Jump to content

జామా మస్జిద్ (ఢిల్లీ)

వికీపీడియా నుండి
జామా మస్జిద్, ఢిల్లీ.
మజ్సిద్ ఎ జహాఁ నుమా (జామా మస్జిద్) ఢిల్లీ.

మస్జిద్-ఎ-జహాఁ నుమా (ఆంగ్లం : Masjid-i-Jahan Numa, హిందీ : मस्जिद-ए-जहां नुमा, ఉర్దూ : مسجد جھان نمہ), దీనికి సాధారణ నామం జామా మస్జిద్ (జుమ్మా మసీదు లేదా జామా మసీదు) जामिया/जामा मस्जिद , ఢిల్లీ లోని ప్రధాన మస్జిద్. దీనిని ఐదవ మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించాడు. దీని నిర్మాణం 1656 లో పూర్తయింది. ఈ మస్జిద్, భారత్ లో అతిపెద్ద, అతి సుందరమైన మస్జిద్. ఢిల్లీ లోని, జనసందోహాల ప్రాంతమైన చాందినీ చౌక్ ప్రాంతంలో గలదు.

మస్జిద్ ఎ జహాఁ నుమా అనగా ప్రపంచ వీక్షణా మస్జిద్, జామా మస్జిద్ అనగా, శుక్రవారపు ప్రార్థనలకు ఉద్దేశ్యించిన సార్వత్రిక మస్జిద్. దీని ప్రాంగణంలో దాదాపు 25,000 నమాజీలు (ప్రార్థనలు చేయువారు) ప్రార్థనలు చేసే సదుపాయం గలదు. ఈ మస్జిద్ లో పురావస్తువులు (relics) ఉన్నాయి. ఉదాహరణకు, "జింకచర్మంపై లిఖించబడిన ఖురాన్ ప్రతి".

1852 లో జామా మస్జిద్, ఢిల్లీ.

చిత్ర మాలిక

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

ఈ మస్జిద్ ను నిర్మించుటకు 5,000 మంది పనివారు, ఆరు సంవత్సరాలకాలం పాటు పనిచేశారు.[1]

దీనికైన ఖర్చు, ఆ కాలంలో పది లక్షల రూపాయలు.

ఇవీ చూడండి

[మార్చు]

నోట్స్

[మార్చు]
  1. "Heaven on Earth: Islam", November 23, 2004 video documentary, History Channel. Producer/director, Stephen Rooke. Scriptwriter/host: Christy Kenneally

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]