చర్చ:సారిక ఆత్మహత్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సంచలనం కోసం కాదు, వాస్తవాల కోసం[మార్చు]

నేను ఈ వ్యాసం సృష్టించినది సంచలనం కోసమో, ఎవరిపైనో బురదజల్లటం కోసమో కాదు. చట్టాలు, న్యాయాలు, సంబంధిత అధికారవర్గాలు, నిజానిజాలు తేల్చకముందే ప్రసార మాధ్యమాలు ప్రచార మాధ్యమాలుగా మారి, వారి వారి రేటింగులను పెంచుకొనేందుకు ఇటువంటి సంఘటనలను హత్యలుగా మలచి పదే పదే ప్రసారం చేయటం వలన ప్రజలలోకి తప్పుడు సందేశం వెళుతోంది. సంఘటన జరిగిన సమయంలో ఈ కేసులో చీమ చిటుక్కుమన్నది కూడా భూతద్దంలోంచి చూచిన ఒక దినపత్రిక, ఫోరెన్సిక్ రిపోర్టు లో "ఇది హత్య కాదు" అని తేలిన విషయాన్ని మాత్రం తెలుగులో ప్రచురించక, కేవలం ఆంగ్ల పత్రికలో ప్రచురించినదంటే, విషయం ఏమిటో అర్థం చేసుకొనవచ్చును.

ఈ వ్యాసం విమర్శల బారిన పడకుండా, తెవికీ నియమాలకు అనుగుణంగా తీర్చిదిద్దటంలో ఇతర వికీపీడియనుల సహాయసహకారాలు కోరడం అయినది. మీరు నేరుగా మార్పులు చేయవచ్చును. లేదంటే నాకు సూచనలివ్వవచ్చును.

ధన్యవాదాలు - శశి (చర్చ) 10:34, 11 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

శశి గారూ, ఇది హత్యో, ఆత్మహత్యో లేదా ప్రమాదమో మూలాల ద్వారా తెలుస్తుంది. ఇందులో చివరిగా మీరు వ్రాసిన వాక్యంలో "సారికది హత్య కాదని, తాము ముందు రోజు రాత్రి భుజించిన ఆహారంలో ఎటువంటి విషపదార్థాలు కలుపబడలేదని, పొరబాటున/ప్రమాదవశాత్తు సిలిండర్ లీకేజీ వలన మంటలు చెలరేగటం వలనే అందరూ మృత్యువాత పడ్డారని ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసినది. ఊపిరితిత్తుల్లో పొగ తాలూకు ఆనవాళ్ళు, మంటలు చెలరేగిన సమయంలో వీరు ఊపిరి అందుకోవటానికి ఉక్కిరిబిక్కిరి అయ్యారని, ఇది హత్య కాదని స్పష్టం చేస్తున్నాయని తెలిపినది" అని వ్రాసారు. దీని ప్రకారం ఇది ప్రమాదమని తెలుస్తుంది. కనుక శీర్షికను మార్చాల్సి ఉంటుంది. ఇది ప్రమాదమని ఫోరెన్సిక్ నివేదిక ఆధారాలతో తెలియజేసారు. కనుక దీని శీర్షికను తగు విధంగా మార్పు చేయ మనవి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 02:14, 12 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారు, మీ సలహాకు ధన్యవాదాలు. మీరు చెప్పినది సరియైనదే. అయితే, వంటగదిలో ఉండవలసిన సిలిండర్ పడకగదిలోకి సారికయే మార్చి, పిల్లలెవరూ తప్పించుకు పోకుండా లోపలి నుండి తాళం వేసి, తానే కావాలని గ్యాస్ లీకు చేసినదని ఒక మూలంలో పేర్కొనబడినది. దీని వలనే నేను ఈ శీర్షికను ఎంచుకొనవలసివచ్చినది. ఈ వ్యాసంపై నా గుత్తాధిపత్యం ఏమీ లేదు. దీనిని ఎవరు కావాలన్నా మార్చవచ్చును. మరి కొంత మంది అభిప్రాయాల కోసం కూడా వేచి చూచి, ఏది సరి అనుకొంటే దానిగానే ఈ పేరును మారుద్దాం.