గుప్త లిపి
వికీపీడియా నుండి
ఇది భారతదేశ చరిత్రలో స్వర్ణయుగంగా పేరొందిన గుప్తుల కాలంనాటి లిపి. దీన్ని గుప్తబ్రాహ్మీ లిపిగా, అనంతర బ్రాహ్మీ లిపిగా కూడా పిలుస్తారు. గుప్తులకాలంనాటి ఉత్కృష్టమైన అధ్యాత్మిక, శాస్త్రీయ విజయాలు ఈ లిపిలోనే వ్రాయబడ్డాయి. ఈ లిపి నుండి దేవనాగరి లిపి, శారదా లిపి, సిద్ధం లిపి ఉద్భవించాయి. ఈ లిపి అశోకుని కాలంనాటి బ్రాహ్మీ లిపి నుండి ఉద్భవించింది.