కుర్చీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కుర్చీ (ఆంగ్లం Chair) మన ఇంటిలో, కార్యాలయాలలో చాలా ఉపయోగకరమైన వస్తువు. వీటిని మేజాతో కలిపి ఉపయోగిస్తారు.

సాధారణంగా కుర్చీకి నాలుగు కాళ్ళు, బల్ల ఉండి చేరబడడానికి వెనుక భాగంతో, చేతులు పెట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. ఒక్క కూర్చోడానికి మాత్రమే ఉండే దానిని స్టూలు (Stool) అంటారు. ఒకరి కంటే ఎక్కువమంది కూర్చోడానికి అనువుగా ఉండేదానిని బెంచి, సోఫా అంటారు. వాహనాలలో లేదా సినిమా హాలులో బిగించియున్న కుర్చీలను సీట్లు అంటారు. కుర్చీలు ఎక్కడికైనా సులువుగా తీసుకొనివెళ్ళడానికి వీలవుతుంది. కుర్చీ వెనుకభాగానికి, /లేదా సీటుకి గాలి తగలడానికి వీలుగా కన్నాలుంటాయి.

కొన్ని కుర్చీలకు వెనుక భాగం తల ఉన్నంత ఎత్తు వరకు ఉంటుంది; మరికొన్నింటికి తల భాగం కోసం వేరుగా చిన్న మెత్త అతికించి ఉంటుంది. మోటారు వాహనాలలో ఈ మెత్త భాగం ప్రమాదం జరిగినప్పుడు మెడ, తల భాగాలను రక్షిస్తుంది. చారిత్రికంగా మనదేశంలో ప్రాచీనకాలంలో మహారాజులు, చక్రవర్తులు సభలో కూర్చోవడానికి ఎత్తైన వేదికమీద కళాత్మకమైన అలంకరణలతో చేతులు ఆనుకొనే భాగాల వద్ద సింహం తలలు అలాగే కుర్చీ కాళ్ళ చివర్లలో సింహపు గోళ్ళూ చేక్కిన కుర్చీలను "సింహాసనం" పేరుతో వ్యవహరించేవారు. సాధారణంగా కుర్చీల తయారీలో చెక్కను వాడే సాప్రదాయం వున్నా ఆధునిక కాలంలో కుర్చీల తయారీకి ఇనుము, ప్లాస్టిక్, ఫైబర్లను వాడుతున్నారు.

చక్రాల కుర్చీ (Wheel Chair) కాళ్ళతో నడవలేని వారు ఉపయోగిస్తారు. చక్రాలను చేతులతో తిప్పుతూ వీరు ముందుకు కదుల్తారు. కొన్నిటికి ఆపడానికి బ్రేకులు కూడా ఉంటాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=కుర్చీ&oldid=2879632" నుండి వెలికితీశారు