Coordinates: 16°05′12″N 79°43′32″E / 16.086713°N 79.725601°E / 16.086713; 79.725601

జాలలపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జాలలపాలెం పల్నాడు జిల్లా, వినుకొండ మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.

జాలలపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
జాలలపాలెం is located in Andhra Pradesh
జాలలపాలెం
జాలలపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°05′12″N 79°43′32″E / 16.086713°N 79.725601°E / 16.086713; 79.725601
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం వినుకొండ
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522647
ఎస్.టి.డి కోడ్

గ్రామంలోని మౌలిక వసతులు[మార్చు]

వ్యక్తిగత మరుగుదొడ్ల సౌకర్యం[మార్చు]

వినుకొండ మండలంలో విసిరేసినట్లు ఒక మూలన ఉండే చిన్నపల్లె, జాలలపాలెం. మరుగుదొడ్ల సౌకర్యంలేని ఈ గ్రామంలో పారిశుద్ధ నిర్వహణ అంతంతమాత్రమే. జననివాసాలు 196 ఉండగా, అందులో 145 ఇళ్ళకు మరుగుదొడ్లు లేవని, 2013లోనే గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు నిర్వహించిన సర్వేలో తేలినది. ఆ తరువాత 22 మంది స్వంతంగా నిర్మించుకున్నారు. మిగిలిన 123 మందిలో అధికశాతం దళితులు, ఆర్థిక వెసులుబాటు లేనివారే. ఈ పరిస్థితులలో ప్రభుత్వం రు. 10,900-00 విడుదల చేయడంతో, సగం మంది ముందుకు వచ్చి, నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ స్వయంగా మిగిలిన లబ్దిదారుల ఇళ్ళకు వెళ్ళి, నచ్చజెప్పి, దగ్గరుండి గుంతలు తీసి పని మొదలు పెట్టించగా గ్రామస్థులు ముందుకు వచ్చి, మిగిలిన పనులు పూర్తిచేయించుకున్నారు. ఈ విధంగా ఈ గ్రామం, అందరికన్నా ముందుగా, 100% మరుగుదొడ్లు నిర్మించుకున్న గ్రామంగా గుర్తింపు తెచ్చుకున్నది. ఈ సంవత్సరం నిర్మల్ భారత్ అభియాన్ పురస్కారానికి గూడా అర్హత సాధించినది.[1]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు గుంటూరు రూరల్; 2014, అక్టోబరు-2; 16వపేజీ.