గిద్దలూరు
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| ?గిద్దలూరు మండలం ప్రకాశం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | గిద్దలూరు |
| జిల్లా(లు) | ప్రకాశం |
| గ్రామాలు | 18 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
78,462 (2001) • 40093 • 38369 • 64.09 • 79.59 • 47.98 |
గిద్దలూరు ప్రకాశం జిల్లాలోని ఒక ముఖ్య పట్టణము మరియు అదే పేరుగల మండలము. సగిలేరు నది (స్వర్ణబాహు నది) గిద్దలూరికి దక్షిణాన ప్రవహిస్తున్నది. గిద్దలూరు గుంటూరు - ద్రోణాచలము రైల్వే లైనుపై ఒక ప్రముఖ రైల్వేస్టేషను. ఇక్కడ పురాతన పాతాలనాగేశ్వరస్వామి ఆలయం ఉన్నది
విషయ సూచిక |
పురాచరిత్ర [మార్చు]
1930వ దశకములో కామ్మియెడ్, బర్కెట్ట్ అను ఇద్దరు పురావస్తు శాస్త్రజ్ఞులు గిద్దలూరు పరిసరాల్లో పాత రాతియుగము (అప్పర్ పేలియోలిథిక్) నాటి మానవుడు నివసించిన ఆధారాలు కనుగొన్నారు.[1] ఇక్కడ మధ్య రాతియుగము నాటి చిన్న రాతి పనిముట్ల పరిశ్రమలు బయల్పడ్డాయి.[2] ఈ చిన్న పనుముట్లు క్వార్ట్‌జ్ చేయబడినవి.[3]
పేరువెనుక చరిత్ర [మార్చు]
బ్రిటీష్ వాళ్ళు మనదేశంలో అధికారం చెలాయిస్తున్న రోజులవి! ఒక్కొక్క ప్రాంతాన్ని తమ కంపెనీ పరిపాలనకిందకి తెచ్చుకుంటున్న తెల్లవాళ్ళు... ఆయా ప్రాంతాలను తమకు అనుకూలమైన పేర్లతో పిలిచేవారు. ఒకప్పుడు కరువు కాటకాలతో ఆకలి చావులకు ఆలవాలంగా మారిన ఈ ప్రాంతంలో గెద్దలు ఎక్కువగా తిరిగేవట! దాంతో ఈ ప్రాంతాన్ని ‘గెద్దలూరు’గా బ్రిటీష్‌వారు వ్యవహరించేవారు. బ్రిటీష్ వారికాలంలోనే కొలతల విధానం అమలులోకి వచ్చింది. ఈ ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా ‘గిద్ద’తో కొలవడం ప్రారంభమయ్యిందట! దాంతో ‘గెద్దలూరు’ కాస్తా ‘గిద్దలూరు’గా మారిపోయింది.
చరిత్ర [మార్చు]
గిద్దలూరు యొక్క పూర్వ నామము సిద్ధలూరు. సిద్ధలూరు సమీపములోని నాగేశ్వరాలయము దగ్గర ఒక స్థలమును నందన చక్రవర్తి శ్రీవత్స గోత్రజుడు, నందనవారిక వంశానికి చెందిన కుంచాల శివప్పకు అగ్రహారముగా ఇచ్చాడు. కానీ తరువాత ఈ గ్రామము పాడుబడటము వలన, శివప్ప వంశీయుడైన రామచంద్ర నందవరము నకు తరలివెళ్లి, అక్కడి నుండే సిద్ధలూరి యొక్క వ్రిత్తిని అనుభవించాడు.
శక యుగములో తొండమారయగుళ్ల స్థాపన జరిగిన తరువాత, కుంచెల రామచంద్ర తొండమారయగుళ్ల నాయకుని నుండి కొత్తగా స్థాపించిన సిద్ధలూరిని అగ్రహారముగా పొంది నందవరము నుండి ఇరవై - ముప్పై బ్రాహ్మణ కుటుంబములు మరియు బారబలావతుల తో (12 మంది గ్రామ సేవకులు) సహా సిద్ధలూరికి తిరిగి వచ్చాడు. అయితే, తొండమారయగుళ్ల నాయకుని మరణానంతరము ఆ ప్రదేశము నిర్జనమైంది. ఆ కాలములో సిద్ధలూరి ప్రాభవము పెరిగి గ్రిద్ధలూరని కొత్త పేరు సంతరించుకొన్నది. కొంత కాలము తర్వాత గ్రిద్దలూరు అగ్రహారీకుడూ, కుంచాల రామచంద్రుని వంశజుడూ అయిన కుంచెల వెంకటాద్రయ్య గ్రామము చుట్టూ అనేక కుగ్రామములు స్థాపన చేయించి గిద్దలూరిని మెరుగు పరచెను. అనతి కాలములోనే ఆ కుగ్రామములు కంచిపల్లె, చట్టిరెడ్డిపల్లె మరియు అక్కలరెడ్డిపల్లె మౌజే లుగా (స్వంతంత్ర గ్రామములు లేదా ఒక మాదిరి పట్టణములు) ఎదిగినవి. దీనితో గిద్దలూరు కస్బా (ప్రధాన కేంద్రము) అయినది.
హరిహర దేవరాయల కాలములో రామచంద్రరాజు ఈ ప్రాంతములను జాగీర్దారుగా పరిపాలించుటకు వచ్చి ఈ గ్రామములను వెంకటాద్రి నుండి వశము చేసుకొన్నాడు. కానీ ఆ తర్వాత కాలములో వెంకటాద్రి నుండి ఆ వంశములో మూడవ తరానికి చెందిన రామచంద్ర, హరిహర రాయలచే పునస్థాపించబడి తన గ్రామాలను తిరిగి పొందెను. ఆయన కరణముగా కూడా నియమించబడెను. ఈ విధముగా ముస్లింలు రాక వరకు రామచంద్రరాజు వంశజులు గిద్దలూరు కస్బాను మరియు దాని గ్రామాలను పరిపాలించారు. రాయల పాలన ముగింపుతో గిద్దలూరు ముస్లింల ఆక్రమణకు గురై, ఆ తరువాత కాలములో దత్తమండలాలను నిజాము బ్రిటీషువారికి దత్తము చేసినప్పుడు కడప జిల్లాలో భాగముగా ఉన్న గిద్దలూరు బ్రిటిషు పాలనలోకి వచ్చింది. కర్నూలు జిల్లా యేర్పడిన తర్వాత కర్నూలు జిల్లాలోను భాగమై, 1971లో ఒంగోలు జిల్లా ఏర్పాటు చేసినప్పుడు కొత్తగా ఏర్పడిన జిల్లాలో కలపబడినది.
పేరు వెనుక చరిత్ర [మార్చు]
బ్రిటీష్ వాళ్ళు మనదేశంలో అధికారం చెలాయిస్తున్న రోజులవి! ఒక్కొక్క ప్రాంతాన్ని తమ కంపెనీ పరిపాలనకిందకి తెచ్చుకుంటున్న తెల్లవాళ్ళు... ఆయా ప్రాంతాలను తమకు అనుకూలమైన పేర్లతో పిలిచేవారు. ఒకప్పుడు కరువు కాటకాలతో ఆకలి చావులకు ఆలవాలంగా మారిన ఈ ప్రాంతంలో గెద్దలు ఎక్కువగా తిరిగేవట! దాంతో ఈ ప్రాంతాన్ని ‘గెద్దలూరు’గా బ్రిటీష్‌వారు వ్యవహరించేవారు. బ్రిటీష్ వారికాలంలోనే కొలతల విధానం అమలులోకి వచ్చింది. ఈ ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా ‘గిద్ద’తో కొలవడం ప్రారంభమయ్యిందట! దాంతో ‘గెద్దలూరు’ కాస్తా ‘గిద్దలూరు’గా మారిపోయింది.
గణాంకాలు [మార్చు]
- 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
- జనసంఖ్య 26977
- పురుషులు 13662
- స్త్రీలు 13315
- నివాసగ్రుహాలు 5979
- వైసాల్యం 2094 హెక్టారులు
సమీప గ్రామాలు [మార్చు]
- నరవ 1.9 కి.మీ
- కొంగలవీడు 2.2 కి.మీ
- తిమ్మాపురం 5.6 కి.మీ
- అంబవరం 5.7 కి.మీ
- ముండ్లపాడు 6.1 కి.మీ
సమీప పట్టణాలు [మార్చు]
- గిద్దలూరు 2.8 కి.మీ
- రాచెర్ల 11.7 కి.మీ
- కొమరోలు 13.2 కి.మీ
- బెస్తవారిపేట 28.2 కి.మీ
గ్రామాలు [మార్చు]
- ఉప్పలపాడు క్రిష్టంశెట్టిపల్లి పంచాయతి లొని గ్రామం
- ఎల్లుపల్లె
- వెంగళరెడ్డీపల్లె
- జయరాంపురం
- జయరాంపురం తాండ
- దిగువమెట్ట
- వెంకటాపురం
- దూరీచింతల్ తాండ(వెంకటాపురం తాండ)
- బురుజుపల్లె
- బురుజుపల్లె తాండ
- పరమెశ్వరీనగరీ తాండా
- నరవ బెనపలె
- జమ్ములపల్లె
- అంకాలమ్మపల్లె
- సింగంపల్లె
- లింగాపురం
- దంతెలపల్లె
- సూరెపల్లె
ఇవి కూడా చూడండి [మార్చు]
గిద్దలూరు చిత్రమాలిక [మార్చు]
వెలుపలి లింకులు [మార్చు]
మూలాలు [మార్చు]
- A Manual of Kurnool District in the Presidency of Madras - Narahari Gopalakristnamah Chetty Pub. Government press, Madras. 1886.
|
|||||||
|
|
|
|---|---|
| అంబవరము · ఆదిమూర్తిపల్లె · బొగద (నిర్జన గ్రామము) · చట్టిరెడ్డిపల్లి · గడికోట · కొత్తపల్లి · గిద్దలూరు · ఇసుకగుండం గూడెం · కంచిపల్లి · కొమ్మునూరు · కొంగలవీడు · కొత్తకోట · క్రిష్టంశెట్టిపల్లి · మాలకొండపెంట గూడెం (నిర్జన గ్రామము) · మోడంపల్లి · ముండ్లపాడు · తాళ్లపల్లె · నరసింహునిపల్లి · నరవ · పొదలకొండపల్లి · దొడ్డంపల్లె · ఓబులాపురం సంజీవరావుపేట · దేవనగరం · తంబళ్లపల్లి · తిమ్మాపురం · త్రిపురాపురం · ఉయ్యాలవాడ · ఎల్లుపల్లె · వెంగళరెడ్డీపల్లె · జయరాంపురం · జయరాంపురం తాండ · దిగువమెట్ట · వెంకటాపురం · దూరీచింతల్ తాండ(వెంకటాపురం తాండ) · బురుజుపల్లె · బురుజుపల్లె తాండ · పరమెశ్వరీనగరీ తాండా · నరవ బెనపలె · జమ్ములపల్లె · అంకాలమ్మపల్లె · సింగంపల్లె · లింగాపురం · దంతెలపల్లె · సూరెపల్లె |