Jump to content

కె.సదాశివరెడ్డి

వికీపీడియా నుండి

కె. సదాశివరెడ్డి (మ. ఫిబ్రవరి 6, 2016) మెదక్ జిల్లా సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు. ఆయన 1994 నుంచి 1999 వరకు సంగారెడ్డి(టీడీపీ) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన 1981 నుంచి 1986 వరకు పటాన్‌చెరు సమితికి అధ్యక్షుడిగా పనిచేశారు. 1986 నుంచి 1990 వరకు సహకార సంఘం అధ్యక్షుడిగా రైతులకు సేవలందించారు. 1970 నుంచి 1981 వరకు పటాన్‌చెరు సర్పంచ్‌గా ఉన్నారు.[2] 1994 నుంచి 1999 వరకు సంగారెడ్డి(టీడీపీ) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పట్లో పటాన్‌చెరు నియోజకవర్గమంతా సంగారెడ్డిలో ఉండేది. అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్‌గా ఉన్న పి.రామచంద్రారెడ్డిపై సదాశివరెడ్డి అత్యధిక మెజార్టితో గెలుపొంది రికార్డు సాధించారు.[3]

అప్పటి ప్రభుత్వం ఆయన్ను ఏపీఐఐసీ, ఏపీఐడీసీ డెరైక్టర్ పదవుల్లో నియమించింది. అలాగే ఆయన హుడా సభ్యుడిగా హైదరాబాద్ అభివృద్ధి కోసం సేవలందించారు. ఆ తర్వాత నుంచి పటాన్‌చెరులోనే తన సొంతింట్లో కుటుంబ సభ్యులతోపాటు ఉంటున్నారు.

మరణం

[మార్చు]

ఫిబ్రవరి 6, 2016 మధ్యాహ్నం సదాశివరెడ్డి గుండెపోటుకు గురయ్యారు. దీంతో హుటాహుటిన మదీనగూడలోని ఓ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు.[4]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (6 November 2023). "భార్యాభర్తలు.. తండ్రీకొడుకులు.. ఎమ్మెల్యేలుగా..." Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.
  2. "మాజీ ఎమ్మెల్యే సదాశివరెడ్డి కన్నుమూత". సాక్షి. 7 February 2016. Retrieved 7 February 2016.
  3. "Andhra Pradesh Assembly Election Results in 1994". elections.in/. Archived from the original on 5 సెప్టెంబరు 2016. Retrieved 7 February 2016.
  4. "మెదక్ జిల్లా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కె. సదాశివరెడ్డి ఇక లేరు". Archived from the original on 2016-02-09. Retrieved 2016-02-07.

ఇతర లింకులు

[మార్చు]