జయచిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జయచిత్ర
జననం (1957-09-09) 1957 సెప్టెంబరు 9 (వయసు 66)
ఇతర పేర్లులక్ష్మి కృష్ణవేణి రోహిణి పార్వతీదేవి
క్రియాశీల సంవత్సరాలు1973 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిగణేష్ [1]
పిల్లలుఅమ్రేష్

జయచిత్రగా ప్రసిద్ధిచెందిన తెలుగు సినిమా నటి పూర్తి పేరు లక్ష్మి కృష్ణవేణి రోహిణి పార్వతీదేవి. ఈమె తల్లి అమ్మాజీ (తెలుగు సినిమాలలో జయశ్రీ) కూడా ఒక నటీమణి. ఈమె బాల్యంలో పాదుకాపట్టాభిషేకం సినిమాలో చిన్నప్పటి సీతగా, భక్తపోతన సినిమాలో పోతన కుమార్తెగా, జీవితం సినిమాలో శోభన్‌బాబు కూతురుగా నటించింది. ఈమె మద్రాసులో విద్యోదయా స్కూలులో పదవ తరగతి వరకు చదివింది. ఈమె చిన్నతనం నుండే వళువూర్ రామయ్య పిళ్ళె, వెంపటి చినసత్యం, ఎమ్‌.ఎస్.శైవా లవద్ద నృత్యాన్ని అభ్యసించింది. ఒకవైపు చదువుకుంటూనే తమిళచిత్రాలలో నటిస్తూ వచ్చింది. తరువాత సోగ్గాడు చిత్రంతో తెలుగు సినిమాలలో కథానాయికగా నటప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈమె ఇంచుమించు 200 పైగా సినిమాలలో నటించింది. [2]

తమిళనాడు ప్రభుత్వం ఈమెకు కళైమామణి పురస్కారం ఇచ్చి సత్కరించింది.

జయచిత్ర నటించిన తెలుగు చిత్రాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. TV9 Telugu, TV9 (5 December 2020). "ప్రముఖ సీనియ‌ర్ న‌టి ఇంట్లో విషాదం.. జయచిత్ర భర్త గణేష్ గుండెపోటుతో మృతి - Acttress jayachitra husband ganesh". Archived from the original on 9 మే 2021. Retrieved 9 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Sakshi (9 May 2021). "తల్లి ఆశీస్సులతో 16 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చా." Sakshi. Archived from the original on 9 మే 2021. Retrieved 9 May 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=జయచిత్ర&oldid=4086229" నుండి వెలికితీశారు