చిరాన్ ప్యాలెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిరాన్ ప్యాలెస్
చిరాన్ ప్యాలెస్
సాధారణ సమాచారం
రకంరాజభవనం
ప్రదేశంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
పూర్తి చేయబడినది1940
యజమానినిజాం వారసుడు ముక్రంజా

చిరాన్ ప్యాలెస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనంలో ఉన్న ప్యాలెస్.[1] 1940లో నిర్మించబడిన చిరాన్ ప్యాలెస్, 400 ఎకరాల్లో విస్తరించి ఉంది.

చరిత్ర[మార్చు]

ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పదవిలోకి వచ్చాక, తాను ఉంటున్న కింగ్ కోఠి ప్రాంతంలో రద్ది పెరగడంతో నగర శివారల్లో ఉన్న జూబ్లీ హిల్స్ లోని అటవీ ప్రాంతంలో 1940లో 6,000 చదరపు మీటర్లలో ఈ చిరాన్ ప్యాలెస్ నిర్మించుకున్నాడు.[2] 1967లో ఉస్మాన్ అలీ ఖాన్ పెద్ద కొడుకు ఆజంజాను కాదని, అతని కొడుకైన తన మనమడు ముక్రంజాను వారసుడిగా ప్రకటించి, అతని పట్టాభిషేకంలో ఈ ప్యాలెస్ ను వారసత్వ సంపదగా ఇచ్చాడు.[3] ముక్రంజా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాడు. ప్రతి ఏటా రెండుసార్లు హైదరాబాదుకి వచ్చి, ఈ ప్యాలెస్ లో గడుపుతాడు.[4]

నిర్మాణం[మార్చు]

నిజాం నవాబులకు చెందిన మిగిలిన రాజభవనాలకు భిన్నంగా ఉండి ఉన్న ఈ భవనం అనేక ఆధునిక సౌకర్యాలను కలిగి ఉంది. డూప్లెక్స్‌తో కూడి రెండు సెల్లార్‌లుగా ఉన్న ఈ ప్యాలస్‌లో సుమారు 30కి పైగా గదులు ఉన్నాయి. విశాలమైన కాన్ఫన్స్ హాల్, ఆయుధశాల, రెండు గెస్ట్‌రూంలతో పాటు మొదటి అంతస్థులో ఏడు బెడ్ రూంలు ఉన్నాయి. అక్కడ నిజాం తన భార్య, పిల్లలతో నివసించాడు.[2]

ఇతర వివరాలు[మార్చు]

  1. పీవీ నరసింహారావు ముఖ్యమంత్రి భూ పరిమితి చట్టం రావడంతో అనేక వాదోపవాదాలు, సుదీర్ఘ కోర్టు కేసుల తరువాత నిజాం వారసులకు కేవలం ఆరు ఎకరాల భూమి మాత్రమే ఇవ్వబడింది.
  2. 1998లో కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో జాతీయ పార్కుగా ప్రకటించబడింది.
  3. ఈ ప్యాలెస్ లో సినిమా షూటింగ్స్ కూడా జరుగుతాయి.[5]

మూలాలు[మార్చు]

  1. చిరాన్ ప్యాలెస్, ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 87
  2. 2.0 2.1 Prince Mukarram to give up Chiran Palace Archived 2012-04-05 at the Wayback Machine. The Times Of India, 9 July 2010. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "toi_mukarram" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. ఆంధ్రజ్యోతి, తెలంగాణ కథనాలు (16 September 2017). "నాడు రాజ ప్రాసాదంలో నేడు 2 గదుల్లో." Archived from the original on 25 April 2019. Retrieved 25 April 2019.
  4. చిరాన్ ప్యాలెస్, ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 87
  5. ఆంధ్రప్రభ, సినిమా (30 October 2017). "చిరాన్ ప్యాలెస్ లో మ‌హేష్ మూవీ షూటింగ్." Archived from the original on 25 April 2019. Retrieved 25 April 2019.

ఇతర లంకెలు[మార్చు]