సూచిక |
[మార్చు] ఉండే ప్రదేశాలు
కింగ్ కొబ్రా భారత్, దక్షిణ చైనా, మలేసియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ మరియు ఆగ్నేయ ఆసియా దేశాలలోని దట్టమైన అరణ్యాలలో జీవిస్తుంది. చుట్టూ సెలయేళ్ళు, చె రువులు ఉన్న ప్రదేశాలలో నివసించడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. ఇది నీటిలో బాగా ఈదగలదు. అడవులను విస్తారంగా నరికి వేయడముతో కొన్ని ప్రాంతాలలో ఈ పాముల సంఖ్య బాగా తగ్గిపోయింది. కానీ IUCN వారిచే ఇంకా అంతరించే ప్రమాదమున్న జీవిగా గుర్తింపబడలేదు.
గుడ్లను పొదగడానికి గూడు కట్టే ఏకైక సర్పమిది. దక్షిణ భారత రాస్త్రమైన కేరళ లో ఈ పామును "నాగరాజు" గా పూజిస్తారు. కేరళలో "నాయర్" అనబడే కులస్తులు ఈ పామును "కావు" అనే పేరుతో పూజిస్తారు.
[మార్చు] వేట, తిండి, విషం
ఇతర పాముల వలెనే కింగ్ కొబ్రా కూడా తన నాలుక తోనే వాసన చూస్తుంది. ఇతర జీవుల నుండి వచ్చే వాస నను తనలోని ఘ్రాణేనింద్రియాల ద్వారా (దీనిని Jacobson's Organ అంటారు) గ్రహిస్తుంది. ఏదైనా ఆహారం దగ్గరలో ఉన్నప్పుడు తన నాలుక ను బయటకు మరియు లోనికి పంపే చర్య ద్వారా ఆహారం ఎంత దూరంలో ఉందో పసిగడుతుంది. దీని దృష్టి నిశితమైనది. 100 మీటర్ల దూరంలోని ఆహారాన్ని కూడా చూడగలదు. మిగిలిన పాములతో పోలిస్తే ఇది బాగా తెలివైనా పాము. కాటు వేసిన తరువాత ఆహారాన్ని ఒక్కసారిగా మింగేస్తుంది. ఇతర పాముల వలె కింగ్ కొబ్రాకు స్థిరమైన దవడలు ఉండవు. దీని కింది దవడలు, పైన దవడలు వేటికవే వీడి విడిగా కదులుతూ ఆహారాన్ని మింగడానికి తోడ్పడతాయి. దవడలు వీడి విడిగా కదలడం వలన తన నోటి కన్నా పెద్దదైన ఆహారాన్ని తేలిగ్గా లోనికి తీసుకొనగలుగుతుంది. దీని దవడల నిర్మాణం చాలా గట్టిగా ఉంటుంది.
కింగ్ కొబ్రాకు ముఖ్య ఆహారం ఇతర పాములే. ఎక్కువగా విషం లేని పాములను తినడానికి ఇష్టపడుతుంది. కానీ విషపు పాములను కూడా తింటుంది. చాలా అరుదుగా ఇతర కింగ్ కొబ్రాలను కూడా తింటుంది. తిండి కొరత ఏఆర్పడితే బల్లులను ఇతర చిన్న జీవులను కూడా తింటుంది. దీని జీర్ణ క్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. కాబట్టి ఒకసారి భారీగా ఆహారాన్ని తీసుకుంటే నెలల తరబడి ఆహారం లేకుండా ఉండగలదు. కింగ్ కొబ్రా పగటి పూట ఆహారం కోసం వేటాడుతుంది. అరుదుగా రాత్రి కూడా వేటాడుతుంది.
తనకు హాని కలిగించే జీవీ ఏదైనా ఎదురైనప్పుడు (ముఖ్యంగా ముంగీస) కింగ్ కొబ్రా పారిపోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంది. ఆ అవకాశం లేనప్పుడు పడగ పైకెత్తి పెద్దగా బుస కొడుతూ బెదిరింపు కాటుకు ప్రయత్నిస్తుంది (తన విషం ముంగీస పైన ప్రభావం చూపదని తెలుసినప్పటికినీ).
కింగ్ కొబ్రా విషం ప్రోటీన్స్ తోనూ పాలిపెప్టెడ్స్ తోనూ తాయారౌతుంది. ప్రత్యేక లాలాజల గ్రంధులలో ఇది తాయారౌతుంది. ఈ విష గ్రంధులు కింగ్ కొబ్రా శరీరంలో కళ్ళకు వెనుక భాగంలో ఉంటాయి. కింగ్ కొబ్రా కోరలు 8 నుండి 10 మిల్లీ మీటర్ల పొడుగు ఉంటాయి. కాటు వేసినపుడు ఈ కోరాల ద్వారా విషం జీవీ శరీరం లోనికి ప్రవేశిస్తుంది. దీని విషం ఇతర పాముల కన్నా ప్రమాదకరమైనది కానప్పటికినీ కాటు వేసినప్పుడు ఎక్కువ విషం ఎక్కుతుంది కాబట్టి విష ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది(గబూన్ వైపర్ అనే విష సర్పం మాత్రమే కాటు వేసినప్పుడు కింగ్ కొబ్రా కన్నా ఎక్కువ విషం ఎక్కించగలదు). ఒక కాటుకు ఒక పెద్ద ఆసియన్ ఏనుగు చనిపోయేంత విషాన్ని కింగ్ కొబ్రా ఎక్కించగలదు.
కింగ్ కొబ్రా విషం శరీరం లోని నాడి వ్యవస్త మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఈ విష ప్రభావం వలన బాగా దేహమంతా నొప్పి, మసక బారిన దృష్టి, తల తిరగడం, మగత, పక్షవాతం కలుగుతాయి. తరువాత కొన్ని నిముషాలలోనే గుండెకు రక్త సరఫరా మందగిస్తుంది. దీనివలన కాటు తగిలిన జీవీ కొద్ది సేపటికే స్పృహ కోల్పోతుంది. శ్వాస తీసుకోవడం బాగా కష్టమవడం వల్ల త్వరగా మరణం సంభవిస్తుంది. ప్రస్తుతానికి రెండు కంపనీలు కింగ్ కొబ్రా విషా నికి విరుగుడు తయారు చేస్తున్నాయి. మొదటిది థాయ్ లాండ్ లోని రెడ్ క్రాస్ సంస్థ, రెండవది సెంట్రల్ రీసర్చ్ ఇన్ స్టిట్యుట్, ఇండియా. ఈ రెండు కంపనీలు తక్కువగా ఉత్పత్తి చేయడం వలన ఈ మందులు అంత విస్తారంగా దొరకవు.
[మార్చు] మూలాలు
- http://www.seanthomas.net/oldsite/danger.html
- http://www.priory.com/med/ophitoxaemia.htm
- http://www.engin.umich.edu/~cre/web_mod/viper/introduction.htm
- http://www.stlzoo.org/animals/abouttheanimals/reptiles/snakes/kingcobra.htm
- http://www.sandiegozoo.org/animalbytes/t-cobra.html
- http://encarta.msn.com/media_631509401_761559191_-1_1/King_Cobra.html
- [Dr. Zoltan Takacs: Why the cobra is resistant to its own venom?]
- http://www.uoregon.edu/~astanton/snakes/africansnakes.htm
- http://www3.nationalgeographic.com/animals/reptiles/king-cobra.html
- [Munich AntiVenom Index: Ophiophagus hannah]
