గన్ను కృష్ణమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గన్ను కృష్ణమూర్తి
జననంగన్ను కృష్ణమూర్తి
1945, సెప్టెంబర్ 2
వరంగల్ జిల్లా, నెక్కొండ
మరణం2022, సెప్టెంబరు 9
కామారెడ్డి
నివాస ప్రాంతంకామారెడ్డి
ఇతర పేర్లుఎక్స్ రే
ప్రభంజనం
యుగంధర్
భారతి
వృత్తివాణిజ్య శాస్త్ర ఉపన్యాసకుడు
ప్రసిద్ధికథా రచయిత కవి, విమర్శకుడు
మతంహిందూ
తండ్రిగన్ను వైకుంఠం
తల్లిగన్ను జగదాంబ

గన్ను కృష్ణమూర్తి (1945, సెప్టెంబరు 2 - 2022, సెప్టెంబరు 9) పేరొందిన తెలంగాణ కవి, రచయిత, విమర్శకుడు.

జననం, విద్య[మార్చు]

ఇతడు 1945, సెప్టెంబర్ 2వ తేదీన గన్ను జగదాంబ, గన్ను వైకుంఠం దంపతులకు వరంగల్ జిల్లా, నెక్కొండ గ్రామంలో జన్మించాడు[1], [2]. ఇతడు వాణిజ్యశాస్త్రంలో స్నాతకోత్తర పట్టా పొందాడు. తరువాత ఎం.ఫిల్., పట్టాను కూడా సంపాదించాడు.

ఉద్యోగం[మార్చు]

ఇతడు కొంతకాలం సర్వే ఆఫ్ ఇండియాలో, మరికొంత కాలం తపాలాశాఖలో ఉద్యోగం చేశాడు. తరువాత వాణిజ్యశాస్త్ర ఉపన్యాసకుడిగా 30 సంవత్సరాలు పనిచేసి 2004లో పదవీ విరమణ చేశాడు.[3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రచనలు[మార్చు]

  • నాదమే వేదమ్‌ వేదమే దేవమ్‌
  • తపస్సు (కథా సంపుటి)
  • కవితా కాళింది (కవితా సంపుటి)
  • కత్తుల కౌగిలి (ప్రతీకాత్మక గేయకథాకావ్యము)
  • అడవిపూలు (వచనకవితా సంపుటి)
  • మహాప్రభంజనం (సాహిత్య విమర్శ, ప్రతివిమర్శన, స్పందన, ప్రతిస్పందన, పరిశోధన, లేఖ, గల్పిక ఇత్యాదులు)
  • రాముడంటే ఎవరు? రామాయణమంటే ఏమిటి? : వాల్మీకి రామాయణం ఒక విశ్వరూప సందర్శనం
  • యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వారి వస్త్రాపహరణం
  • అంతరంగ తరంగాలు (మినీ కవితా సంపుటి)
  • అంతరంగం (మినీ కవితా సంపుటి)
  • మహాసంకల్పం[4] (గేయకావ్యం)
  • కృష్ణాయనం (పరిశోధన)
  • కృష్ణవేదం (పద్యాలు)
  • ఈ మట్టి నన్ను వెళ్ళనీదు
  • ఒక మానవతా వృక్షచ్ఛాయలో
  • ఏక్ లహర్ సాగర్‌కీ (కవిత)
  • ఋషి హృదయం
  • కోటి గొంతుకలు (కవితా సంకలనం, సంపాదకత్వం సూరారం శంకర్‌తో కలిసి)

కథలు[మార్చు]

ఇతని కథలు ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, జాగృతి, పుస్తకం తదితర పత్రికలలో అచ్చయ్యాయి. ఇతడు వ్రాసిన కథల పాక్షిక జాబితా:

  1. అస్థిపంజరం
  2. ఆకాశం పందిరిక్రింద
  3. ఎంట్రన్స్ కమ్ ఎగ్జిట్
  4. ఏటికేతముగట్టి
  5. ఓ తాగుబోతు కథ
  6. కట్నం
  7. కలల టివి పెట్టి
  8. కోరిక
  9. గోచిగుడ్డ కథ
  10. చిట్టిరెడ్డి...
  11. చిరుగుల ప్రపంచం
  12. చిల్లర కథ
  13. చీపురు కట్ట
  14. చూస్కో నా తడాఖా
  15. జ్ఞానోదయం
  16. తపస్సు
  17. తీరిన కోరిక
  18. పండగ
  19. పాపం పందికూన
  20. పారిపోలేని చిలక
  21. పీడకల
  22. పొరపాటు
  23. బూర్జువా
  24. మనిషి-జంతువు
  25. మనుష్యులకోసం
  26. మల్లెతోట...
  27. మోడరన్ ఆర్ట్
  28. రాతిముక్క[5]
  29. విశ్వాసం
  30. సచ్చినోడి కథ
  31. సమ్మె
  32. సాక్షాత్కారం[6]
  33. సామాన్యుడి స్వగతం

అవార్డులు[మార్చు]

మరణం[మార్చు]

కృష్ణమూర్తి 2022 సెప్టెంబరు 7న కామారెడ్డిలో రోడ్డు దాటుతూ జరిగిన తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2022, సెప్టెంబరు 9న మరణించాడు.[9]

మూలాలు[మార్చు]

  1. మహాసంకల్పం గ్రంథంలో కందాళై రాఘవాచార్య పరిచయం నుండి[permanent dead link]
  2. కథానిలయం వెబ్‌సైట్‌లో గన్ను కృష్ణమూర్తి వివరాలు[permanent dead link]
  3. కొత్త కోణాన్ని ఆవిష్కరించా - గన్ను కృష్ణమూర్తి, నవతెలంగాణ
  4. అంతర్జాలంలో మహాసంకల్పం[permanent dead link]
  5. "రాతిముక్క కథ" (PDF). Archived from the original (PDF) on 2013-05-11. Retrieved 2018-02-04.
  6. సాక్షాత్కారం[permanent dead link]
  7. "44 మందికి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాలు". EENADU. 2022-09-03. Archived from the original on 2022-09-03. Retrieved 2022-09-07.
  8. "Telugu University: 44 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". Sakshi Education. 2022-09-03. Archived from the original on 2022-09-07. Retrieved 2022-09-07.
  9. "కవి గన్ను కృష్ణమూర్తి కన్నుమూత". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-09-10. Archived from the original on 2022-09-10. Retrieved 2022-09-10.