కోడిపందెం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Cock fight in London, c. 1808
A Cockfight in Lucknow, 1784-1786, by Johann Zoffany.
A Cockfight in zoo.
In this ancient Roman mosaic, two cocks face off in front of a table displaying the purse for the winner between a caduceus and a palm of victory (National Archaeological Museum of Naples)
Spurs taped and tied onto legs
Cockfight in Lima, Peru
Two gamecocks fighting, Thailand, 1967
A cockfight in Tamil Nadu, India
A cockfight on the outskirts of Kabul, Afghanistan
A cockfight in Hilongos, Philippines
Cockfight in Vietnam.
Cockfight in Otavalo, Ecuador
Cockfighting club in Puerto Rico, 1937.
Sunday Cockfight at Madrid, an 1873 wood engraving
Greek youngsters watching a cockfight, from Jean-Léon Gérôme (1846).
Cockfight, from Emile Claus (1882)
Falguière's Victor of the Cockfight, book engraving c. 1900, with added drapery
"Two cocks fighting: striving for Christ and the palm of glory."

కోడిపందెం అనేది రెండు పందెం కోళ్ళ మధ్య నిర్వహించే క్రీడ. ఈ పందేలను ప్రతీ యేటా సంక్రాతి పండుగ సమయంలో నిర్వహిస్తుంటారు. ఈ పందాలు ప్రపంచ పురాతన పందాలుగా చరిత్రలో చెప్పబడ్డాయి. 6000 సంవత్సరాలకు పూర్వమే పర్షియా లో కోడి పందాలు జరిగాయని తెలుస్తున్నది[1]. మన రాష్ట్రంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ ఏర్పాట్లతో పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. ఈ పందెం కోసం ప్రత్యేకంగా పెంచే కోడిపుంజులను పందెం కోళ్ళు అంటారు. వీటి ఆహార విషయంలో యజమానులు ఎంతో శ్రద్ధ వహించి పెంచుతారు. పందెం సమయంలో పందెం కోడి కాలికి మూడు నుండి నాలుగు అంగుళాలు చురకత్తిని కట్టి పందెంలోకి దించుతారు. బెట్టింగు జరిగే అవకాశం ఉన్నందున ఈ పందేల నిర్వహణ సాంప్రదాయంగా కొనసాగుతున్నప్పటికీ వీటి నిర్వహణకు ప్రభుత్వ అనుమతి ఉండదు.

కోళ్ళ రకాలు[మార్చు]

ఈక రంగును బట్టి పందెం కోళ్లను రకరకాల పేర్లతో పిలుస్తారు. గోదావరి జిల్లాల్లో ఎక్కువగా డేగ, కాకి రకాలుంటాయి. ఆ తర్వాత నెమలి, పర్ల ఎక్కువగా కనిపిస్తాయి. చవల, సేతువ, కొక్కిరాయి, పచ్చకాకి, రసంగి, కౌజు, మైల, ఎరుపుగౌడు, తెలుపుగౌడు వంటి పలు రకాల కోళ్లుంటాయి. కోడి రంగు, సూర్యుని వెలుగుని బట్టి పందెం రాయుళ్లు రంగంలోకి దిగుతారు. కోడి పందేలను నాలుగు రకాలుగా నిర్వహిస్తారు. ఎత్తుడు దించుడు పందెం, చూపుడు పందెం, ముసుగు పందెం, డింకీ పందెం. వీటిల్లో ఎత్తుడు దింపుడు పందేలకు ఎక్కువ గిరాకీ ఉంటోంది. కోళ్లను తీసుకొచ్చిన వారు కాసే పందేల కంటే వాటిని చూడడానికి వచ్చేవారు కాసే పందేలే వందరెట్లు ఎక్కువగా జరుగుతాయి.[2]

పందెం తీరు[మార్చు]

కోడికి కత్తి కడితే పందేల నిర్వాహకులకు కనకవర్షమే. నిర్వాహకులు ఒక పందెం సొమ్ములో 10 శాతాన్ని కేవులు(తీతలు)గా వసూలు చేస్తారు. ఒక్కో బరిలో రోజుకు తీతలే రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా. [3]

విష సంస్కృతి[మార్చు]

సంప్రదాయం పేరుతో సాగే కోడిపందేలలో డబ్బే పరమావధిగా మారింది. తరతరాలుగా వస్తున్న పందేలలో పాటించే నీతికి ఎప్పుడో తిలోదకాలిచ్చారు. కాలికి కట్టిన కత్తితో ప్రత్యర్థి పుంజును చిత్తు చేయగలిగిన పుంజునే విజయం వరించడం న్యాయం. అయితే, ఇప్పుడు త్వరగా పందేలు పూర్తిచేసేందుకు, అడ్డదారుల్లో గెలిచేందుకు కత్తులకు విషరసాయనాలు పూసేందుకు కొందరు పూనుకుంటున్నారు. అలాగే బరిలో దిగే కోళ్లకు స్టెరాయిడ్స్, పెయిన్‌కిల్లర్లు ఇష్టానుసారం వినియోగిస్తున్నారు.[4]

మూలాలు[మార్చు]

  1. "History". Aseellovers.20m.com. సంగ్రహించిన తేదీ 2012-08-13. 
  2. "కోడి’తే కోట్లే..". Sakshi. 2014-1-14. సంగ్రహించిన తేదీ 2014-01-15. 
  3. "కోడి’తే కోట్లే..". Sakshi. 2014-1-14. సంగ్రహించిన తేదీ 2014-01-15. 
  4. "కోడి’తే కోట్లే..". Sakshi. 2014-1-14. సంగ్రహించిన తేదీ 2014-01-15. 
"http://te.wikipedia.org/w/index.php?title=కోడిపందెం&oldid=1175578" నుండి వెలికితీశారు