బరువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
A spring scale measures the weight of an object
గ్రామాల్లో వినియోగించే త్రాసు

భారము (ఆంగ్లం Weight) ఒక కొలమానము. భౌతిక శాస్త్రం ప్రకారం, ఒక వస్తువు పై గల గురుత్వాకర్షణ బలాన్ని "భారము" లేదా "బరువు" అంటారు. వస్తువు బరువు దాని ద్రవ్యరాశి, గురుత్వ త్వరణాల లబ్ధానికి సమానం. 'm' ద్రవ్యరాశి గల వస్తువుపై, 'g' గురుత్వ త్వరణం కలగజేసే భారం W=mg అవుతుంది. ఇది ప్రదేశాన్ని బట్టి మారుతుంది. ఒక కిలోగ్రాము ద్రవ్యరాశి గల వస్తువు భారం భూమిపై సాధారణంగా 9.8 న్యూటన్లు ఉంటుంది. భారం అంటే వస్తువుపై గురుత్వాకర్షణ బలం కావున దీని ప్రమాణాలు బలం ప్రమాణాలతో సమానంగా ఉంటుంది. భారమునకు దిశ ఉంటుంది. కాబట్టి, భారం సదిశ రాశి

సూత్రము, ప్రమాణాలు[మార్చు]

సూత్రము

,

m అనగా వస్తువు ద్రవ్యరాశి , g అనగా గురుత్వ త్వరణం ప్రమాణాలు

  • సి.జి.యస్ పద్ధతిలో "డైన్" లేదా " గ్రాం భారం"
  • ఎస్.ఐ పద్ధతిలో " న్యూటన్" లేదా "కిలో గ్రాం భారం"

కొలిచే పరికరము

  • స్ప్రింగు త్రాసు

భూమిపై వివిధ ప్రాంతాల్లోవస్తువు భారం[మార్చు]

వివిధ ప్రాంతాల్లో ఒక కిలో గ్రాము ద్రవ్యరాశి గల వస్తువు భారం
భూమధ్య రేఖ సిడ్నీ అబెర్దీన్ ఉత్తర ధ్రువం
గురుత్వ త్వరణం 9.7803 మీ/సె2 9.7968 మీ/సె2 9.8168 మీ/సె2 9.8322 మీ/సె2
వస్తువు భారం 9.7803 న్యూటన్లు 9.7968 న్యూటన్లు 9.8168 న్యూటన్లు 9.8322 న్యూటన్లు


చంద్రునిపై[మార్చు]

భూమిపై గురుత్వ త్వరణం 9.8 మీ/సె2 ఉండును. చంద్రుని పై గురుత్వ త్వరణం 1.67 మీ/సె2 ఉండును. ఈ విలువ భూ గురుత్వ త్వరణంలో 1/6 వంతు ఉండును. కనుక చంద్రునుపై వస్తువు భారం భూమిపై వస్తుపు భారంలో 1/6 వంతు ఉండును. ఉదా: ఒక వ్యక్తి బరువు భూమిపై 60 కి.గ్రాం.లు అయిన అదే వ్యక్తి బరువు చంద్రునిపై 10 కి.గ్రా. ఉండును.

సూర్యునిపై[మార్చు]

భూమిపై గురుత్వ త్వరణం 9.8 మీ/సె2 ఉండును. సూర్యుని పై గురుత్వ త్వరణం 274.1 మీ/సె2 ఉండును. ఈ విలువ భూ గురుత్వ త్వరణం కన్నా 28 రెట్లు ఎక్కువ ఉండును. కనుక సూర్యునిపై వస్తువు భారం భూమిపై వస్తుపు భారం కన్నా 28 రెట్లు ఎక్కువ ఉండును.

ఇతర గ్రహములపై[మార్చు]

గ్రహం పేరు భూమిపై గురుత్వ త్వరణంకన్నా ఎన్ని రెట్లు
గురుత్వ త్వరణం
గ్రహం పై గురుత్వ త్వరణం వస్తువు భారం (Kg.wt)
బుధుడు 0.3770 3.703 377 gmwt
శుక్రుడు 0.9032 8.872 903.2 gmwt
భూమి 1 9.8226 1 kgwt
అంగారకుడు 0.3895 3.728 389.5 gmwt
బృహస్పతి 2.640 25.93 2.64 kgwt
శని 1.139 11.19 1.139 kgwt
యూరెనస్ 0.917 9.01 917 gmwt
నెప్ట్యూన్ 1.148 11.28 1.148 kgwt

కొలిచే సాధనాలు[మార్చు]

భారమును కొలిచెందుకు స్ప్రింగ్ త్రాసును ఉపయోగిస్తారు. ఈ త్రాసు హుక్ సూత్రము పై ఆధారపడి పనిచేస్తుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=బరువు&oldid=3319300" నుండి వెలికితీశారు