జయ చెట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జయ చెట్టు
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
C. phlomidis
Binomial name
Clerodendrum phlomidis

జయ చెట్టూ ఔషధ మొక్కలకు సంబంధించిన పొద. ఇది Verbenaceae కుటుంబానికి చెందినది. దీని వృక్ష శాస్త్రీయ నామం Clerodendrum phlomidis. దీనిని కామన్ గా ఆర్నీ అని పిలుస్తారు. జయ చెట్టు భారత దేశం,పాకిస్తాన్ , శ్రీలంక , బర్మా దేశములలో కనిపిస్తుంది. తక్కువ కొండలు,అడవులలో , మైదానములలో , రోడ్ల ప్రక్కన , 1.5-3 మీటర్ల పొడవు, కాండం బూడిద రంగులలో , కొమ్మలువంకాయ రంగులో ఉంటాయి, అండాకారము నుండి 1.5-5 సెం.మీ పొడవు, 1-3 సెం.మీ వెడల్పు, ఆకుకాండాలు 2.5 సెం.మీ, పువ్వులు తెలుపు లేదా లేత పసుపు, 1.5 సెం.మీ. లతో కలిగి ఉంటాయి [1]

భారత దేశములో జయ చెట్టు ఆంధ్రప్రదేశ్ ( కర్నూలు, అనంతపురం, తూర్పు గోదావరి , గుంటూరు జిల్లాలలో), కర్ణాటక లోని బెలగావి, బళ్లారి, బీదర్, దావనగరే , ధార్వాడ్ , కలబురగి (గుల్బర్గా) హసన్,, కొడగు (కూర్గ్) , మైసూరు , రాయచూర్ జిల్లాలో , ,కేరళ లోని ఇడుక్కి , తిరువనంతపురం జిల్లాలలో ,ఒడిశా లోని అంగుల్ జిల్లా,తమిళనాడు లోని సేలం జిల్లాలలో ఈ జయచెట్టు పెరుగుదల కనిపిస్తుంది[2]

వివరణ

[మార్చు]

ఉపయోగాలు

[మార్చు]

జయ చెట్టు వేర్ల ద్వారా తయారు చేసిన చేదైన టానిక్ ను సేవించుట ద్వారా మశూచికం (అమ్మవారు) నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఈ చెట్టు ఆకుల నుండి తీసిన రసంను అశ్రద్ధ చేయబడ్డ సవాయి రోగ లక్షణాలు కలవారికి మందుగా ఉపయోగిస్తారు. భారతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఆరోగ్యం సమగ్ర దృక్పథాన్ని కలిగి ఉంటుంది. ఆయుర్వేద చికిత్సలో ముడి మందులు, ఆహారం, కొన్ని పద్ధతుల తో తమ ఆరోగ్యమును ప్రజలు పురాతన కలం నుంచి నేటి వరకు కాపాడుకుంటున్నారు.జయ చెట్టు మొక్కలుకూడా ప్రాచీన కాలం నుండి ఉపయోగించబడుతున్నాయి ఎందుకంటే ఇవి ప్రజల అవసరాలకు సరిపోతాయి, అందుబాటులో ఉంటాయి. జయ చెట్టు మొక్కలతో యాక్రిడ్, పొడి, తాపన, రోగ నిరోధక, జీర్ణ, కార్మినేటివ్, డిప్యూరేటివ్, ఎక్స్‌పెక్టరెంట్, యాంటిస్పాస్మోడిక్, ఉద్దీపన, ఆకలి, ఉబ్బసం, జ్వరాలు, రక్త వ్యాధి, కణితులు, మంటలు, మూర్ఛ, మలేరియా, పుండు, గాయాల చికిత్సలో వైద్యపరంగా ఉపయోగించబడుతుంది. ఆకులు జ్వరం ,ఎక్కిళ్ళలో వాడతారు . దాని ఉడికించిన ఆకులను సెఫాల్జియా , ఆప్తాల్మియాలో ఉపయోగిస్తారు, వెన్న పాలలో ఉడికించిన జయ చెట్టు ఆకులను చుక్కలుగా ,ఊపిరితిత్తుల యొక్క క్యాతరాల్ లో వాడతారు [3]


ఇవి కూడా చూడండి

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Clerodendrum phlomidis - Sage Glory Bower". www.flowersofindia.net. Retrieved 2020-09-24.
  2. "Herbarium JCB". flora-peninsula-indica.ces.iisc.ac.in. Retrieved 2020-09-24.
  3. "Clerodendrum Serratum.(L) : Traditional Uses And Recent Findings | PharmaTutor". www.pharmatutor.org. Retrieved 2020-09-24.
"https://te.wikipedia.org/w/index.php?title=జయ_చెట్టు&oldid=3850790" నుండి వెలికితీశారు