వావిలి

వికీపీడియా నుండి
Vitex negundo
Vitex negundo leaves.jpg
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
(unranked) Eudicots
(unranked) Asterids
వర్గము: లామియేలిస్
కుటుంబము: లామియేసి
ప్రజాతి: విటెక్స్
జాతి: వి.నెగుండొ
ద్వినామము
విటెక్స్ నెగుండొ
లి.[1]

వావిలి (సంస్కృతం: సింధువార; ఆంగ్లం: Five-leaved chaste tree; హిందీ: Nirgundi) ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయ నామం విటెక్స్ నెగుండొ (Vitex negundo). దీని ఆకులను వినాయక వ్రత కల్ప విధానము లోని గణేష పత్రపూజలో ఉపయోగిస్తారు.

[మార్చు] లక్షణాలు

  • వావిలి ఒక పెద్ద పొద లేదా చిన్న వృక్షం.
  • వారాగ్రంతో భల్లాకారంగా ఉన్న పత్రకాలు గల 3-5 దళయుత హస్తాకార సంయుక్త పత్రాలు.
  • నిశ్చిత సమూహాలలో అమరిన నీలిరంగుతో కూడిన తెలుపు పుష్పాలు.
  • నల్లగా గుండ్రంగా ఉన్న టెంకగల ఫలాలు.

[మార్చు] ఉపయోగాలు

  • వావిలి ఆకులు వాత సంబంధమైన నొప్పులకు, శరీరముపైన వాపులను తగ్గించుటకు వాడతారు.[2] దీని పువ్వులను కలరావ్యాధిని, జ్వరమును, కాలేయపు మరియు గుండె జబ్బులను నివారించుటకు వాడతారు.
  • వావిలి చెట్టు కొమ్మలను కొడవలి పిడులకు విశేషంగా ఉపయోగిస్తారు.

[మార్చు] మూలాలు

  1. Vitex negundo information from NPGS/GRIN. www.ars-grin.gov. తీసుకొన్న తేదీ: 2008-03-13.
  2. సింధువార - వావిలి, పవిత్రవృక్షాలు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 2006, పేజీ: 119.
Wiktionary-logo-en.png
వావిలిచెట్టు గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
"http://te.wikipedia.org/w/index.php?title=వావిలి&oldid=727682" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు