గజ్జి
వికీపీడియా నుండి
గజ్జి (ఆంగ్లం: Scabies) ఒక విధమైన పరాన్న జీవి వలన కలిగే అంటు వ్యాధి. ఇది చర్మంలో సొరంగాలు చేసి దాని మూలంగా విపరీతమైన దురద, పుండ్లు మరియు వాపు కలుగుతుంది. ఈ పరాన్న జీవి పేరు "సార్కాప్టిస్ స్కేబీ" (Sarcoptes scabei). స్కేబీస్ అనే పదం లాటిన్ స్కేబెర్ అనగా గోకడం నుండి వచ్చింది.