లామియేసి
వికీపీడియా నుండి
| మింట్ కుటుంబం | |||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Lemon balm (Melissa officinalis)
|
|||||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||
|
|||||||||||
|
|
|||||||||||
| Many, see text
Ref: Watson and Dallwitz |
లామియేసి (Lamiaceae) కుటుంబము నందు సుమారు 180 ప్రజాతులు, 3,500 జాతుల మొక్కలు ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఉష్ణ, సమశీతోష్ణ మండలాలఓ విస్తరించి ఉన్నాయి. భారతదేశంలో 64 ప్రజాతులు, 400 జాతులను గుర్తించారు.
[మార్చు] కుటుంబ లక్షణాలు
- గుల్మాలు, శాఖీయ భాగాలు కేశాలతో కప్పబడి ఉంటాయి.
- కాండము నలుపలకలుగా ఉంటుంది.
- సువాసన గల లఘుపత్రాలు, అభిముఖ డెకుసేట్ పత్ర విన్యాసము.
- థైర్పస్ లేదా వర్టిసిలాస్టర్ పుష్ప విన్యాసము.
- పాక్షిక సౌష్టవ యుతము, అండకోశాధిస్థిత పుష్పాలు.
- రెండు పెదవులుగా చీలిన ఆకర్షణ పత్రావళి.
- ద్విదీర్ఘ, మకుట దళోపరిస్థిత కేసరాలు.
- ద్విఫలదళ, సంయుక్త అండాశయము.
- పీఠ అండాన్యాసము.
- పీఠ సంబంధ కీలము.
- కార్సెరూలస్ ఫలము.
[మార్చు] ఆర్ధిక ప్రాముఖ్యత
ఈ కుటుంబములోని అనేక మొక్కల నుండి సుగంధ తైలం లభిస్తుంది.
- రోస్ మెరినస్ అఫిసినాలిస్ నుండి రోస్ మేరి తైలం తయారుచేస్తారు.
- లావెండ్యులా వీర పుష్పాలు, పత్రాల నుండి లావెండరు నూనెను తీస్తారు. దీనిని సబ్బులు, తలనూనెలు, పౌడరుల తయారీలో ఉపయోగిస్తారు.
- మెంథా జాతుల నుండి మింట్ తైలం లభిస్తుంది. దీనిని పిప్పర్ మింట్ లలోను, పౌడరులలోను, మందుగాను వాడతారు.
- సాల్వియా జాతుల నుండి సేజ్ తైలం లబిస్తుంది.
- థైమస్ వల్గారిస్ నుండి థైమాల్ లభిస్తుంది. దీనిని టూత్ పేస్టుల తయారీలో వాడతారు.
- కొన్ని మొక్కలు మందు మొక్కలుగా ఉపయోగపడతాయి. తులసి ఆకులను దగ్గు, జలుబు నివారణకు ఉపయోగిస్తారు.
- పుదీనా ఆకును ఆకు కూరగా వాడతారు.
- చాలా జాతులను సాల్వియా, కోలియస్, లావెండ్యులా జాతులను తోటలలో అందం కోసం పెంచుతారు.
[మార్చు] ముఖ్యమైన మొక్కలు
- ఆసిమమ్ - తులసి
- ల్యూకాస్ - తుమ్మి
- లావెండ్యులా - లావెండర్ మొక్క
- కోలియస్ ఆరోమాటికస్ - వాము ఆకు
- కోలియస్ బ్లూమై - నెమలి పింఛము
- లియోనైటిస్ ఆక్సిల్లారిస్ - రణభేరి
- మెంథా - పుదీనా
- విటెక్స్ నెగుండొ - వావిలి
- గుమ్మడి టేకు