గులాబ్‌రాయ్ రాంచంద్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

1927, జూలై 26న కరాచిలో జన్మించిన గులాబ్‌రాయ్ రాంచంద్ (Gulabrai Ramchand) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. భారత జట్టు తరఫున 33 టెస్ట్ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు. ఆస్ట్రేలియా పై ఆడిన భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి ఆ సీరీస్‌ను గెలిపించాడు. అదే కెప్టెన్‌గా అతని ఏకైక సీరీస్ కావడం గమనార్హం.

టెస్ట్ క్రికెట్ గణాంకాలు[మార్చు]

33 టెస్టులు ఆడిన రాంచంద్ 24.58 సగటుతో 1180 పరుగులు సాధించాడు. అందులో 2 సెంచరీలు మరియు 5 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 109 పరుగులు. టెస్టులలో 41 వికెట్లు కూడా సాధించాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 49 పరుగులకు 6 వికెట్లు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్ గణాంకాలు[మార్చు]

గులాబ్‌రాయ్ 145 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 36.30 సగటుతో 6026 పరుగులు సాధించాడు. అందులో 16 సెంచరీలు మరియు 28 అర్థసెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 230 (నాటౌట్). బౌలింగ్‌లో 255 వికెట్లు సాధించాడు.

2003, సెప్టెంబర్ 9న ముంబాయిలో రాంచంద్ మరణించాడు.