చీపురు

వికీపీడియా నుండి

చీపురు

చీపురు లేదా పొరక నేలను, గదులను ఊడ్చి శుభ్రము చేయటానికి ఉపయోగించే గృహోపకరణము. ఆంధ్ర దేశములో సాంప్రదాయక చీపుర్లను పొరక గడ్డి (అరిస్టిడా)[1], బోద గడ్డి, కొబ్బరి ఆకుల ఈనెలతో తయారు చేస్తారు. రైతులో ఆరుబయట గరుకు నేలను శుభ్రపరచటానికి తాత్కాలికంగా కంది కట్టెలతోనూ, నూగు కట్టెలతోనూ చీపుర్లను తయారుచేసుకుంటారు. ఆ తరువాత కాలములో చీపురు అంచులను సులువుగా పట్టుకునేందుకు వీలుగా ఒక రేకు గొట్టంలో లేదా ప్లాస్టిక్ ట్యూబులో అమర్చడం ప్రారంభించారు. చీపురును మొత్తంగా చీపురు కట్ట అని, చిన్నచిన్న పుల్లల్ని చీపురు పుల్లలు అని వ్యవహరిస్తారు.

పాతకాలంలో కొంతమంది పనివారిని, పిల్లల్ని చీపురుతో కొట్టి శిక్షించేవారు.

  • హ్యారీ పాటర్ లో పొడుగాటి చీపురు మీద కూర్చుని గాలిలో ఎగురుకుంటూ 'క్విడిఛ్' ఆట ఆడతారు.

[మార్చు] మూలాలు

  1. CRC World Dictionary of Grasses By Umberto Quattrocchi పేజీ.158 [1]
"http://te.wikipedia.org/wiki/%E0%B0%9A%E0%B1%80%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B1%81" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు