కారు
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
కారు (ఆంగ్లం Car) అనే పదం మోటార్ కార్ కు వాడుక పదం. కారునే ఆటోమొబైల్ అని కూడా అంటారు. ఆటోమొబైల్ అనే పదానికి అర్థం తనకు తానుగా కదిలే వాహనం అని. ఈ పదానికి మూలాలు గ్రీకు భాషలోని ఆటో (తనకు తాను) మరియు లాటిన్ భాషలోని మొబిలిస్ (కదులుట) అనే రెండు పదాలతో ముడిపడి ఉన్నాయి. కారు మోటారుతో నడిచే చక్రాలు కలిగిన వాహనం. నిర్వచనాల ప్రకారం ఆటోమొబైల్లు ఒకటి నుండి ఎనిమిది మంది కూర్చొనడానికి వీలుగా ఉండి 4 చక్రాల సహాయంతో మానవుల రవాణాకు మాత్రమే ఉపయోగపడే ఒక వాహనం. [1] కాని, చాలా రకాల వాహనాలు చాలా పనులకొరకు ఉపయోగించబడుతున్నాయి, కనుక ఆటోమొబైల్‌కు పై నిర్వచనం కొన్ని సార్లు వర్తించకపోవచ్చు.
2002 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 590 మిలియన్ పాసింజర్ కార్లు (అనగా ప్రతీ 11 మందిలో ఒక కారు) ఉన్నాయి.[2]
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
1769లో మొట్టమొదటి తనకుతాను నడిచే వాహనాన్ని కనుగొన్నట్టుగా నికోలస్-జోసెఫ్ కగ్నాట్‌ను పేర్కొంటారు, కాని కొంతమంది ఈయన తయారు చేసిన మూడు చక్రాల వాహనం అసలు నడవలేదని చెప్తారు. మరికొంతమంది ఫెర్డినాడ్ వెర్బీస్ట్ అనే ఆయన ఆవిరితో నడిచే కారును 1672 లో కనుగొన్నట్టు చెప్తారు.[3][4] ఏదేమైనా గాని స్విస్ దేశానికి చెందిన ఫ్రంకోయిస్ ఐసాక్ డె రివాజ్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ల మిశ్రమంతో నడిచే మొట్టమొదటి 'ఇంటర్నల్ కంబషన్ ఇంజన్' కలిగిన వాహనాన్ని రూపొందించాడు. కాని ఆ డిసైన్ అంత విజయవంతమవలేదు.[5]
1881 నవంబర్‌లో ఫ్రాన్స్ దేశానికి చెందిన గస్టావె ట్రావె పారిస్‌లో జరిగిన 'ఇంటర్నేషనల్ ఎక్సిబిషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటి'లో నడిచే మూడు చక్రాల వాహనాన్ని ప్రదర్శించాడు. [6]
[మార్చు] రోబోటిక్ కార్లు
మన శాస్త్రవేత్తలు డాక్టర్ భీబయ్య శర్మ, డాక్టర్ ఉతేష్ చంద్ బృందం రూపొందించిన గణిత సూత్రాలు రొబోటిక్ కార్లు తాము ప్రయాణిస్తున్న దారిని ఎప్పుడు, ఎలా మార్చుకోవాలో తెలియజేస్తాయి.రొబోటిక్ కారును అందులో ఉండే సెంట్రలైజ్డ్ బ్రెయిన్ నియంత్రిస్తూ ఉంటుంది. ఈ సెంట్రలైజ్డ్ బ్రెయిన్‌కు శాస్త్రవేత్తలు రూపొందించిన అల్గారిథమ్స్ ఎప్పటికప్పుడు సూచనలు అందజేస్తూ ఉంటాయి. ప్రతి కారులోనూ సెంట్రలైజ్డ్ బ్రెయిన్స్ ఉంటాయి కాబట్టి ఇవి పరస్పరం సంభాషించుకుంటూ ఉంటాయి. ఎప్పుడన్నా మరీ దగ్గరగా వచ్చినా, ఎదురెదురుపడినా పరస్పరం సంభాషించుకుని సురక్షిత మార్గం ఏదో గుర్తించి ఆ దిశగా కదులుతాయి. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గిపోతాయి. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తవు. కార్లు రెండూ ఎదురెదురుగా వచ్చినప్పుడు మాత్రం ప్రమాదం జరగదు. అలా కాకుండా కార్లు ప్రయాణిస్తున్న సమయంలో ఒకదాని పక్కకు ఒకటి అత్యంత సమీపంలోకి వచ్చినా, లేదంటే కారు మరీ రోడ్డు పక్కకు వచ్చినా ప్రమాదం జరగదని చెప్పలేం.ఎందుకంటే - రోబోటిక్ కార్లలో ఉండే సెంట్రలైజ్డ్ బ్రెయిన్‌లకు సూచనలు అందించే అల్గారిథమ్స్ ఎదురెదురుగా వచ్చే రోబోటిక్ కార్ల నడుమ మాత్రమే సమాచార బదిలీ జరుగుతుంది. పక్కపక్కన ప్రయాణించే కార్లు పరస్పరం సభాషించుకోలేవు, సమాచారం ఇచ్చిపుచ్చుకోలేవు .
[మార్చు] బ్లాక్ బాక్సులతో కార్లు
ఈ బ్లాక్ బాక్సులో కారు వేగం, స్టీరింగ్, బ్రేకులు పనితీరు వీడియో చిత్రాలతో నమోదవుతుంది. దీనికోసం వాహనం లోపలా, బయటా కెమెరాలూ అమర్చుతారు. ప్రమాదం జరిగిన తర్వాత ఈ పరిజ్ఞానం తనంతట తానే పోలీసులు, బీమా సంస్థలకు సమాచారం అందిస్తుంది. దీనివల్ల ప్రమాదానికి కారణాన్ని, బాధ్యులను వెనువెంటనే గుర్తించే అవకాశం ఉంటుంది. ఇందులో ఉండే కెమెరా పరిజ్ఞానం రోడ్డుపై ఉండే సంకేత చిహ్నాలను గుర్తించి, నియంత్రణలోనూ తోడ్పడుతుంది. కారులో ఉండే సెన్సర్లు రోడ్డుపై గుంతలను గుర్తించి జీపీఎస్ వ్యవస్థ సాయంతో రహదారుల నిర్వహణ విభాగాలకు ఎప్పటికప్పుడు సమాచారం పంపుతాయి. కారును అడ్డగోలుగా నడుపుతున్నా, ఇతర వాహనాలకు మరీ సమీపంగా వెళ్లినా, వరుసలు మార్చి నడిపినా వెంటనే డ్రైవర్‌కు హెచ్చరిక అందుతుంది.
[మార్చు] బీఎస్-4 వాహనం
2010 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దేశంలోని 13 నగరాల్లో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే బీఎస్-4 వాహనాల్ని మాత్రమే రిజిస్టర్ చేస్తున్నారు. బీఎస్-3 వాహనం రిజిస్టర్ చేయడానికి వాహనాల డీలర్లు ప్రయత్నించినా ఇకపై ఆన్‌లైన్ కంప్యూటర్ పోగ్రాం తిరస్కరిస్తుంది.
[మార్చు] గాలి వాహనం
బెంగళూరు సమీపంలోని రామనగరకు చెందిన నంజుండయ్య గాలితో వాహనాన్ని నడిపి చూపాడు.14 కెజీల గాలిని రెండు సిలిండర్లతో నింపుకుంటే యాభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చన్నారు.
[మార్చు] మైలేజీ పెంచే యంత్రం
కారులో ఇంధన వృథాను అరికట్టి తద్వారా మైలేజీని పెంచే యంత్రాన్ని తమిళనాడుకు చెందిన రైతు నెహ్రూ కనుగొన్నాడు. పాకెట్‌సైజులో ఉన్న ఈ యంత్రాన్ని ఇంజిన్‌కు బిగిస్తే 15-20 శాతం ఇంధనం పొదుపు అవుతుందని, మైలేజీ 30 శాతం పెరుగుతుందని ఈయన ప్రయోగపూర్వకంగా నిరూపించారు.
[మార్చు] మూలాలు
- ↑ (1976) పాకెట్ ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ. లండన్: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్. ISBN 0-19-861113-7.
- ↑ వరల్డ్ మ్యాపర్ - పాసింజర్ కార్స్.
- ↑ SA MOTORING HISTORY - కాల రేఖ. దక్షిణ ఆస్ట్రేలియా ప్రభుత్వము.
- ↑ సెట్‌రైట్, ఎల్. జె. కె. (2004). డ్రైవ్ ఆన్!: ఎ సోషల్ హిస్టరీ ఆఫ్ ద మోటార్ కార్. గ్రాంటా బుక్స్. ISBN 1-86207-698-7.
- ↑ రాల్ఫ్ స్టీన్ (1967). ద ఆటోమొబైల్ బుక్. పాల్ హామ్లిన్ లిమిటెడ్.
- ↑ వేక్‌ఫీల్డ్, ఎర్న్‌స్ట్ ఎచ్. (1994). హిస్టరీ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఆటోమొబైల్. సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజనీర్స్, ఇంక్.. ISBN 1-56091-299-5.
[మార్చు] బయటి లింకులు
