కులశేఖరుడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కులశేఖర ఆళ్వార్
Kulasekhara Alwar.png
జననం 3075 BCE[1][2]
Alwarthirunagiri
బిరుదులు/గౌరవాలు ఆళ్వార్
తత్వం వైష్ణవం, భక్తి
సాహిత్య రచనలు ముకుందమాల, పెరుమాల్ తిరుమోళి
Also a king of Later Chera Kingdom

పన్నెండుమంది ఆళ్వార్లలో ఒకడైన కులశేఖర ఆళ్వార్‌ పునర్వసు నక్షత్రమున జన్మించాడు. అతను చేర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. గొప్ప రామభక్తుడైన అతను రాముని కష్టాలు తన స్వంత కష్టములుగా భావించేవాడు. అందువలన అతనిని ‘పెరుమాళ్‌’, (అంటే ‘అతి గొప్పవాడు’ – సాధారణముగ వెంకటేశ్వరస్వామికి ఉపయోగించే పేరు) అనికూడా పిలిచేవారు. అతని భక్తి ఎంత తీవ్రమైనదంటే స్వామి భక్తులను సాక్షాత్తు స్వామివలే పూజించేవాడు. అతను శ్రీరంగములో నివసిస్తూ అక్కడి ఆలయములో రంగనాథ స్వామి సేవచేస్తుండేవాడు.ఈయన వేంకటేశ్వరస్వామి ని నీ గర్భగుడి ముందు గడపగా నైనా పడివుండే వరమీయమని అడిగితే స్వామి తదాస్థు అన్నారట.నేటికీ తిరుమల లో గర్భగుడి ద్వారాని కున్న గడపని 'కులశేఖర పడి' అని అంటారు. ఇతడు ముకుందమాల అను భక్తి స్తోత్రాన్ని సంస్కృతంలో రచించాడు.

మూలాలు[మార్చు]

  • Source: Naalaayira divya prabhandham: Commentary by. Dr. Jagadrakshakan. (1997). Aazhvaargal Research Centre, Chennai 600017.