జవహర్ నవోదయ విద్యాలయం వర్గల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జవహర్ నవోదయ విద్యాలయం వర్గల్
స్థానం
సమాచారం
రకంప్రభుత్వ
Mottoప్రజ్ఞానః బ్రహ్మ
స్థాపన1987
ప్రిన్సిపాల్ఏం.వెంకటరమణ
తరగతులు6 నుండి 12వ తరగతి
విద్యార్ధుల సంఖ్య464
Campus size32-acre (130,000 m2)
Campus typeగ్రామీణ
పరీక్షల బోర్డుసిబిఎస్‌ఈ
Websitehttps://www.navodaya.gov.in/nvs/nvs-school/MEDAK/en/home/

జవహర్ నవోదయ విద్యాలయం వర్గల్(ఆంగ్లం:Jawahar Navodaya Vidyalaya, Hindi: जवाहर नवोदया विद्यलया) ఒక కేంద్ర ప్రభుత్వ పాఠశాల. ఇది ఉమ్మడి మెదక్ జిల్లా కోసం 1987లో స్థాపించబడింది. ఈ పాఠశాలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన విద్యాశాఖ నిర్వహిస్తుంది. భారతదేశంలో మొత్తం 661 నవోదయ విద్యాలయాలున్నాయి, వీటన్నింటిని నవోదయ విద్యాలయ సమితి నిర్వహిస్తోంది.[1]

సంక్షిప్తంగా దీన్ని జేఎన్వీ వర్గల్ అని పిలుస్తారు.

చరిత్ర[మార్చు]

1986లో నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఈ నవోదయ విద్యాలయాలు చేయబడ్డాయి. వాటిల్లో ఒకటి ఈ జేఎన్వీ వర్గల్.[2]

ప్రవేశ విధానం[మార్చు]

ప్రతి సంవత్సరం 6వ తరగతికి 80 మంది విద్యార్థులను తీసుకుంటారు. ప్రతి సంవత్సరం సుమారు 10000 నుండి 20000 దరఖాస్తులు వస్తాయి, జేఎన్వీఎస్టి(JNVST) ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక విధానం కొనసాగుతుంది.[3][4]

తరగతులు 9 ఇంకా 11 లో కూడా పాఠశాలలో ఉన్న ఖాళీలను బట్టి దరఖాస్తుల ద్వారా ప్రవేశం ఉంటుంది.

విద్య, వసతి[మార్చు]

ఈ పాఠశాలలో 6 నుండి 12వ తరగతి వరకు విద్యార్థులకు చదువు చెప్తారు. అన్ని తరగతుల వారికి సి.బి.యస్.ఈ సిలబస్ ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన ఉంటుంది. ముప్పై మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పాఠశాలలో పాఠశాల భవనం, విద్యార్థులకు ఇంకా ఉపాధ్యాయులకు వసతి గృహములు ఉన్నాయి. ఆడుకోవడానికి విశాలమైన మైదానం ఉంది, ఈ పాఠశాల మైదానం దక్షిణ భారతదేశంలోనే అత్యంత పెద్ద రన్నింగ్ ట్రాక్ కలిగి ఉంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "home". www.navodaya.gov.in. Retrieved 2021-07-05.
  2. "29 years and 589 schools later, Rajiv brainchild a rural hit - Times of India". The Times of India. Retrieved 2021-07-05.
  3. "School Education | Government of India, Ministry of Education". www.education.gov.in. Archived from the original on 2021-07-09. Retrieved 2021-07-05.
  4. "JNV class 6 admissions begin, here's all you need to know". The Indian Express (in ఇంగ్లీష్). 2020-11-04. Retrieved 2021-07-05.