స్త్రీవాదం
వికీపీడియా నుండి
తెలుగు సాహిత్యంలో రెండు ఉద్యమాలు వ్యాప్తిచెందాయి. అందులో ఒకటి స్త్రీవాద ఉద్యమం లేదా స్త్రీవాదం (Feminism). స్త్రీవాద ఉద్యమం సాహిత్యానికి పరిమితమై స్త్రీలకు సామాజికపరమైన న్యాయం కోసం మొదలయ్యాయి.
భారతదేశ జనాభాలో సగంమంది స్త్రీలున్నా సాంఘికంగా స్త్రీ సమాజంలో మోసగింపబడుతోంది. కేవలం ఒక పనిముట్టుగా చూడబడుతుంది. వారికి ఆర్థిక స్వేచ్చ ఉండటం లేదు. మత గ్రంథాలలోను, సాహిత్యంలో కూడా స్త్రీ నీచంగా చిత్రించబడింది. వ్యాపార ప్రకటనలలో, సినిమాలలో స్త్రీని ఒక ఆటబొమ్మగా సెక్స్ సింబల్ గా మాత్రమే చూపిస్తున్నారు. అన్ని చోట్లా పురుషాధిక్యత తాండవిస్తోంది. కాబట్టి స్త్రీకి సాంఘిక న్యాయం చేకూరాలని స్త్రీవాదం బయలుదేరింది.
ఆశయాలు[మార్చు]
- స్త్రీలు వివక్షకు గురికావడాం పోవాలి.
- పురుషాధిక్యత నశించాలి.
- పితృస్వామ్యం పెట్టుబడిదారీ వ్యవస్థకి మరోపేరు. కాబట్టి పితృస్వామ్య వ్యవస్థ పోవాలి.
- మగవాళ్ళు ఉన్నతులు - స్త్రీలు అల్పులు అనే భేదభావం ఉండకూడదు.
- స్త్రీలు కేవలం ఇంటి చాకిరీ కోసం, సెక్సు సుఖాల కోసం, పిల్లల్ని కనటం కోసం అనే భావన తొలగిపోవాలి.
- విద్య, ఉద్యోగాలలో సమాన ప్రతిపత్తితో పాటు ఆర్థిక స్వాతంత్ర్యం కలిగివుండాలి