చర్చ:విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


వేదిక వాడుక[మార్చు]

అయ్యా భారతీయ రైల్వేలలో ప్లాట్ ఫారములను వేదికలు అని అంటారా? స్టేషనులలో ప్రకటించునపుడు(అనౌంస్) అలా ప్రకటించగా ఎప్పుడును వినలేదు. దయచేసి తెలుపగలరు. రైలు పై దండు అని వ్రాసియున్నాకూడా ఆ పదమును మీరు నిషేధించిరే. ఇచ్చట మాత్రము అట్టి సొంత పద ప్రయోగములు ఎందులకు!!--Hydkarthik

Hydkarthik గారూ, ప్లాట్‌ఫారం అనే పదానికి తెలుగు నిఘంటువులో వేదిక అనీ, వేరొక నిఘంటువులో తిన్నె,దిబ్బ,మిట్ట అనే అర్థాలున్నాయి. ఈ తెలుగు పదాలను ఈ వ్యాసంలో వినియోగిస్తే చదువరులకు అర్థం కాదనే ఉద్దేశ్యంతో రచయిత వేదిక (ప్లాట్‌ఫారము) అనే పద ప్రయోగాన్ని చేసారు. ఈ పదాన్ని ఐదుసార్లు వాడబడినా అదే విధంగా పద ప్రయోగం చేసారు. మీరన్నట్లు "దండు" అనే పదం "కంటోన్మెంటు" అనే అర్థం యిచ్చునట్లు నిఘంటు ఆధారాలు చూపించగలరా? ఇచ్చట స్వంత ప్రయోగాలు చేయలేదు. నిఘంటు ఆధారంగా "వేదిక" అని వాడినప్పటికీ అందరికీ అర్థం వచ్చునట్లు వేదిక (ప్లాట్‌ఫారము) అని వాడారు. గమనించగలరు.-- కె.వెంకటరమణ 16:41, 28 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సమస్య పరిష్కారం[మార్చు]

YesY సహాయం అందించబడింది

JVRKPRASAD (చర్చ) 00:53, 29 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD గారికి, ఏమిటా సమస్య?--అర్జున (చర్చ) 11:30, 29 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సమస్య[మార్చు]

అర్జున గారు, వాడుకరి Hydkarthik ధర్మ సందేహం మరియు మనోవేదన అనుకుంటాను.

అయ్యా భారతీయ రైల్వేలలో ప్లాట్ ఫారములను వేదికలు అని అంటారా? స్టేషనులలో ప్రకటించునపుడు(అనౌంస్) అలా ప్రకటించగా ఎప్పుడును వినలేదు. దయచేసి తెలుపగలరు. రైలు పై దండు అని వ్రాసియున్నాకూడా ఆ పదమును మీరు నిషేధించిరే. ఇచ్చట మాత్రము అట్టి సొంత పద ప్రయోగములు ఎందులకు!!--Hydkarthik JVRKPRASAD (చర్చ) 11:59, 29 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  • వికీపీడియాలో శైలి ప్రజలకు అర్థమయ్యే భాషను వినియోగించడం అన్నదే. భాషా విషయాల్లో వికీపీడియా వాడుక భాషను సమర్థించడం సూత్రప్రాయమే. ప్రజలు మాట్లాడే, వారికి అర్థమయ్యే రీతిలో తెలుగును వినియోగించాలన్నది మన ఉద్దేశ్యం అయినా కొన్ని సందర్భాల్లో ఆ నియమాన్ని మనమే ఉల్లంఘించిన దాఖలాలూ ఉన్నాయి. ఉదాహరణకు సాంకేతిక పదం అన్నది బహుశా ప్రవీణ్ ఇళ్ళ వ్రాసిన కంప్యూటర్ నిఘంటువులోనే దొరుకుతుంది కాబోలు. కానీ మనం దాన్ని ప్రజలకు అలవాటవ్వాలన్న ఉద్దేశంతో వాడేస్తున్నాము. ఇలా ఎవరైనా గట్టిగా నిలదీస్తే దాన్ని పాస్‌వర్డ్ అని మార్చి తీరాల్సివుంటుంది. ఎందుకంటే మనం చేసుకున్న కట్టుబాటుకి విరుద్ధం కాబట్టి. అలానే ఇక్కడ కూడా ప్లాట్ ఫాం అన్న ప్రయోగమే సరైనది. ఎందుకంటే మన అంతిమలక్ష్యం ప్రజల కొరకు తెలుగు విజ్ఞానసర్వస్వం తప్ప తెలుగు కొరకు విజ్ఞానసర్వస్వం కాదు. అందుకనుగుణంగా మారిస్తేనే సరి అని నా ఉద్దేశం. ఇక కార్తీక్ గారూ మీరు ఇది వ్యవస్థీకృతమైన స్వచ్ఛంద సేవ అని అర్థం చేసుకోవాలి. వందలు, వేలమంది వ్రాస్తున్న వికీపీడియాలో తప్పులు దొర్లవని, పాలసీకి విరుద్ధమైన పనులు జరగవని ఎవరూ రాసివ్వలేరు. కానీ ఎప్పటికప్పుడు సరిజూసుకుంటూనే ఉంటారు. ఇలా సరిదిద్దుతూనే పోతారు. మీరు దయచేసి కొన్ని వ్యాసాలు నిబంధనలకు అనుమంతించినంత స్వేచ్ఛ తీసుకుని అభివృద్ధి చేయండి. ప్రపంచంలోని పదాలన్నీ తెలుగులోనే రావాలని, తెలుగువారందరూ తెలుగే వాడాలని మీరు భావిస్తున్న ఆలోచనలు మంచివే. కానీ మొదటి మెట్టులో ప్రపంచంలోని విజ్ఞానమంతా తెలుగులోకి తీసుకువచ్చే తెవికీలాంటి సంస్థలో కొన్ని సర్దుబాట్లకు లోబడి కృషిచేయడం ఒకటి కాదంటారా? మిమ్మల్ని, మీ అభిప్రాయాలను గమనిస్తున్న వ్యక్తిగా మీరు ముందు విక్ష్నరీ (నిఘంటువు లెండి)లో కృషిచేయడం వల్ల మరింత ప్రయోజనం కలుగుతుందని నాకు అనిపిస్తోంది. చనువు తీసుకుని మీకిలా సూచనలు చేయడం మిమ్మల్ని ఇబ్బందిపెడితే ఏమీ అనుకోవద్దు. కానీ ఒకటి గుర్తించండి, మిమ్మల్ని బాధించిన నియమ నిబంధనలు ఉన్నా తెవికీ అంతిమంగా తెలుగుకు ఎంతో సాయం చేస్తుంది, దీనిలో కొన్ని నిబంధనలకు లోబడి పనిచేసి మీ ఆశయాలను కొన్నిటినైనా నిజం చేసుకోవచ్చు. అభినందనలతో --పవన్ సంతోష్ (చర్చ) 17:56, 29 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  • Hydkarthik, JVRKPRASAD మరియు సహసభ్యులకు, నేను ఇంతకు ముందు చర్చను పైపైన అర్థం చేసికొని నా అభిప్రాయం తెలియచేస్తున్నాను. బెంగుళూరు దండు ఒక కన్నడ భాష నామవాచకము, ప్లాట్ఫామ్ నామవాచకము కాదు. నామవాచకములకు తెలుగులో అలానే వుంచుతాము. ఇతర పదాలను వ్యవహారిక తెలుగులో అనువదించి చేరుస్తాము. నామవాచకములలో ఆంగ్లం మరియు కన్నడ భాషల పదాలున్నప్పుడు, వ్యాస పేరులకి సంబంధించినదైతే, ఒక దానిని దారిమార్పు గా చేసుకోవడం ద్వారా సమస్యని సులువుగా పరిష్కరించుకోవచ్చు. కన్నడ భాష లిపి తెలుగుకి పోలివుండడం మరియ చాలమంది తెలుగువారు బెంగుళూరు లో వుండడం, కనీస తెలుగుతెలిసినవారు కూడా కన్నడ చదవగలగటం చూస్తే ఇలా చేయడం మంచిదని నాకనిపిస్తుంది. వికీపీడియా శైలి గురించి కొంత ప్రాధమిక మార్గదర్శనాలు ఎర్పడినాయి కాని లోతుగా అధ్యయనం చేసి ఏర్పడినవేమీ లేదు. తొలిలో వ్యాసాలలో వ్యక్తులకు గౌరవసూచకాలు (చేశాడు /చేశారు లాంటివి ) వాడవద్దనే విధానం వున్నా తరువాతి కాలపు సభ్యులు గౌరవసూచకాలు వాడడం, మరల చర్చలు జరిగినా, ఏకాభిప్రాయం సాధించలేకపోవటం గమనించే వుంటారు. సముదాయం పెరిగి, నాణ్యతపై శ్రద్ధ పెరిగినప్పుడు, ఈ సమస్యలకి మెరుగైన పరిష్కారము దొరకవచ్చు. ప్రస్తుతానికి ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో సమస్యలు పరిష్కరించుకోవటం, ప్రాజెక్టుకి మరియు అందరికీ మంచిది. --అర్జున (చర్చ) 04:59, 30 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఆగ్నేయ రైల్వే ప్రధాన కార్యాలయం[మార్చు]

అయ్యా, JVRKPRASAD గారూ ఆగ్నేయ రైల్వే ప్రధాన కార్యాలయం విశాఖపట్నం నుండి భువనేశ్వర్‌కు తరలించబడింది అని వ్రాసిరి. ఇది శుద్ధ తప్పు. దయచేసి మీరు వ్రాయగోరినదేమియో తెలియజేయగలరు. Hydkarthik (చర్చ) 10:02, 20 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఆగ్నేయ రైల్వే ప్రధాన కార్యాలయం గురుంచి ఎక్కడ,ఏసందర్భంలో వ్రాసానో నాకు తెలియదు. ఇప్పుడు నేను వెతకలేను. సరి అయిన వాక్యం మీరే వ్రాయవచ్చును. నేను ప్రస్తుతం ఇక్కడ చురుకుగా పని చేయడం మానివేసి చాలాకాలం అయ్యింది.గమనించ గలరు.JVRKPRASAD (చర్చ) 07:24, 17 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]