చక్రం

వికీపీడియా నుండి

యొగ సాధనలొ చక్రము అనగా కున్డలిని ఉద్దీపన స్తానములు . దీనినె కుండలిని స్తానములు అని కూడ అందురు.మానవ శరీరమునందు మూలాధారము నుండి స్వాధిష్తానము వరకు 7 చక్ర స్తానములు గలవు.యొగ సాధనము ద్వారా ఈ కుండలిని చక్ర స్తానములను ఉద్దీపనము చేయవఛును. డా.ఆకొండి రామ్.


___________________________________________________________________________________________________________________________________________

ఈ వ్యాసం అసంపూర్తిగా ఉన్నది. వ్యాసాన్ని పూర్తి చేసి ఈ మూస తొలగించండి.
కోణార్క్ దేవాలయంలో సూర్య భగవానుని రథచక్రం

చక్రం (ఆంగ్లం: Wheel) మనిషి కనుగొన్న మొట్టమొదటి పరికరం. చక్రం అనేది ఒక అక్షం (ఆక్సిస్) చుట్టూ తిరిగే గుండ్రటి పరికరం. రవాణా మరియు ఎన్నోరకాల యంత్రాలలో చక్రాలు విరివిగా వాడబడుతున్నాయి. ఇరుసు (ఆక్సిల్) సహాయంతో చక్రం దొర్లడం వల్ల రవాణాలో ఘర్షణ లేదా రాపిడి తగ్గుతాయి.

విషయ సూచిక

[మార్చు] చక్రం పుట్టుక

చక్రం అనే పదం ప్రోటో-ఇండో-యూరోపియన్ భాష నుండి ఉద్భవించినది. ఈ భాషలో *kwel- అనగా తిరగడం లేదా కదలడం అని అర్థం. దీని నుండి ఉద్భవించిన *kwekwlo-,[1]అనే పదం సంస్కృతంలో చక్ర మరియు పర్షియన్ భాషలోని చర్ఖ్ పదాలకు మూలంగా గుర్తించబడినది.[2]

చక్రము అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[3] చక్రము (chakramu) సంస్కృతం n. అనగా A wheel. A discuss or sharp-edged plate of steel, hurled at a foe like a quoit: the thunderbolt or weapon of Vishṇu. A realm, region. రాష్ట్రము. A figure, diagram or sign in astrology. The name of a coin. The bird called చక్రవాకము. A region or division of the body. చక్రధరుడు or చక్రపాణి Vishṇu. కటి or కటిచక్రము the loins, the region of the lions. అష్టకోణచక్రము an octagon. చక్రవర్తి chakra-varti.. n. An emperor or sovereign. రారాజు, సార్వభౌముడు. చక్రవర్తిని chakra-vartini. n. An empress. సార్వభౌమురాలు. చక్రవాకము chakra-vākamu. n. The Brahminy-duck or Ruddy Casarca rotila (F.B.I.) జక్కవపక్షి. The poetical swan, always described as being in pairs, to which poets liken fair breasts. చక్రవాళము chakravāḷamu. n. A range of mountains supposed to encircle the earth. చుట్టుకొండ. చక్రవృద్ధి chakra-vṛiddhi. n. Compound interest వడ్డికివడ్డి. చక్రాంకనము or చక్రాంకితములు or చక్రాంకములు chakrānkanamu. n. Marks branded on the front of the shoulders, representing the disc and shell of Vishṇu. (It is a rite similar to absolution.) చక్రాంగము chakrāngamu. n. A swan. హంస. చక్రాంగి a female swan. చక్రి chakri. n. The discus-wielder, i.e., Vishṇu విష్ణువు. A snake, because rolled in a ring. A potter, because using a wheel.

[మార్చు] చక్రాల ఆవిర్భావం

క్రీ.పూ. సిర్కా 2600, సుమేరియన్ నాగరికత నాటి ఉర్ పట్టణంలోని ఒనాగెర్ యుద్ధపు బండ్లు.
కుమ్మరి చక్రం; టర్కీలోని ఒక కుమ్మరి.

చక్రం పురాతన సుమర్(ఈ నాటి ఇరాక్)లో దాదాపు క్రీ.పూ. 5వ మిలీనియంలో కుమ్మరి పనికై, కుండలు తయారు చేయడానికి మొదటగా వాడబడినదని అనుకుంటారు[ఆధారం కోరబడినది]. క్రీ.పూ. 3వ మిలీనియంలో వెల్లివిరిసిన సింధూలోయ నాగరికతతో చక్రం వాడుక భారత దేశంలో ఆరంభమైనది[ఆధారం కోరబడినది]. కాకేసస్‌కు ఉత్తరభాగంలో బయలు పడిన సమాధుల ఆధారంగా క్రీ.పూ. 3700 సంవత్సరాలలో వాగన్లు (నాలుగు చక్రాలు) మరియు బండ్ల(రెండు చక్రాలు)తో సహా మనుషులను సమాధి చేసే వారని తెలుస్తుంది. ఇప్పటి పోలండ్‌లో లభించిన సుమారుగా క్రీ.పూ. 3500 సంవత్సరాల క్రితంనాటి చిత్రాలను బట్టి వాగన్లను చిత్రించిన అతి పురాతనమైన చిత్రంగా బ్రోనోసైస్ పాట్‌ను పేర్కొంటారు. [4]

ఇరాన్‌లోని ఒక మ్యూజియంలో భద్రపరచబడిన పురాతన చక్రం.

రథాల వాడుకను బట్టి చక్రాలు చైనాలో క్రీ.పూ. 1200 నుండి ఉన్నట్టు తెలుస్తుంది [5]. కొంతమంది పురాతత్వ శాస్త్రవేత్తల ప్రకారం చక్రాలు మరియు ఆక్సిల్ యూరోప్‌లోనే ఆవిర్భవించాయి. [6] చక్రాలు కలిగిన అతి ప్రాథమికమైన వాగన్‌గా "ట్రాగా న పూలి" అనబడే స్లెడ్జ్‌ని చెప్పుకొస్తారు. మానవజాతి వలసలు వెళ్ళడం ద్వారాను, ఇతర పరిచయాల ద్వారాను ఈ ఆవిష్కరణ కాస్పియన్ మరియు నల్ల సముద్రాల ప్రాంతాల వారికి తెలిసింది. అక్కడినుండి క్రీ.పూ 4వ మిలీనియంలో మెసపొటేమియాకు చేరింది.

[మార్చు] వాడుక మరియు పనితనం

చక్రం మరియు ఇరుసు ఒక సరళ యంత్రం (సింపుల్ మషీన్). చక్రాలు ఇరుసు సహాయంతో ఉపయోగించబడినపుడు కొన్ని సార్లు చక్రం ఇరుసు మీద ఇతర శక్తుల సహాయంతో తిరుగుతుంది లేదా చక్రం ఇరుసుని తిప్పుతుంది.

[మార్చు] ప్రకృతిలో చక్రాలు

  • ప్రకృతిలో వివిధ పదార్ధాలు తయారైన దగ్గరనుండీ వాటి వినియోగం, తిరిగి వాటి జన్మస్థానన్ని చేరడాన్ని చక్రాలుగా పేర్కొంటారు. ఉదాహరణకు నీటి చక్రం, ఆమ్లజని చక్రం, నత్రజని చక్రం మొదలైనవి.
  • కొన్ని పరాన్న జీవులు జీవిత పరిణామం వ్యాధికారకాలన్నింటినీ కూడా జీవితచక్రం అంటారు. ఉదా: టీనియా.


[మార్చు] సంస్కృతిలో

  • సుదర్శన చక్రం శ్రీ మహావిష్ణువు ఆయుధం.
  • యోగా: మానవుని శరీరంలో వెన్నుపాములో యోగాభ్యాసానికి చెందిన ఏడు చక్రాలు ఉంటాయి. వీటిని సప్తచక్రాలు అంటారు. వీటి ద్వారా సాధన చేసిన కుండలినీ యోగాన్ని సాధిస్తాడు.

[మార్చు] చక్రాల సహాయంతో నడిచేవి

[మార్చు] వాహనాలు

బండి చక్రం.
ఆధునిక మోటారు సైకిలు చక్రం.
  1. బండి
  2. సైకిలు
  3. కారు
  4. రిక్షా
  5. లారీ

[మార్చు] చిహ్నాలుగా చక్రాలు

భారత జాతీయ పతాకంలో అశోక చక్రం.

చక్రం అనే పదం సాంప్రదాయపరంగా మతపరంగా జీవిత చక్రం లేదా కాలచక్రం వంటి విషయాలను వ్యక్తీకరించడంలో విరివిగా ఉపయోగించబడుతుంది. చక్రం భారత జాతీయ పతాకంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ చక్రం ధర్మానికి చిహ్నం.

[మార్చు] మూలాలు

  1. "wheel". Online Etymology Dictionary. 
  2. http://www.bartleby.com/61/roots/IE250.html
  3. బ్రౌన్ నిఘంటువు ప్రకారం చక్రము పదప్రయోగాలు.
  4. Waza z Bronocic (in Polish)
  5. Dyer, Gwynne, War: the new edition, p. 159: Vintage Canada Edition, Randomhouse of Canada, Toronto, ON
  6. Ojczyzna wozu: Europa czy Bliski Wschód (in Polish), Wiedza i Życie, 8/1996
  7. Noji, H., Yasuda, R., Yoshida, M., Kinosita, K. (1997). "Direct observation of the rotation of F1-ATPase". Nature 386 (6622): 299-302. 
  8. Berg, H.C., Anderson R.A. (1973). "Bacteria Swim by Rotating their Flagellar Filaments". Nature 245 (5425): 380-382. 
"http://te.wikipedia.org/w/index.php?title=చక్రం&oldid=710274" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు