గ్రామీణ సంచార పశువైద్యశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామీణ సంచార పశువైద్యశాల
ప్రాంతంతెలంగాణ, భారతదేశం
దేశంభారతదేశం
ప్రధాన వ్యక్తులుతెలంగాణ ప్రజలు
స్థాపన2017 సెప్టెంబరు 15
నిర్వాహకులుతెలంగాణ ప్రభుత్వం

గ్రామీణ సంచార పశువైద్యశాల అనేది తెలంగాణ రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన పశువులకు వైద్యసేవల్ని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంచార పశువైద్యశాల. దేశంలోనే సంచార పశువైద్యసేవల వాహనాలను ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.[1] పశువులకు అత్యవసర వైద్యసేవలు అవసరమైనప్పుడు పశువులు, గొర్రెలు, మేకలు జబ్బులకు గురైనప్పుడు అడవి జంతువు బారినపడినప్పుడు ఈ గ్రామీణ సంచార పశు వైద్యశాల ద్వారా వాటికి తగిన చికిత్స అందించడుతుంది.

ప్రారంభం[మార్చు]

2017 సెప్టెంబరు 15న హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతులమీదుగా గ్రామీణ సంచార పశు వైద్యశాలకు చెందిన 100 సంచార పశువైద్య వాహనాలు 100 గ్రామీణ శాసనసభ నియోజకవర్గాలలో ఒకేసారి ప్రారంభించబడ్డాయి.[2]

వివరాలు[మార్చు]

సంచార పశువైద్యశాల కోసం టోల్‌ఫ్రీ నెంబర్‌ 1962ను ఏర్పాటుచేశారు. ఈ నెంబర్‌కు ఫోన్‌ చేసిన అరగంటలో రైతు ఇంటి వద్దకు సంచార పశువైద్యశాల చేరేలా ఏర్పాట్లుచేశారు. ఈ సంచార పశువైద్యశాలలో వైద్యుడు, కంపోండర్‌, అటెండర్‌ వైద్యసేవలు అందించి అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తారు. ఈ సంచార పశువైద్యశాల వాహనంలో మందులు, టీకాలు, ఆపరేషన్లకు అవసరమైన పరికరాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుతారు. కృత్రిమ గర్భోత్పత్తి సేవలు, పెంపుడు జంతువులకు కూడా ఉచితసేవలు అందిస్తారు. సీజన్‌ల వారీగా పశువులు వ్యాధికి గురికాకుండా ఉండేందుకు టీకాలు కూడా ఇస్తారు.[3]

మూలాలు[మార్చు]

  1. telugu, NT News (2022-10-11). "సమర్థపాలన... సంక్షేమ పథకాలు". Namasthe Telangana. Archived from the original on 2022-10-11. Retrieved 2022-10-14.
  2. "రేపు సంచార పశువైద్యశాలలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌". www.suryaa.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-10-14. Retrieved 2022-10-14.
  3. telugu, NT News (2021-11-14). "రైతుల వద్దకే పశు వైద్య సేవలు". Namasthe Telangana. Archived from the original on 2022-10-14. Retrieved 2022-10-14.