జానకీ దేవి బజాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జానకీ దేవి బజాజ్ ( 1893 జనవరి 7 - 1979 మే 21) 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలు శిక్ష అనుభవించిన ఒక భారతీయ స్వాతంత్ర్య సమర యోధురాలు.[1][2]

ప్రారంభ జీవితం, వృత్తి[మార్చు]

ఆమె 1893 జనవరి 7న మధ్యప్రదేశ్‌లోని జాయోరాలో అగర్వాల్ కుటుంబంలో జన్మించింది. ఎనిమిదేళ్ల వయసులో, ఆమె 12 ఏళ్ల జమ్నాలాల్ బజాజ్ ను వివాహం చేసుకుంది. జమ్నాలాల్ కుడా స్వాతంత్ర్య పోరాట ఉద్యమంలో పాల్గొన్నాడు, జానకీదేవి కూడా చరఖాపై ఖాదీ వడకడం, గోసేవ, హరిజనుల జీవితాల మెరుగుదల, వారి ఆలయ ప్రవేశం కోసం 1928లో పొరాడింది. స్వాతంత్ర్యం తర్వాత, ఆమె వినోబా భావేతో కలిసి భూదాన్ ఉద్యమంలో పనిచేసింది. ఆమె 1942 నుండి చాలా సంవత్సరాలు అఖిల భారతీయ గోసేవా సంఘ్ అధ్యక్షురాలిగా పనిచేసింది. ఆమెకు 1956లో పద్మవిభూషణ్ రెండవ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఆమె 1965లో మేరీ జీవన్ యాత్ర పేరుతో తన ఆత్మకథను ప్రచురించింది.[3]

వారసత్వం[మార్చు]

జానకీ దేవి బజాజ్ 1979లో మరణించింది. ఆమె జ్ఞాపకార్థం జానకీ దేవి బజాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, జానకీ దేవి బజాజ్ గవర్నమెంట్ పిజి గర్ల్స్ కాలేజ్ కోట, బజాజ్ ఎలక్ట్రికల్స్, జానకీదేవి బజాజ్ గ్రామ వికాస్ సంస్థ వంటి అనేక విద్యా సంస్థలు స్థాపించబడ్డాయి. ఇండియన్ మర్చంట్స్ ఛాంబర్ లేడీస్ వింగ్ 1992-93 సంవత్సరంలో గ్రామీణ పారిశ్రామికవేత్తల కోసం ఐఎంసి-లేడీస్ వింగ్ జానకీదేవి బజాజ్ పురస్కారాన్ని స్థాపించింది.[4][5]

రచనలు[మార్చు]

జానకీ దేవి, మేరీ జీవన్ యాత్ర (నా జీవన యాత్ర) పేరుతో తన ఆత్మ కథను రచించింది.[6]

మూలాలు[మార్చు]

  1. "The Story of Jankidevi Bajaj, Who Gave up Gold, Silks & Purdah to Inspire Hundreds of Indian Women". The Better India (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-09-03. Retrieved 2018-04-26.
  2. "In Bajaj family, business sense over-rules ties". The Financial Express (India). 6 April 2012.
  3. Bharti Thakur (2006). Women in Gandhi's mass movements. Deep and Deep Publications. p. 118. ISBN 8176298182.
  4. "Padma Awards Directory (1954-2007)" (PDF). Ministry of Home Affairs (India). 2007-05-30. Archived from the original (PDF) on 10 April 2009.
  5. "In Bajaj family, business sense over-rules ties". The Financial Express (India). 6 April 2012.
  6. "Jankidevi Bajaj Gram Vikas Sanstha". Bajaj Electricals. Archived from the original on 2016-03-15. Retrieved 2021-11-03.