డాల్ఫిన్

వికీపీడియా నుండి

డాల్ఫిన్లు
శిలాజ విస్తృతి: Early Miocene - Recent
Bottlenose Dolphin breaching in the bow wave of a boat
Bottlenose Dolphin breaching in the bow wave of a boat
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: కార్డేటా
తరగతి: క్షీరదాలు
వర్గము: సిటేషియా
ఉపవర్గము: Odontoceti
కుటుంబము: డాల్ఫినిడే మరియు Platanistoidea
Gray, 1821
ప్రజాతులు
See article below.

డాల్ఫిన్ (Dophin) ఒక రకమైన సముద్రపు నీటిలో మరియు నదీ జలాల్లో నివసించే క్షీరదము. ఇవి యూధీరియా లోని సిటేషియా క్రమానికి చెందిన జంతువులు. ఇవి తిమింగళానికి దగ్గర సంబంధం కలవి. వీనిలో సుమారు 40 ప్రజాతులున్నాయి. మన దేశంలొ అంతరించి పోయే దశ లొ ఉన్న రివర్ డాల్పిన్స్ ని సంరక్షించటానికి, కేంద్ర ప్రభుత్వం డాల్పిన్ ని జాతీయ జలచరం గా ప్రకటించారు.


డాల్ఫిన్ పేరు ప్రాచీన గ్రీకు (delphís; "dolphin"), సంబంధిత గ్రీకు భాషలో(delphys; "womb") నుండి వచ్చినది. ఈ జంతువులను గర్భాశయం కలిగిన చేపలు గా భావించి ఇలా పిలిచేవారు ("a 'fish' with a womb").[1]


ఇవి 1.2 మీటర్ల (4 అడుగులు) మరియు 40 కిలోగ్రాములు (88 పౌండ్లు) (Maui's Dolphin) నుండి 9.5 మీటర్లు (30 అడుగులు) మరియు 10 టన్నులు (the Orca or Killer Whale) వరకు ఉంటాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి, ఎక్కువగా లోతు తక్కువగా ఉండే సముద్రపు అంచులలో జివిస్తాయి. ఇవి మాంసాహారులు, ఎక్కువగా చేపలు మరియు స్క్విడ్ లను తింటాయి. డాల్ఫిన్లు సిటేషియాలో పెద్ద కుటుంబం. ఇవి సుమారు 10 మిలియన్ సంవత్సరాల కాలంలో అనగా మియోసీన్ కాలం నుండి పరిణామం చెందాయి. డాల్ఫిన్ లను జంతువులన్నింటిలో చాలా తెలివైనవిగా భావిస్తారు. ఇవి చాల స్నేహపూర్వకంగా, సరదాగా ఆడుకోవడానికి మానవులకు దగ్గరగా ఉంటాయి. వీటిని పెంచే ప్రదేశాల్ని డాల్ఫినేరియమ్ అంటారు.

[మార్చు] వర్గీకరణ

Killer Whales, also known as Orcas

[మార్చు] మూలాలు

  1. The American Heritage® Dictionary of the English Language, Fourth Edition, online entry at Dictionary.com, retrieved December 17 2006.
పేజీకి సంభందించిన లింకులు