గై డి మొపాసా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Guy de Maupassant
Guy de Maupassant fotograferad av Félix Nadar 1888.jpg
జననం Henri René Albert Guy de Maupassant
(1850-08-05)5 ఆగష్టు 1850
Tourville-sur-Arques
మరణం జూలై 6, 1893(1893-07-06) (వయసు 42)
Passy, Paris
సమాధి స్థలము Montparnasse Cemetery
కలం పేరు Guy de Valmont, Joseph Prunier
వృత్తి Novelist, short story writer, poet
జాతీయత French
రచనా శైలి Naturalism, Realismసంతకము

గై డి మొపాసా (5 ఆగస్టు 1850 – 6 జూలై 1893) ప్రసిధ్ధ ఫ్రెంచి రచయిత మరియు ఆధునిక చిన్న కథల సాహిత్యానికి ఆద్యుడు. ప్రపంచ సాహిత్యం లో కథా రచన అనగానే ముందుగా గుర్తొచ్చే పేర్లలో మొపాసా ఒకటి. వస్తువు, శిల్పము, విషయంలో సోమర్ సెట్ మాం కీ, ఓ హెన్రీకి కూడ మార్గదర్శకుడిగా కీర్తి సంపాదించేడు. అసామాన్యమైన సునిశితదృష్టి కనబరుస్తూ, మానవనైజం లోని అన్ని పార్స్వాలూ స్పృశిస్తూ అద్భుతమైన సాహిత్య సృష్టి చేశాడు. అందులో Naturalism and Fantastic రెండూ ఉన్నాయి. అతని కథలని చిన్నచిన్నమార్పులతో చాలామంది అనుకరించేరుకూడా. మనోవిశ్లేషణాత్మక రచన అతని ముద్ర. లియో టాల్ స్టాయ్ అంతటివాడు కళా గురించి వ్రాసిన వ్యాసాలలో మొపాసా సాహిత్యం లోని కళాత్మకత ఆవిష్కరించేడు. అతని వచన రచన కొన్ని సందర్భాలలో పద్యరచనని మించిన కల్పనాశక్తితో, సందర్భానికి తగ్గట్టుగా ఉంటూ, దానికి విలువని జోడిస్తుంది. అతను Joseph Prunier, Guy de Valmont, and Maufrigneuse అన్న మారు పేర్లతో రచనలు చేశాడు. ఏకాంతాన్ని ఎక్కువగా ఇష్టపడేవాడు. I have coveted everything and taken pleasure in nothing (నేను అన్నిటినీ ఆకాంక్షించేను; దేనిలోనూ ఆనందం పొందలేకపోయాను) అని తన స్మృత్యుల్లేఖనాన్ని (epitaph) అతనే రాసుకున్నాడు.

బాల్యం[మార్చు]

మొపాసా, లారే లి పొఇట్టెవిన్ మరియు గుస్తావ్ డి మొపాసా ల మొదటి సంతానం గా ఆగస్టు 5, 1850 లో ఫ్రాన్స్ లో జన్మించాడు. మొపాసాకి పదకొండేళ్ళు, అతని తమ్ముడికి అయిదేళ్ళ వయసు ఉన్నప్పుడు స్వతంత్ర భావాలు గల అతని తల్లి భర్త నుండి విడి పోయింది. బాల్యం లో మొపాస పై తల్లి ప్రభావం ఎక్కువగా ఉండేది. ఆమె సాహిత్యాన్ని , ముఖ్యంగా షేక్స్పియర్ సాహిత్యాన్ని బాగా ఇష్టపడేది.

చదువు[మార్చు]

రచనలు[మార్చు]

15 కథా సంకలనాలు, 3 ట్రావెలోగ్ లూ, 6 నవలలు,1 కవితా సంకలనం అతని సాహిత్య సృష్టి.

వ్యక్తిగత జీవితం[మార్చు]

మరణం[మార్చు]

జూలై 6, 1893 లో పారిస్ లో మరణించిన మొపాసా అంతకు ముందు 1892, జనవరి 2 ఆత్మహత్య చేసుకోవటానికి విఫల ప్రయత్నం చేశాడు.

మూలాలు[మార్చు]

  1. Menikoff, Barry. The Complete Stories of Robert Louis Stevenson; Introduction. Modern Library, 2002, p. xx

ఇతర లింకులు[మార్చు]

తెలుగు అనువాద కధ అదంతా కలేనా?