Jump to content

గారడి

వికీపీడియా నుండి
పాముతో గారడి చేస్తున్న గారడి వారు

గారడి అంటే అసాధ్యమైన పనిని సుసాధ్యము చేస్తూ ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లూ చూపే వినోదాన్ని కలిగించే విద్యాప్రదర్శన. గారడి వారు రద్దీగా ఉండే కూడలి ప్రదేశాలలో ఒక ప్రక్కగా ఉచితంగా ప్రదర్శన జరిపి ఆ ప్రదర్శన చూసిన వారి నుండి కొంత ప్రతిఫలం పొందుతారు. గారడి వారు చేసే ప్రధాన వినోదాలలో నాదస్వరంతో పామును ఆడించుట ఒకటి.

ఇంద్రజాలం, గారడి రెండు ఒకే అర్ధాన్ని కలిగి ఉన్నప్పటికి వీటి రెండింటికి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి.
1. బజారులలో నేలపైన చేసేది గారడి. వేదిక పైన చేసేది ఇంద్రజాలం
2. మోసం చేసేది గారడి. మోసపోవద్దు అని తెలిపేది ఇంద్రజాలం
3. ప్రదర్శన తరువాత డబ్బు అడుగుతారు గారడివారు. ప్రదర్శనకు ముందే డబ్బు వసూలు చేస్తారు ఇంద్రజాలికులు.

ఈ ప్రదర్శనలో విషానికి విరుగుడుగా పనిచేసే ఈశ్వరి వేరులను ఉచితం ఇవ్వడం లేదా అమ్మడం చేస్తారు. (తెల్ల ఈశ్వరి వేర్లను ఉచితంగా ఇచ్చినట్లు ఇచ్చి వాటికి పూజ జరపాలని కొంత పైకాన్ని వసూలు చేస్తారు.)

ఇవి కూడా చూడండి

[మార్చు]

ఇంద్రజాలం

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=గారడి&oldid=847050" నుండి వెలికితీశారు