గుత్తా జ్వాల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
గుత్తా జ్వాల
జ్వాలా గుత్తా
Gjwala.JPG
వ్యక్తిగత సమాచారం
జననం (1983-09-07) 7 సెప్టెంబరు 1983 (age 30)
వార్ధా, మహారాష్ట్ర, భారతదేశం
ఎత్తు 1.88 m (6 ft 2 in)[1]
దేశం  భారతదేశం
వాటం ఎడమ చేయి
మిక్స్‌డ్ డబుల్స్ / మహిళల డబుల్స్
అత్యున్నత స్థానం 6
ప్రస్తుత స్థానం 21 (23 జూన్ 2011)
Olympic medal record
Competitor for  భారతదేశం
మహిళల బ్యాడ్మింటన్
ప్రపంచ ఛాంపియంషిప్స్

3Bronze medal icon.svg కాంస్యపతకం

కామన్వెల్త్ క్రీడలు

2Silver medal icon.svg రజతపతకం 1Gold medal icon.svg స్వర్ణపతకం

గుత్తా జ్వాల ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి. 2010 వరకు పదమూడు సార్లు జాతీయ బాడ్మింటన్ విజేత . కేంద్ర ప్రభుత్వము ఆగస్ట్ 18, 2011 న జ్వాలకు అర్జున అవార్డు ప్రకటించింది.

పరివారము[మార్చు]

జ్వాల సెప్టెంబర్ 7, 1983న మహారాష్ట్ర లోని వార్ధాలో తెలుగు తండ్రి గుత్తా క్రాంతి, చైనా తల్లి ఎలెన్‌ కి జన్మించింది. తాత చెంగ్ వార్ధాలోని సేవాగ్రాం ఆశ్రమములో మహాత్మా గాంధీ శిష్యుడు. గాంధీ ఆత్మకథ, రచనలను ఛైనా భాషలోనికి అనువదించాడు. భట్టిప్రోలు మండలం గుత్తావారిపాలెం జ్వాల పెద్దల స్వస్థలం. జ్వాల తాతయ్య గుత్తా సుబ్రహ్మణ్యం అభ్యుదయవాది, స్వాతంత్య్రయోధుడు. ఏడుగురు అన్నదమ్ముల్లో పెద్దవాడు సుబ్రహ్మణ్యం. చిన్నతనంలోనే సోదరులతో కలిసి వందేమాతరం నినాదాన్ని అందుకున్నారు. ఆగ్రహించిన నాటి బ్రిటిష్ పాలకులు ఈ కుటుంబాన్నీ, వీరి బంధుగణాన్నీ అరెస్టుచేసి జైలుకు పంపారు. ఉద్యమబాటలో వీరి ఆస్తులు కరిగిపోయాయి. సుబ్రహ్మణ్యం పెదనాన్న, పెద్దమ్మ జైల్లోనే ప్రాణాలు విడిచారు. బయటపడ్డాక అప్పులతో కాలం గడుపుతుండగానే వారు కోరుకున్న స్వేచ్ఛాభారతం సిద్ధించింది. మిగిలిన కొద్దిపాటి ఆస్తులు అమ్ముకుని ఏడుగురు అన్నదమ్ముల కుటుంబాలు వలసబాట పట్టాయి. తమిళనాడుకు వెళ్లి పుష్పగిరి గ్రామంలో వ్యవసాయం ఆరంభించి పూలతోటలు సాగుచేశారు. సుబ్రహ్మణ్యం దంపతులకు అరుగురు సంతానం. అందులో క్రాంతి ఒకరు. ఈ కుటుంబానికి మహారాష్ట్రలోని సేవాగ్రామ్‌తో అనుబంధం ఏర్పడింది. మకాం అటు మార్చారు. గాంధీజీ బేసిక్ స్కూలును ఆరంభించారు. తర్వాత నెల్లూరు జిల్లా వాకాడు చేరారు. ఆ క్రమంలో వాకాడు, హైదరాబాద్‌లో ప్రాథమిక విద్య, ఇంటర్మీడియెట్ చదివిన క్రాంతి మహారాష్ట్ర వెళ్లి డిగ్రీ, రసాయనశాస్త్రంలో పీజీ చేశారు. అప్పుడే సేవాగ్రామ్ వచ్చిన చైనా యువతి ఎలెన్‌తో పరిచయం ప్రేమగా మారింది. వివాహబంధం ముడిపడ్డాక ఆమెకు భారత పౌరసత్వం వచ్చింది. ఆర్‌బీఐ ఉద్యోగిగా మహారాష్ట్రలో అయిదేళ్లు పనిచేసిన క్రాంతి, 1988లో బదిలీపై హైదరాబాద్ చేరుకున్నారు.

బాల్యము[మార్చు]

క్రాంతి, ఎలెన్ దంపతుల పెద్ద కుమార్తె జ్వాల. హైదరాబాద్ వచ్చే నాటికి ఆమెకు అయిదేళ్లు. బ్యాట్ చేతబట్టిందీ అప్పటినుంచే.

ఆటలు[మార్చు]

చదువు, బ్యాడ్మింటన్ సాధనతో పెరిగిన జ్వాల క్రమంగా జాతీయస్థాయికి ఎదిగింది. సింగిల్స్‌తోపాటు డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ ఆడడం జ్వాల ప్రత్యేకత!. ప్రపంచ పోటీల డబుల్స్‌లో కాంస్యం గెలుచుకున్న జ్వాల, కామన్వెల్త్ పోటీల్లో అదే విభాగంలో విజేతగా నిలిచింది.

సినీ రంగ ప్రవేశం[మార్చు]

ఈమె నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంలో ప్రత్యేక గీతంలో నృత్యం చేసింది.[2][3]

వార్తలలో జ్వాల[మార్చు]

2013: ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్[మార్చు]

బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో 2013 ఆగస్టు 25, ఆదివారం బంగా బీట్స్‌తో జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్ సందర్భంగా అక్కడి అభిమానులు జ్వాలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ హైదరాబాదీ క్రీడాకారిణి తీవ్ర మనస్తాపం చెందింది. మ్యాచ్ ముగిశాక ఆమె అధికారులతో వాగ్వాదానికి దిగడం కనిపించింది. అయితే ఈ విషయాన్ని ఐబీఎల్ నిర్వాహకులకు ఫిర్యాదు చేయదలుచుకోలేదని స్పష్టం చేసింది. ఎవరికి వారు సభ్యత నేర్చుకోవాలని సూచించింది. ఈ వ్యవస్థలో మహిళల పట్ల గౌరవం పెరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది. ‘ప్రేక్షకులు నన్ను వ్యక్తిగతంగా దూషించారు. మేమంతా క్రీడాకారులం. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను గౌరవించడం నేర్చుకోవాలి.

ఇలాంటి పరిస్థితి క్రికెటర్లకు వస్తే మైదానంలో వారు ఎలా ప్రవర్తిస్తారో మనం చూశాం. కానీ నేను కోర్టులో ఎలాంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేదు. మ్యాచ్ తర్వాతే నా ఆవేదన తెలిపాను. ఈరోజుల్లో ఎవరికి వారు చాలా బిజీగా మారిపోతున్నాం. అందుకే మనం పిల్లలకు కనీస విలువలు, మానవత్వం గురించి చెప్పడం మర్చిపోతున్నాం. మహిళల పట్ల భారత సమాజం ఎంత సున్నితంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రపంచంలో భారత్ ఎలా దూసుకెళుతుందో మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఇలాంటి పనులు మీలో సంకుచిత మనస్తత్వాన్ని తెలుపుతాయి. డాక్టర్‌గానో ఇంజినీర్ గానో కావడం ముఖ్యం కాదు. ఎవరి పిల్లలకు వారు మంచి సంస్కృతిని నేర్పితే చాలు’ అని జ్వాల పేర్కొంది[4][5][6].

2013 : బాయ్ వివాదము[మార్చు]

వివాదాస్పద బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాలపై భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) జీవిత కాల నిషేధం విధించే ఆలోచనలో ఉంది. 2013 ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో తమ ఫ్రాంచైజీ క్రిష్ ఢిల్లీ స్మాషర్స్ ఆటగాళ్లను బంగా బీట్స్‌తో మ్యాచ్ ఆడనీయకుండా అడ్డుకుందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాయ్ ఈ ఘటనపై క్రమశిక్షణ కమిటీని నియమించింది. ఈనేపథ్యంలో జ్వాలపై జీవిత కాల నిషేధం లేక ఆరేళ్ల పాటు సస్పెన్షన్ విధించాలని కమిటీ సూచించినట్టు బాయ్ సీనియర్ అధికారి చెప్పారు. అసోసియేషన్ సభ్యులందరికీ ఇప్పటికే ఈ సూచనలను పంపించారు. అయితే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు[7]. అదేగాక నిషేధంపై తుది నిర్ణయం తీసుకునేంతవరకూ అంతర్జాతీయ టోర్నీలకు జ్వాలను ఎంపిక చేయకూడదని నిర్ణయించింది. దీనిపై జ్వాల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, తుది నిర్ణయం తీసుకునేంతవరకు జ్వాలను అన్ని టోర్నీల్లో ఆడించాలని బాయ్‌కు కోర్టు సూచించింది

ఈ ఉదంతం పై అక్టోబరు 11, 2013, శుక్రవారం హైదరాబాద్ లో మీడియా సమావేశంలో పాల్గొన్న జ్వాల.. 'నేను ఫిక్సింగ్ చేయలేదు. డోపింగ్‌కూ పాల్పడలేదు. ఎవర్నీ హత్యా చేయలేదు. మరి నాపై జీవిత కాల నిషేధం వి ధించానుకోవడమేంటి' అని పేర్కొంది.

మూలాలు[మార్చు]

  1. "BWF content". Bwfcontent.tournamentsoftware.com. Retrieved 2012-04-19. 
  2. http://www.123telugu.com/mnews/jwala-guttas-special-song-for-nithin.html
  3. http://timesofap.com/cinema/jwala-gutta-hot-item-song-in-telugu-movie_52309.html
  4. http://timesofindia.indiatimes.com/sports/tournaments/indian-badminton-league/top-stories/Jwala-Gutta-upset-with-lewd-comments-from-fans/articleshow/22063595.cms
  5. http://ibnlive.in.com/news/jwala-gutta-upset-with-lewd-comments-from-fans/417275-5-135.html
  6. http://www.mid-day.com/sports/2013/aug/260813-ibl-jwala-upset-with-lewd-comments-from-fans.htm
  7. http://www.dnaindia.com/sport/1899147/report-ibl-row-badminton-body-recommends-life-ban-on-jwala-gutta