కొప్పరపు వేంకటరమణ కవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొప్పరపు వేంకటరమణ కవి తన సోదరుడు కొప్పరపు వేంకట సుబ్బరాయ కవితో కలిసి కొప్పరపు సోదర కవులు పేరుతో జంట కవిత్వం చెప్పాడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఇతడు ప్రకాశం జిల్లా(పూర్వము గుంటూరు జిల్లా), సంతమాగులూరు మండలం (పూర్వము నర్సరావుపేట తాలూకా), కొప్పరం గ్రామంలో 1887, డిసెంబరు 30వ తేదీకి సరియైన సర్వజిత్ నామ సంవత్సర పుష్య బహుళ పాడ్యమి, శుక్రవారము నాడు కొప్పరపు వేంకట రాయడు, సుబ్బమాంబ దంపతులకు జన్మించాడు. ఇతడు ఆరువేల నియోగి బ్రాహ్మణుడు. పోతరాజు రామకవి, రామడుగు రామకృష్ణశాస్త్రి గార్ల వద్ద ఇతడు శిష్యరికం చేశాడు. ఇతడు తన సోదరుడు కొప్పరపు వేంకట సుబ్బరాయ కవితో కలిసి 1908 నుండి 150కి పైగా అష్టావధాన, శతావధాన, ఆశుకవితా ప్రదర్శనలు ఇచ్చాడు. అనేక సంస్థానాలలో సత్కారాలు, సన్మానాలు పొందాడు. ఇతడు 1942, మార్చి 21న మరణించాడు.

ముఖ్యమైన అవధానాల జాబితా[మార్చు]

  • బాపట్ల శతావధానము (15-09-1911)
  • విశదల శతావధానము (17-09-1911)
  • గుంటూరు శతావధానము (01-10-1911)
  • చీరాల శతావధానము (16-10-1911)
  • పంగిడిగూడెము శతావధానము (1920)
  • సంపూర్ణ శతావధానము (1921)

రచనలు[మార్చు]

ఇతడు తన సోదరునితో కలిసి ఈ క్రింది రచనలు చేశాడు.

  1. కృష్ణ కరుణా ప్రభావము
  2. దైవసంకల్పము
  3. కుశలవ నాటకము
  4. కనకాంగి
  5. పసుమర్తి వారి వంశావళి
  6. జ్ఞానోపదేశము
  7. నారాయణాస్త్రము
  8. దీక్షిత స్తోత్రము
  9. శతావధానము మొదలైనవి.

బిరుదులు[మార్చు]

ఇతడు సోదరునితో కలిసి ఈ క్రింది బిరుదులను పొందాడు.

  • ముంగాలి
  • బాల సరస్వతి
  • ఆశు కవీంద్రసింహ
  • విజయ ఘంటికా
  • ఆశుకవి చక్రవర్తి
  • కుండిన కవిసింహ
  • కవిరత్న
  • అవధాని పంచానన
  • కథాశుకవీశ్వర
  • ఆశుకవిశిఖామణి మొదలైనవి.

మూలాలు[మార్చు]