వాడుకరి:Veera.sj

వికీపీడియా నుండి
నా స్వంత చిత్రపటం.
వికీపీడియా:Babel
te ఈ వాడుకరి మాతృభాష తెలుగు
భాష వారిగా వికీపీడియనులు
Film reel.gif ఈ వాడుకరి తెలుగు సినిమా ప్రాజెక్టులో సభ్యులు.
Telugu template.jpg ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని.
Noia 64 apps karm.png ఈ సభ్యుడు వికీపీడియాలో గత
2 సంవత్సరాల, 10 నెలల మరియు 1 రోజు గా సభ్యులు.



విషయ సూచిక

[మార్చు] పరిచయం

నమస్కారం. నా పేరు వీర శశిధర్ జంగం. (తెలిసిన వారు ప్రేమతో శశి అనీ, కార్యాలయాల్లో వీరా అని పిలుస్తుంటారు.) మాది కర్నూలు జిల్లా. నాన్న ది అవుకు. అమ్మ ది కోవెలకుంట్ల. వృత్తిరిత్యా సాఫ్టువేర్ కన్సల్టెంట్ ని. ఎస్.ఏ.పీ హెచ్.సీ.ఎం పైన పని చేస్తూ ఉంటాను.

[మార్చు] తెవికీ లో నా రచనలు

[మార్చు] భారతదేశం లోని ప్రదేశాలు

[మార్చు] ఇతర దేశాలు, ప్రదేశాలు

[మార్చు] సాఫ్టువేర్

[మార్చు] సంస్థలు

[మార్చు] వంటలు

[మార్చు] పుస్తకాలు

[మార్చు] మానసిక రోగాలు

[మార్చు] చర్మ వ్యాధులు

[మార్చు] ఔషధాలు

[మార్చు] పురాణాలు

  • కన్నగి (తమిళ పురాణాల్లోని పతివృత)

[మార్చు] తెలుగు సినిమాలు

[మార్చు] హిందీ సినిమాలు

[మార్చు] ఇతర సినిమాలు

[మార్చు] కారులు

[మార్చు] భారతదేశపు కారులు

[మార్చు] భారతీయ సంస్థలు

[మార్చు] జీన్స్

[మార్చు] ఫ్యాషన్ మరియు రీటెయిల్

[మార్చు] వేదికలు

[మార్చు] వ్యక్తులు

[మార్చు] పుట్టు పూర్వోత్తరాలు

మా నాన్న ఉద్యోగ రిత్యా అనంతపురం, తిరుపతి లలో ఉన్నారు. తరవాత హైదరాబాదు బదిలీ అయ్యారు. మా అమ్మ నాన్నల పెళ్ళి అప్పుడే అయ్యింది. నేను 11 డిసెంబరు, 1979 న జన్మించాను.

[మార్చు] బాల్యం

నాన్నది తరచూ బదిలీలు అయ్యే ఉద్యోగం కావటం వలన నా బాల్యం హైదరాబాదు, తిరుపతిలలో గడిచింది. హైదరాబాదీల హిందీ మిళిత తెలుగు, తెలంగాణ యాస; తిరుపతి వాసుల తమిళ వాసన గల తెలుగు బాగా వంట బట్టాయి.

[మార్చు] కౌమారము, యవ్వనము

తర్వాత మేము కడప లో ఉన్నాము. కొట్టినట్టు మాటాడే కరకుదనాన్ని అక్కడ చూసాను. నా డిగ్రీ వరకు నాన్నకి ఇష్టమయిన గణితాన్నే ప్రథమ పాఠ్యాంశం గా తీసుకున్నాను. చదువులో పెద్దగా శ్రద్ధ చూపేవాడిని కాను.

[మార్చు] MBA నా జీవితం లో తెచ్చిన మార్పు

MBA సీటు కావలి లో రావటం తో మొట్ట మొదటి సారిగా నేను ఇల్లు వదిలి, బయట చదవవలసి వచ్చింది. అయితే ఆ రెండేళ్ళు నా జీవితం లో నే మరువలేని రోజులు అవుతాయని అప్పట్లో నాకు తెలియదు. కాలేజి హాస్టల్లో చేరాను. రాష్ట్రం లో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు అక్కడ పరిచయం అయ్యారు. ముందు నవ్వుతూ మాట్లాడుతూనే వెనక గోతులు తీసేవారు కూడా ఉంటారని అక్కడే తెలుసుకున్నాను. నల్లనివన్నీ నీళ్ళు కావు, తెల్లనివన్నీ పాలు కావు అన్నట్టు చిన్నగా మాట్లాడే వారందరూ మృదుస్వభావులు కారని, గట్టిగా మాట్లాడే వారందరూ కరకు వారు కారని MBA లోనే తెలుసుకున్నాను. ఆంగ్లం పై నాకున్న మక్కువ తెలుసుకున్న మా ఉపాధ్యాయ బృందం నా తో చాలా చనువు గా మెలిగేవారు. వివిధ కళాశాలల్లో జరిగిన మేనేజ్ మెంట్ మీట్ ల లో నేను తెచ్చిన బహుమానాలతో కళాశాల యాజమాన్యానికి ప్రీతిపాత్రుడనయ్యాను.

ముభావిగా, ఏకాంతాన్ని ఎక్కువగా కోరుకుండే చిన్న నాటి నేను, కలివిడిగా మారిపోయి నవ్వుతూ అందరినీ నవ్విస్తూ మానసిక పరిపక్వతని, వ్యక్తిత్వ వికాసాన్నీ సంపాదించుకొన్నాను. నాలోని ఈ మానసిక, వ్యక్తిత్వ మార్పులకి MBA లో మానసిక శాస్త్ర పాఠ్యాంశాలు, విద్యార్థిగా నా విజయాలు దోహద పడ్డాయనటంలో సందేహం లేదు. ఆసక్తి గల విద్య ఒక మనిషి పైన ఎంత ప్రభావం చూపుతుందో అప్పుడే తెలిసింది.

[మార్చు] వృత్తులు

భాషల పైన, సృజనాత్మకత పైన నాకున్న మక్కువ తో ప్రకటనా రంగం లో కి అడుగు పెట్టాను. జూనియర్ కాపిరైటర్ గా నా ఉద్యోగప్రస్థానం మొదలు పెట్టాను. సంవత్సర కాలం లో మధ్యతరగతి కుటుంబాలకి ఆ రంగం, ఆ ఉద్యోగం నప్పవని తెలుసుకున్నాను. ఐ.టి రంగం లో రాణిస్తున్న నా స్నేహితులను చూసి, ఎస్.ఏ.పీ నేర్చుకున్నాను. చెన్నై, హైదరాబాదు, బెంగుళూరు, నోయిడా, థింపూ (భూటాన్), కొచ్చిన్ లలో సాఫ్ట్ వేర్ కన్సల్టెంట్ గా పని చేసాను. ఇలా ఇంకా ఎన్ని దేశప్రదేశాలని చూడాలో????

[మార్చు] విద్యార్హతలు

  • కావలి నోబుల్ కాలేజీ నుండి MBA
  • కడప వేంకటేశ్వర డిగ్రీ కాలేజీ నుండి BSc

[మార్చు] ప్రవృత్తులు

పుస్తక పఠనం, వికీ పఠనం, వికీ రచనలు, సంగీతం, సినిమాలు, ఇంటర్నెట్. చింత చచ్చినా పులుపు చావదు అన్నట్టు, నా లోని కాపీరైటర్ చురుకుగా ఉంటూ తెవికీలో చాలా రచనలు చేస్తున్నాడు. నా వృత్తి లో ఉండే వత్తిడికి ఆటవిడుపుగా ఈ ప్రవృత్తిని చేపట్టాను. నాకు తెలిసినవి ఇతరులకి తెలపాలనే నా దృక్పథం కూడా ఇందుకు ఒక కారణం. తెవికీ లో నేను వ్రాసిన వ్యాసాలకి చిత్రాలు జత పరచవలసిన అవసరం రావటంతో ఈ మధ్యనే ఛాయాగ్రహణం కూడా ఈ జాబితాలో చేరింది.

[మార్చు] చిత్రలేఖనం

ఒక విధం గా చెప్పాలి అంటే "అది మా బ్లడ్ లో నే ఉంది"!!! మా పెదనాన్న గారి బావమరిది కళాకారుడే! అప్పట్లో ఆ ఊరిలో కటౌట్ లకి రామారావు గారి బొమ్మ అయినా, అక్కినేని గారి బొమ్మ ఆయినా ఆయనే వేసేవారు. మా పెదనాన్న గారి చిన్న కుమారుడూ కళాకారుడే!! కాని బ్రతుకు సమరం లో ఆయన కళ ని మరచిపోవలసి వచ్చింది. తర్వాత "కళామతల్లి" మా ఇంటిని చిన్నచూపు చూసిందనే చెప్పాలి. సైన్సు నోట్సుల్లో నేను మాత్రం చిత్రపటాలని బాగా వేసే వాడిని. మిక్కీ మౌస్, హీ మ్యాన్, బఫూన్ బొమ్మలని బాగా వేసే వాడిని. ఇది గమనించిన మా నాన్నారు చెన్నై నుండి ఒక సెల్ఫ్-లర్నింగ్ పెయింటింగ్ కోర్సుని తెప్పించారు. ఇప్పుడు కూడా నేను శని, ఆది వారాలలో నా సమయాన్ని చాలా వరకు చిత్రలేఖనానికే కేటాయిస్తూ ఉంటాను. బాపు, ఎం. ఎఫ్. హుసేన్, రాజా రవి వర్మ ల చిత్రపటాలు నాకు చాలా ఇష్టం. స్వాతి లో బాపు శైలిలో కరుణాకర్ వేసే బొమ్మలను కూడా ప్రయత్నిస్తుంటాను. ఇంటర్నెట్ లో వివిధ దేశాల చిత్రకారులు వేసిన చిత్రాలను సేకరిస్తూ ఉంటాను. మిఖేలేన్జీలో, పాబ్లో పికాసో వంటి గొప్ప కళాకారులు గీసిన చిత్రపటాలన్నీ నా దగ్గర ఉన్నాయి.

[మార్చు] భాషా పరిజ్ఞానం

తేనెలొలుకు తెలుగు అంటే నాకు ఎంత మక్కువో దొరల భాష అయిన ఆంగ్లం అన్నా అంతే ప్రీతి. నా చిన్నతనం లో తెలుగు సినిమాల కంటే హిందీ సినిమాలనే ఎక్కువ గా చూసేవాడిని. సాఫ్ట్ వేర్ రంగం లో ఎప్పటికైనా ఉపయోగపడతాయని తమిళం, కన్నడ రాయటం చదవటం నేర్చుకున్నాను. అల్లు అర్జున్ సినిమాలు మలయాళం లో కి అనువదించబడతాయని, మోహన్ లాల్, మమ్ముట్టి ల తర్వాత మలయాళీ లు మాట్లాడుకునేది మన వాడి గురించే అని తెలుసుకుని, దాన్ని కూడా ప్రారంభించాను. ఇది చూసిన మా నాన్నారు "నువ్ పని చేసే ఎస్.ఏ.పీ ని కనుగొన్నది జర్మన్ దేశీయులు కదా? మరి దానిని వదిలేసావే?" అన్నారు. కాబట్టి దాని పై కూడా ప్రస్తుతం దృష్టి సారిస్తున్నాను.

ఇన్ని భాషలలో ప్రవేశం ఉన్న నాకు ఏమనిపిస్తుందో తెలుసా? రాయలు అన్న

తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స

పలుకులు అక్షరసత్యాలు అని!!!

[మార్చు] నా చిరునామా

[మార్చు] పతకాలు

2010లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె